రుక్మిణి (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రుక్మిణి
దర్శకత్వంరవిరాజా పినిశెట్టి
నిర్మాతజొన్నాడ రమణమూర్తి
తారాగణంవినీత్,
రుక్మిణి
సంగీతంవిద్యాసాగర్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1997
దేశంభారతదేశం
భాషతెలుగు

రుక్మిణి 1997 లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] ఇందులో వినీత్, రుక్మిణి, విజయకుమార్, నాగబాబు ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఆదర్శ చిత్రాలయ పతాకంపై జొన్నాడ రమణ మూర్తి నిర్మించాడు. విద్యాసాగర్ సంగీత దర్శకత్వం వహించాడు.

పల్లెటూరి అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేక తన తండ్రి ఇచ్చిన మాటను తప్పించుకోలేక తన బదులు తన స్నేహితుణ్ణి పెళ్ళి చూపులకు పంపిస్తాడు ఒకతను. వాళ్ళిద్దరూ నిజంగానే ప్రేమలో పడతారు. తర్వాత ఏమి జరిగిందనేది మిగతా కథ.

తారాగణం[మార్చు]

నిర్మాణం[మార్చు]

అభివృద్ధి[మార్చు]

నిజజీవితంలో తండ్రీ కూతుళ్ళైన విజయ్ కుమార్, ప్రీత, శ్రీదేవి ఈ సినిమాలో తండ్రీ కూతుర్లుగా నటించారు. కీలకమైన విజయ్ కుమార్ బావమరిది పాత్రలో నాగబాబు నటించాడు. ఈ సినిమాలో చిన్న పాత్రలో నటించిన ఎం. ఎస్. నారాయణ దర్శకుడు రవిరాజా పినిశెట్టితో కలిసి కథా చర్చల్లో పాల్గొన్నాడు. ఆయన హావభావాలను గమనించిన రవిరాజా మరో సినిమా ఎం. ధర్మరాజు ఎం.ఏ చిత్రంలో హాస్యనటుడిగా అవకాశం కల్పించాడు. తర్వాత మరిన్ని చిత్రాల్లో ఆయనకు నటుడిగా అవకాశం వచ్చింది.[2]

పాటలు[మార్చు]

విద్యాసాగర్ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాటలన్నీ సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించాడు.[3]

  • గోదారి రేవులోన రాదారి నావలోన
  • ఉన్నమాట నీకు
  • ప్రేమ ప్రేమ చెప్పమ్మా
  • బాగున్నావే ముద్దొచ్చే
  • శివ శివ మూర్తివి
  • మెల్లగా ఊయల ఊపే
  • సరిగమ పదనిస

మూలాలు[మార్చు]

  1. "Rukmini (1997)". gomolo.com. Retrieved 12 March 2018.
  2. "ఎంఎస్ నారాయణ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు." www.andhrajyothy.com. Retrieved 2020-07-15.
  3. "Rukmini (1997)". mio.to. Retrieved 13 March 2018.