యువరత్న రాణా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యువరత్న రాణా
(1998 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.కోదండరామిరెడ్డి
తారాగణం బాలకృష్ణ,
హీరా
సంగీతం కోటి
నిర్మాణ సంస్థ ఋగ్వేద క్రియెషన్స్
భాష తెలుగు
దస్త్రం:Nt 1671 NBK-Bheeshma.jpg
నందమూరి బాలకృష్ణ

యువరత్న రాణా 1998 లో వచ్చిన సినిమా. ఋగ్వేద ప్రొడక్షన్స్ బ్యానర్‌లో కె. మీనాక్షి నాయుడు నిర్మించగా, ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించాడు . ఇందులో నందమూరి బాలకృష్ణ, హీరా రాజగోపాల్, భాగ్యశ్రీ ప్రధాన పాత్రల్లో నటించారు. కోటి సంగీతం సమకూర్చాడు.[1][2]

కథ[మార్చు]

భీమరాజు ( జయ ప్రకాష్ రెడ్డి ) మాఫియా డాన్, తన అనుచరుడు రాజేశ్వరరావు ( చలపతి రావు ) ను చంపేస్తాడు. రాజేశ్వరరావు కుమారుడు రాణా ( నందమూరి బాలకృష్ణ ) భీమరాజును చంపి స్వయంగా తానే మాఫియా డాన్ అవుతాడు. అతను సమాజంలో చాలా శక్తివంతమైన వ్యక్తి అవుతాడు. ఒక అమాయక గ్రామీణ అమ్మాయి గంగ ( హీరా రాజగోపాల్ ) ను పెళ్ళి చేసుకుంటాడు. భీమరాజు కుమారుడు దేవరాజ్ ( చరణ్ రాజ్ ) రాణాను చంపడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తాడు, కానీ ఏవీ పనిచేయవు. బాలికపై అత్యాచారం చేసినందుకు మున్సిపల్ కమిషనరు (రఘునాథ్ రెడ్డి) ను రాణా చంపాడు. విలన్లకు స్నేహితురాలైన డాక్టర్ కస్తూరి ( భాగ్యశ్రీ ) పోస్టుమార్టం చేసి, హత్య గురించి పోలీసులకు చెప్పి, రాణాను జైలుకు పంపించడానికి ప్రయత్నిస్తుంది. రాణా కస్తూరిని కిడ్నాప్ చేసి బెదిరిస్తాడు. అతను ఆమెను చంపేటప్పుడు, శంకరం మాస్టర్ ( చంద్ర మోహన్ ) అతడిని అడ్డుకుని, తన కుమార్తెను విడిచిపెట్టమని వేడుకుంటాడు. అప్పుడు హఠాత్తుగా ఆమె తాను కోల్పోయిన సోదరేనని రాణా తెలుసుకుంటాడు. కానీ అతను అతను తన దత్తత తండ్రి రాజేశ్వరరావుకు ఇచ్చిన వాగ్దానం మేరకు, ఈ సత్యాన్ని వ్యక్తపరచలేకపోతున్నాడు. దేవరాజ్ ఈ పరిస్థితిని ఉపయోగించుకుని, కస్తూరి, రాణాల మధ్య శత్రుత్వాన్ని మరింత పెంచుతాడు. కస్తూరిని ఉపయోగించి రానాను చంపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాడు. కానీ ఈ చిత్రం చివరలో రానా తన సోదరుడని ఆమెకు తెలుస్తుంది.[3]

నటవర్గం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

పాటలు[మార్చు]

సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."మా కళ్యాణ సీతను"వేటూరి సుందరరామమూర్తిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర4:30
2."గుమ్మ గుమ్మలారా"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర4:47
3."ఎప్పుడు మన"వేటూరి సుందరరామమూర్తిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర3:46
4."చెంగు జారిపోతాంది"వేటూరి సుందరరామమూర్తిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర4:39
5."రంపచికం"సుద్దాల అశోక్ తేజఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర4:18
6."ఓ యామినీ"వేటూరి సుందరరామమూర్తిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర4:03
Total length:26:03

మూలాలు[మార్చు]

  1. "Heading". Filmibeat.
  2. "Heading-2". chithr.com.[permanent dead link]
  3. "Story". The Cine Bay. Archived from the original on 2021-05-07. Retrieved 2020-08-23.