చిలక్కొట్టుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిలక్కొట్టుడు
Chilakkottudu.jpg
దర్శకత్వంఈ.వి.వి.సత్యనారాయణ
నిర్మాతఎం. బాలాజీ నాగలింగం
నటవర్గంజగపతి బాబు,
కస్తూరి
సంగీతంకోటి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీలు
1997 జనవరి 4 (1997-01-04)[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

చిలక్కొట్టుడు 1997 తెలుగు హాస్యభరిత చిత్రం. ఇది సాయి కృప ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఎం. బాలాజీ నాగలింగం నిర్మించగా, ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, మధుబాల, గౌతమి, కస్తూరి, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో రమ్య కృష్ణ అతిధి పాత్రలో నటించింది కోటి పాటలు స్వరపరిచాడు. ఈ చిత్రం మలయాళ చిత్రం బోయింగ్ బోయింగ్ కి పునర్నిర్మాణం.

కథ[మార్చు]

జగపతి బాబు ఆడవాళ్ళను ఆడుకుని వదిలేసే ప్లేబోయ్. తన మాయతో ఆడవాళ్ళను ఒక రాత్రి వాడుకుని వదిలేస్తుంటాడు. అతను, అతని స్నేహితుడు రాజేంద్ర ప్రసాద్ ఫోటోగ్రాఫర్స్. ఒకసారి విమానాశ్రయంలో మధు, గౌతమి, కస్తూరి అనే ముగ్గురు ఎయిర్ హోస్టెస్లను చూస్తాడు, వారి కోసం వెంటపడతాడు. ఒక రాత్రి బొంబాయి పాపతో గడుపుతాడు. అతను బిలియనీర్ అని అబద్ధం చెప్పడానికి ప్రసాద్, బ్రహ్మానందం ను ఉపయోగిస్తాడు. అంతేకాక శ్రీదేవి, మాధురి దీక్షిత్, మనీషా కొయిరాలా అతన్ని ముగ్గురు ఎయిర్ హోస్టెస్ల ముందు వివాహం చేసుకోవాలని కోరుకుంటారు. అతను బిలియనీర్ అని వారు నమ్ముతారు.

వీళ్ళిద్దరూ యజమాని తెలియకుండా తాగుబోతు అయిన ఎ. వి. ఎస్. ఇంటిని వాచ్ మాన్ సహాయంతో వాడుకుంటూ ఉంటారు. వారు ఎయిర్ హోస్టెస్లను ట్రాప్ చేయడానికి ఆ ఇంటిని ఉపయోగిస్తుంటారు. జగపతి, ప్రసాద్ ఇంద్రజ అనే ఆమె చిత్రాలు తీయడం కోసం ఆమెఇంటికి వెళతారు. జగపతి బాబు ఆమెను ప్రేమలో పడేసి ఆమెను కూడా అనుభవిస్తాడు.

ముగ్గురు ఎయిర్ హోస్టెస్ ఎప్పుడూ అతని ఇంటికి వస్తుంటారు. తరువాత, జగపతి, మధు శారీరకంగా ఒకటవుతారు. ఒకసారి ప్రసాద్ ని జగపతిగా అని భావించి అతన్ని ముద్దు పెట్టుకుంటుంది మధు. ప్రసాద్ ఆమె ప్రేమలో పడతాడు. ఇది తెలుసుకున్న జగపతి ప్రసాద్‌ తో గొడవపడతాడు. జగపతి రాజీపడి ప్రసాద్ కోసం ఆమెను విడిచిపెడతానని చెప్పాడు. ఇంద్రజ గర్భవతి అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తండ్రి కడప కోటయ్య జగపతిని చంపడానికి వెళ్తాడు. అక్కడ, నలుగురు మహిళలు తమ ప్రేమికుడు ఒకే వ్యక్తి అని తెలుసుకుంటారు. జగపతి, ప్రసాద్, బ్రహ్మానందం అక్కడి నుంచి తప్పించుకుంటారు. జగపతిని బొంబాయి పాప అతన్ని అరెస్టు చేయిస్తుంది. ప్రసాద్, బ్రహ్మానందంలను సిబిఐ అధికారులు మల్లికార్జున రావు, ఐరన్‌లెగ్ శాస్త్రి పట్టుకుంటారు.

తారాగణం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Chilakkottudu (1997)". Indiancine.ma. Retrieved 2020-08-06.