చిలకపచ్చ కాపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిలకపచ్చ కాపురం
దర్శకత్వంకోడి రామకృష్ణ
నిర్మాతసి. సురేంద్ర రాజు
తారాగణంజగపతిబాబు ,
మీనా ,
సౌందర్య
సంగీతంవిద్యాసాగర్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1995 జూలై 2 (1995-07-02)[1]
భాషతెలుగు

చిలకపచ్చ కాపురం 1995 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా.[2] ఇందులో జగపతి బాబు, సౌందర్య, మీనా ముఖ్య పాత్రల్లో నటించారు.

కథ[మార్చు]

ఓ గ్రామంలో నివసించే బావ బావమరుదులు పరశురామయ్య, బుల్లెబ్బాయి మధ్య పరస్పర విరోధం కలుగుతుంది. ఇద్దరూ గ్రామంలో పెద్ద మనుషులే. ఆ గ్రామంలోనే గోదావరి నది మీద పడవ నడుపుకునే గోపాలకృష్ణ ఊర్లో వారందరికీ తలలో నాలుకలా ఉంటాడు. పరశురామయ్య, బుల్లెబ్బాయి ఇద్దరికీ ఇతనంటే అభిమానమే. అదే చొరవతో గోపాలకృష్ణ వీరిద్దరి కుటుంబాలను కలపాలని ప్రయత్నిస్తుంటాడు.

పరశురామయ్య కూతురైన సత్యవతి గోపాలకృష్ణ బాల్య స్నేహితురాలు. ఆమె గోపాలకృష్ణను మనసులోనే ఆరాధిస్తుంటుంది కానీ అతను మాత్రం ఆమెను ఓ స్నేహితురాలిగా మాత్రమే చూస్తుంటాడు. బుల్లెబ్బాయి పట్నం నుంచి రాధ అనే అమ్మాయిని తెచ్చి తన ఇంట్లో ఉంచుకుంటాడు. గోపాలకృష్ణ ఆమెను మొదటిసారి చూడగానే మనసు పారేసుకుంటాడు. రాధ తన అవసరాలు తీర్చడానికి గోపాలకృష్ణతో తప్ప బయటి వాళ్ళెవ్వరితోనూ కలవదు.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ సినిమాకు విద్యాసాగర్ సంగీత దర్శకత్వం వహించాడు.

మూలాలు[మార్చు]

  1. "చిలకపచ్చ కాపురం". thetelugufilmnagar.com. Retrieved 12 February 2018.
  2. "చిలకపచ్చ కాపురం". bharat-movies.com. Archived from the original on 30 నవంబరు 2017. Retrieved 12 February 2018.