నిరీక్షణ (2005 సినిమా)
నిరీక్షణ (2005 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎన్ సీతారామ్ |
---|---|
నిర్మాణం | డి.రామానాయుడు |
రచన | ఎన్ సీతారామ్ |
తారాగణం | ఆర్యన్ రాజేష్, శ్రీదేవి, నాగేంద్రబాబు, రమాప్రభ, ఎమ్మెస్ నారాయణ, తనికెళ్ళ భరణి, ధర్మవరపు సుబ్రమణ్యం, 'సత్యం' రాజేష్, అలీ, బెనర్జీ, సూర్య, గుండు హనుమంతరావు, గౌతం రాజు, శివారెడ్డి, జ్యోతి, అనంత్, గణేష్, నర్సింగ్ యాదవ్, కల్పన, అర్చనారాయ్ |
సంగీతం | శ్రీలేఖ |
ఛాయాగ్రహణం | శరత్ |
కూర్పు | కెవి కృష్ణారెడ్డి |
విడుదల తేదీ | నవంబర్ 1, 2005 |
భాష | తెలుగు |
సురేష్ ప్రొడక్షన్స్ వారు ఈసారి ట్రెండ్‌కు అనుగుణంగా, కథనానికి ప్రాముఖ్యత ఇస్తూ తీసిన సినిమా నిరీక్షణ. ఇది 2005 నవంబరు 1 విడుదల అయింది. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ఎన్ సీతారామ్
చంద్రబోస్, భాస్కరభట్ల రవికుమార్, అభినయ శ్రీనివాస్లు రచయితలు పాటలు రచించారు.
కథ
[మార్చు]అను (శ్రీదేవి) సున్నితమైన మనస్తత్వం, సహాయపడే గుణం గల అమ్మాయి. ఈ సంపన్నుల అమ్మాయి కాలేజిలో చదువుకుంటూ ఉంటుంది. తల్లి లేని ఆమె అంటే తండ్రి శరత్ (నాగేంద్రబాబు)కి అమితమైన ప్రేమ. తండ్రీ కూతుళ్ళు స్నేహితుల్లా మెలుగుతుంటారు.
ఇద్దరు కాలేజీ కుర్రాళ్ళు (ఆర్యన్ రాజేష్, సత్యం రాజేష్) కు డబ్బు అవసరం పడుతుంది. అందులో ఒకరు అనును ఒక ఫార్మ్ హౌస్ లో బంధించి ఉంచడం చూస్తారు. తరువాత తన పేరు మీద 5 లక్షల రివార్డ్ ఉన్నట్లు తెలుసుకుంటారు. తనను ఆ ఫార్మ్ హౌస్ లో ఎందుకు బంధించారు, ఈ కుర్రాళ్ళు ఎలా కాపాడతారు అనేది ఈ సినిమా మిగితా భాగం.