గరిమెళ్ళ విశ్వేశ్వరరావు
Jump to navigation
Jump to search
గరిమెళ్ళ విశ్వేశ్వరరావు | |
---|---|
జననం | 1962 కాకినాడ |
మరణం | 2024 ఏప్రిల్ 1 చెన్నై | (వయసు 61–62)
వృత్తి | నటుడు |
గరిమెళ్ళ విశ్వేశ్వరరావు తెలుగు సినీ నటుడు. బాలనటుడిగా ప్రస్థానం ప్రారంభించి తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 150కి పైగా సినిమాలలో సహాయ పాత్రలు, హాస్య పాత్రలు పోషించాడు.[1]
జీవితం
[మార్చు]కాకినాడకు చెందిన విశ్వేశ్వరరావు చిన్నతనంలో తండ్రి హరికథలు చెబుతుండగా ఆసక్తితో నేర్చుకున్నాడు. పద్మనాభం సినిమా పొట్టి ప్లీడరులో బాల నటుడిగా వేషం వేశాడు. బాలభారతం సినిమాలో శ్రీదేవి సరసన నటించాడు. సినిమాలు చేస్తూనే ఎం.ఎస్సీ చదివి పూర్తి చేశాడు. సినిమాలలో అవకాశాలు పెద్దగా లేకపోవడంతో ఒక ఫార్మాస్యూటికల్ సంస్థలో రెప్రెజెంటేటివ్ గా చేరి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై నగరాలు తిరిగేవాడు.
ఏప్రిల్ 1, 2024 న చెన్నైలో కన్ను మూశాడు.[2]
సినిమాలు
[మార్చు]- పొట్టి ప్లీడరు
- బాలభారతము
- ముఠా మేస్త్రి
- బిగ్ బాస్
- మెకానిక్ అల్లుడు
- ప్రెసిడెంటు గారి పెళ్ళాం
- ఆయనకి ఇద్దరు
- అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి
- కథానాయకుడు
మూలాలు
[మార్చు]- ↑ "చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. హాస్యనటుడు విశ్వేశ్వరరావు కన్నుమూత". EENADU. Retrieved 2024-04-02.
- ↑ డీవీ. "సీనియర్ నటుడు విశ్వేశ్వరరావు కన్నుమూత". telugu.webdunia.com. Retrieved 2024-04-02.