బద్రి (2000 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బద్రి
Badri Telugu.jpg
దర్శకత్వంపూరి జగన్నాధ్
నటులుపవన్ కళ్యాణ్ ,
అమీషా పటేల్,
రేణూ దేశాయ్,
ప్రకాష్ రాజ్
సంగీతంరమణ గోగుల
నిర్మాణ సంస్థ
విజయలక్ష్మీ ఆర్ట్ మూవీస్
విడుదల
2000 ఏప్రిల్ 20 (2000-04-20)
భాషతెలుగు

బద్రి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 2000 లో విడుదలై ఘనవిజయం సాధించిన చిత్రం. పవన్ కల్యాణ్, అమీషా పటేల్, రేణు దేశాయ్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. రమణ గోగుల అందించిన ఈ చిత్ర సంగీతం కూడా మంచి విజయం సాధించింది. ఈ చిత్రం 47 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్నది.

కథ[మార్చు]

బద్రీనాథ్ (పవన్ కల్యాణ్) ఒక యాడ్ ఏజెన్సీ నడుపుతుంటాడు. అతని తల్లిదండ్రులు (కోట శ్రీనివాస రావు, సంగీత) అమెరికాలో స్థిరపడి ఉంటారు. వారి కుటుంబానికి బాగా కావలసిన వెన్నెల (రేణు దేశాయ్) కూడా వాళ్ళింట్లోనే ఉంటుంది. బద్రిని ప్రేమిస్తుంటుంది.

నిర్మాణం[మార్చు]

అభివృద్ధి[మార్చు]

సినిమాకు దర్శకత్వం వహించేందుకు అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో బద్రి సినిమాకు తయారుచేసుకున్న కథను పూరీ జగన్నాథ్ అప్పటికే హీరోగా నిలదొక్కుకున్న పవన్ కళ్యాణ్ కి చెప్పాలని ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు ద్వారా పవన్ కళ్యాణ్ ని కలిసి కథ చెప్పేందుకు అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించారు. అయితే ముందుగా తనకి కథ చెప్పాలని, ఆయనకు నచ్చితేనే పవన్ కళ్యాణ్ కి చెప్పే అవకాశమిస్తామని ఛోటా చెప్పారు. అయితే ఇద్దరు హీరోయిన్లతో ప్రేమ పేరుతో జరిగే ఆటలాంటి బద్రి కథ ఓ పట్టాన ఎవరికీ వినీవినగానే నచ్చే అవకాశాలు తక్కువ. అదే కథ చెప్పేస్తే ఛోటాకి నచ్చకపోవచ్చేమోనని, దాంతో పవన్ కి కథ చెప్పే అవకాశమే కోల్పోవాల్సివస్తుందని భయపడ్డారు పూరీ. దాంతో ఛోటా కె.నాయుడుకి బద్రి సినిమా కథ కాక, తాను రెడీ చేసుకున్న ఆత్మహత్యల నేపథ్యం ఉన్న ప్రేమకథని చెప్పారు. తర్వాతి కాలంలో అదే ప్రేమకథ ఇట్లు శ్రావణి సుబ్రమణ్యంగా తీశారు. ఆయనకి కథ బాగా నచ్చేయడంతో క్లుప్తంగా కథ వివరాలు పవన్ కళ్యాణ్ కి చెప్పి పూరీ జగన్నాథ్ కి ఆయన్ని కలిసే అవకాశం ఏర్పాటుచేశారు. అయితే ఆ అవకాశం రాగానే పూరీ జగన్నాథ్ బద్రి సినిమా కథనే వివరించారు. పవన్ కళ్యాణ్ కి కథ బాగా నచ్చి సినిమాని ఓకే చేశారు. అయితే "ఇది సూసైడ్ నేపథ్యంలోని ప్రేమకథ అన్నారు ఛోటా, మరి ఇందులో సూసైడ్ కాన్సెప్టే లేదేంటి?" అంటూ ప్రశ్నించారు. పూరి జగన్నాథ్ జరిగినదంతా వివరించగా, ఆ సమయంలో పూరీ ఆందోళన అర్థం చేసుకున్న పవన్ సరేనన్నారు.[1]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

  • హే చికితా.. గుమాస్తాస్
  • ఓ మిస్సమ్మా మిస్సమ్మా యమ్మా...

మూలాలు[మార్చు]

  1. రిపోర్టర్. "బద్రి వెనుక స్టోరీ". గ్రేటాంధ్ర. Retrieved 12 August 2015.

బయటి లంకెలు[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో బద్రి