ఆవిడా మా ఆవిడే
ఆవిడా మా ఆవిడే | |
---|---|
దర్శకత్వం | ఇ.వి.వి.సత్యనారాయణ |
నిర్మాత | డి. కిషోర్ |
తారాగణం | నాగార్జున టబు హీరా |
సంగీతం | శ్రీ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | జనవరి 14, 1998 |
సినిమా నిడివి | 153 ని. |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఆవిడా మా ఆవిడే 1998 లో ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన సినిమా. నాగార్జున, టబు, హీరా ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.[1] ఈ సినిమాకు డి. కిషోర్ నిర్మాతగా వ్యవహరించగా మురళీమోహన్ సమర్పణలో జయభేరి ఆర్ట్స్ పతాకంపై నిర్మితమైంది. శ్రీ కొమ్మినేని ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
కథ
[మార్చు]హైదరాబాదులో సి. ఐ. విక్రాంత్ తండ్రి అతన్ని పెళ్ళి చేసుకోమని పోరుతూ ఉంటాడు. ఒకానొక పోలీస్ ఎన్ కౌంటర్ లో అతనికి అర్చన అనే ఎస్. ఐ తారసపడి, తర్వాత వారి పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ పెళ్ళి చేసుకుంటారు. వారికి ఒక కొడుకు కూడా పుడతాడు. కొద్దిరోజులకు ఒక నేరస్థుడిని తరలిస్తుండగా పోలీసు జీపు తగలబడిపోయి అందులో అర్చన, ఆమె కొడుకు ఇద్దరూ మరణిస్తారు. విక్రాంత్ వాళ్ళిద్దరినీ మరిచిపోలేకపోతాడు. తల్లిదండ్రుల బలవంతంమీద విక్రాంత్ మళ్ళీ ఝాన్సీని పెళ్ళి చేసుకొంటాడు. పెద్దలు ఝాన్సీకి విక్రాంత్ గతం తెలియనివ్వరు. కానీ విక్రాంత్ కి మాత్రం ఝాన్సీకి అంతా నచ్చజెప్పామని చెబుతారు.
కొద్ది రోజుల తర్వాత అర్చన, ఆమె కొడుకు తిరిగి వస్తారు. ప్రమాదంలో తాము మరణించలేదనీ, తీవ్రవాదులు తమను అపహరించారని చెబుతుంది. ఆమె విక్రాంత్ తో కలిసి ఝాన్సీతో ఉన్న అపార్టుమెంటులోనే కాపురం పెడుతుంది. అర్చన, ఝాన్సీలు ఇద్దరూ తమకు ఒకే పోలికలున్న ఇద్దరు భర్తలు ఉన్నారనుకుంటారు. విక్రాంత్ వారిద్దరికీ అనుమానం రాకుండా తంటాలు పడుతుంటాడు.
తారాగణం
[మార్చు]- విక్రాంత్ గా నాగార్జున
- అర్చనగా టబు
- ఝాన్సీగా హీరా
- గిరిబాబు
- కోట శ్రీనివాసరావు
- శ్రీహరి
- బ్రహ్మానందం
- మల్లికార్జున రావు
- ఎ. వి. ఎస్
- చక్రవర్తి
- రమాప్రభ
- గరిమెళ్ళ విశ్వేశ్వరరావు
- గాదిరాజు సుబ్బారావు
- ఐరన్ లెగ్ శాస్త్రి
- సన
- అనురాధ
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి శ్రీ సంగీతం అందించాడు.[2]
ఈ చిత్రం లోని అన్ని పాటలు సిరివెన్నెల సీతారామశాస్త్రి రచన చేసినాడు .
- చుమ్మా దే చుమ్మా దే , గానం. రాజేష్, పూర్ణిమ
- తథహ తథహ , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత
- హే వస్తావా , గానం. శ్రీ, అనురాధ శ్రీరామ్
- ఓం నమామి, గానం. హరిహరన్, కె ఎస్ చిత్ర
- ఇంటికెళదాం పదవమ్మో , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
- టూ ఇన్ వన్ , రచన: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత, అనూరాధ శ్రీరామ్
మూలాలు
[మార్చు]- ↑ "ఆవిడా మా ఆవిడే". Times of India.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (13 September 2015). "సంగీత దర్శకుడి శ్రీ జయంతి". andhrajyothy.com. Archived from the original on 2 August 2020. Retrieved 2 August 2020.