ఆర్. మాధవన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రంగనాథన్ మాధవన్(జననం 1 జూన్ 1970) ప్రముఖ భారతీయ నటుడు, రచయిత, సినీ నిర్మాత. ఆయన రెండు ఫిలింఫేర్ పురస్కారాలు, ఒక తమిళనాడు రాష్ట్ర ఫిలిం పురస్కారం అందుకున్నారు. దాదాపుగా 7 భాషా సినిమాల్లో నటించిన అతితక్కువ భారతీయ నటుల్లో నటుల్లో ఆయన ఒకరు.[1][2]

కెరీర్ మొదట్లో మాధవన్ టివీ సీరియళ్ళలో చిన్న చిన్న పాత్రలు చేసేవారు. 1996లో జీ టీవీలో బాగా హిట్ అయిన బనేగీ అప్నీ బాత్ సీరియల్ లో కూడా నటించారాయన. ఎన్నో ప్రకటనల్లోనూ చిన్న పాత్రల్లోనూ నటించిన తరువాత మణి రత్నం దర్శకత్వంలో వచ్చిన  తమిళ సినిమా అలై పాయుదే(2000)తో కెరీర్ లో పెద్ద మలుపు వచ్చింది. ఆ తరువాత ఏడాది గౌతం మీనన్ మొదటి సినిమా మిన్నలే,  మద్రాస్ టాకీస్ వారి డుం డుం డుం సినిమాలతో రొమాంటిక్ హీరోగా  ప్రసిద్ధి చెందారు మాధవన్. 2002లో తిరిగి మణిరత్నం దర్శకత్వంలోనే  కన్నత్తిళ్ ముత్తమిట్టాల్ సిన్మాలో నటించారాయన. ఆ సినిమాకు, మాధవన్ నటనకు విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు వచ్చాయి. అదే ఏడాది ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో నటించిన రన్ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయింది.

తొలినాళ్ళ జీవితం[మార్చు]

1 జూన్ 1970న బీహార్(అప్పటి ఝార్ఖండ్)లోని జమ్షేద్ పూర్ లో తమిళ కుటుంబంలో జన్మించారు మాధవన్. ఆయన తండ్రి రంగనాథన్ టాటా స్టీల్ లో మేనేజ్ మెంట్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేయగా, తల్లి సరోజ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ గా పనిచేసేవారు. ఆయన చెల్లెలు దేవిక యుకెలో సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నారు.[3] బీహార్ లో పుట్టినా తమిళం మాట్లాడుతూ పెరిగారాయన.[4]

మూలాలు[మార్చు]

  1. "R Madhavan signs up with Atul Kasbekar's Bling Entertainment".
  2. Sharma, Smrity (13 November 2010).
  3. Rangarajan, Malathi (2004).
  4. Jha, Subhash K. (2005).