వద్దు బావా తప్పు
వద్దు బావా తప్పు (1993 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | కె.అజయకుమార్ |
నిర్మాణం | పి.పురుషోత్తమరావు సి.కళ్యాణ్ (సమర్పణ) |
కథ | సి.కళ్యాణ్ రమణి |
చిత్రానువాదం | కె. అజయ్ కుమార్ |
తారాగణం | రాజేంద్ర ప్రసాద్, రవళి |
సంగీతం | ఎం.ఎం.కీరవాణి |
ఛాయాగ్రహణం | లోక్ సింగ్ |
కూర్పు | కె. రమేష్ |
నిర్మాణ సంస్థ | శ్రీ అమూల్య ఆర్ట్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
వద్దు బావ తప్పు 1994 లో వచ్చిన హాస్య చిత్రం. శ్రీ అమూల్య ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై పి పురుషోత్తమ రావు, C. కళ్యాణ్ నిర్మించారు [1] కె అజయ్ కుమార్ దర్శకత్వం వహించాడు.[2] ఇందులో రాజేంద్ర ప్రసాద్, రవళి, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటించారు. విద్యాసాగర్ సంగీతం సమకూర్చాడు. మరాఠీ చిత్రం కిస్ బాయి కిస్ (1988) దీనికి మాతృక. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నమోదైంది.[3]
కథ[మార్చు]
రాజా (రాజేంద్ర ప్రసాద్) అనే మధ్యతరగతి నిరుద్యోగి, సింహాచలం (ఎవిఎస్) అనే ధనవంతుడి కుమార్తె మంజు (రవళి) ను కలుస్తాడు. ఇద్దరూ ప్రేమలో పడతారు. సింహాచలం పేద ప్రజలను ఇష్టపడకపోవడంతో, రాజా మంజు తమ ఉమ్మడి స్నేహితుడు సతీష్ (రాజ్ కుమార్) సహాయంతో రహస్యంగా పెళ్ళి చేసుకుంటారు. పెళ్ళి తరువాత, వారు సతీష్ బంగ్లాలో బస చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న సింహాచలానికి గుండెపోటు వస్తుంది. కొంచెం కోలుకున్న తరువాత, అతను తన కుమార్తెను, అల్లుడినీ కలవాలనుకుంటాడు. అతను తన కుటుంబంతో సహా సతీష్ బంగ్లాకు వచ్చినప్పుడు, సతీష్‌ను తన అల్లుడి గాను, రాజాను అతడి పనివాడి గానూ తప్పుగా అనుకుంటాడు; ఇప్పుడు రాజా సింహాచలం ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా సేవకుడి గానే కొనసాగాల్సి వస్తుంది. మంజు చెల్లెలు ప్రియా (ఇంద్రజా) రాజాను ప్రేమించడంతో పరిస్థితులు రోజురోజుకూ క్లిష్టంగా మారతాయి. ఈ సమస్యలన్నిటి నుండి వాళ్ళు ఎలా బయటపడతారనేది మిగతా కథ.
నటీనటులు[మార్చు]
- రాజేంద్ర ప్రసాద్ ... రాజా
- రవళి ... మంజు
- ఇంద్రజ
- రాజ్ కుమార్ ... సతీష్
- బాబు మోహన్
- ఎ.వి.యస్.సుబ్రమణ్యం
- వై. విజయ
- గుండు హనుమంతరావు
- ఐరన్ లెగ్ శాస్త్రి
- శివాజీ రాజా
పాటలు[మార్చు]
సం. | పాట | పాట రచయిత | గాయనీ గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "మై డియర్ మరదలుజీ" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | మనో, సుజాత | 3:54 |
2. | "పిడత మీద పిడత" | సాయి శ్రీహర్ష | వందేమాతరం శ్రీనివాస్, ఎస్.పి.శైలజ | 3:44 |
3. | "ఓ ప్రేమ శాస్త్రీ" | భువనచంద్ర | మనో, సింధు | 4:10 |
4. | "హలో హలో శ్రీవారు" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | వందేమాతరం శ్రీనివాస్, కె.ఎస్.చిత్ర | 3:39 |
5. | "ఓరయ్యో యో యో" | సాహితి | మనో, స్వర్ణలత | 3:59 |
Total length: | 19:26 |
బయటి లింకులు[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "Vaddu Bava Thappu (Banner)". Knowyourfilms.
- ↑ "Vaddu Bava Thappu (Direction)". FilmiClub.
- ↑ "Vaddu Bava Thappu (Review)". The Cine Bay.