Jump to content

శ్రీదేవి విజయ్ కుమార్

వికీపీడియా నుండి
శ్రీదేవి విజయకుమార్
జననం (1986-10-29) 1986 అక్టోబర్ 29 (వయసు: 39)
లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ
జాతీయతభారతీయులు
పౌరసత్వంశ్రీలంక
వృత్తిసినిమా నటి
క్రియాశీలక సంవత్సరాలు1992–ప్రస్తుతం
భాగస్వామిరాహుల్
పిల్లలురూపిక [1]
Parents
బంధువులువనితా విజయ కుమార్ (సోదరి)
ప్రీతా విజయకుమార్ (సోదరి)
అరుణ్ విజయ్ (సోదరుడు)

శ్రీదేవి విజయ్ కుమార్ (తమిళం: சிறீதேவி விஜயகுமார், (జననం. 29 అక్టోబరు 1986) భారతీయ సినిమా నటి. ఆమె 1992లో బాలనటిగా తమిళ సినిమా "రిక్షా మామ" ద్వారా చిత్రసీమకు పరిచయమయ్యారు. ఆమె తమిళం, తెలుగు, కన్నభాషా చిత్రాలలో నటిస్తున్నారు. [2]

సినిమా జీవితం

[మార్చు]

శ్రీదేవి విజయ్ కుమార్ ప్రముఖ తమిళ సినిమా నటులైన విజయ్ కుమార్, మంజుల దంపతుల చిన్న కుమార్తె. ఆమెకు ముగ్గురు అక్కలు (కవిత, అనిత, వనిత, ప్రీతి), ఒక అన్నయ్య (అరుణ్ విజయ్) ఉన్నారు. ఆమె తన 9వ యేట నుండి తన పాఠశాల విద్యాభ్యాసాన్ని ఆపివేసారు.[3] ఆమె తెలుగు సినిమా రుక్మిణి లో బాలనటిగా జీవితాన్ని ప్రారంభించారు. అందులో ప్రీత ప్రముఖ పాత్ర పోషించింది. ఆమె సినిమా కథానాయకిగా "కదల్ వైరస్" చిత్రం ద్వారా పరిచయమయ్యారు. ఆమె తెలుగు సినీ పరిశ్రమకు వచ్చిన తరువాత ప్రసిద్ధి చెందారు. ఆమె ఎ.వి.యం వారి "ప్రియమన తోజీ" చిత్రం ద్వారా మంచి నటిగా గుర్తింపు పొందారు.

నటించిన చిత్రాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
1992 రిక్షా మామా భువన తమిళం బాల కళాకారుడు
అమ్మ వంటాచు విమల తమిళం
డేవిడ్ అంకుల్ దేవి తమిళం
దైవ కుళంతై శ్రీదేవి త్యాగరాజన్ తమిళం
సుగమన సుమైగల్ బాబు తమిళం
ఆవరంపూ తమిళం
1997 రుక్మిణి సీత తెలుగు
2002 ఈశ్వర్ ఇందిరా తెలుగు
కాదల్ వైరస్ గీత తమిళం
2003 నిన్నే ఇష్టపడ్డాను గీతాంజలి తెలుగు నామినేట్ అయింది — ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు – తెలుగు
ప్రియమణ తోళి జూలీ తమిళం నామినేషన్ — ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు - తమిళం
తిథికుధే అనురాధ (రేణు) తమిళం నామినేషన్ — ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డు – తమిళం
2004 కాంచన గంగా ఊర్మిళ కన్నడ
2005 దేవతై కాండెన్ ఉమా తమిళం
నిరీక్షణ అను తెలుగు
2006 ఆది లక్ష్మి సురేఖ తెలుగు
2007 ప్రీతిగాగి మిలి కన్నడ
2008 పెళ్ళి కాని ప్రసాద్ సుజాత గోపాలరావు తెలుగు
2009 మంజీర బీనా తెలుగు
2011 సెల్ ఫోన్ తెలుగు
వీర సత్య తెలుగు
2016 లక్ష్మణుడు సుమన్ కన్నడ
2025 సుందరకాండ సత్య తెలుగు

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం కార్యక్రమం పాత్ర భాష గమనికలు
2021-2022 కామెడీ స్టార్స్ న్యాయమూర్తి తెలుగు స్టార్ మా
2023 ఆదివరం మా పరివారం
గుండె జారి గల్లయతిండే ఇ టీవీ
డ్రామా జూనియర్స్ 4 జీ టీవీ
స్టార్ట్ మ్యూజిక్ (టీవీ సిరీస్) పోటీదారు తమిళం స్టార్ విజయ్
2024-2025 జోడి ఆర్ యు రెడీ న్యాయమూర్తి

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (17 July 2021). "శ్రీదేవి త‌న‌య బ‌ర్త్‌డే వేడుక‌.. ఫొటోలు వైర‌ల్‌". Archived from the original on 17 జూలై 2021. Retrieved 17 July 2021.
  2. Jeshi, K (25 October 2004). "Star daughter shines". The Hindu. Archived from the original on 23 మార్చి 2010. Retrieved 18 February 2010.
  3. Dorairaj, S (8 February 2006). "Actor Vijayakumar returns to AIADMK". The Hindu. Archived from the original on 5 జనవరి 2010. Retrieved 18 February 2010.

ఇతర లింకులు

[మార్చు]