ధర్మవరపు సుబ్రహ్మణ్యం

వికీపీడియా నుండి
(ధర్మవరపు సుబ్రమణ్యం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ధర్మవరపు సుబ్రహ్మణ్యం
ఒ
ధర్మవరపు సుబ్రమణ్యం
జననం(1954-09-20)1954 సెప్టెంబరు 20
మరణం2013 డిసెంబరు 7(2013-12-07) (వయసు 59)
హైదరాబాదు
వృత్తినటుడు, వ్యాఖ్యాత, దర్శకుడు
జీవిత భాగస్వామికృష్ణజ
పిల్లలుసందీప్, రవిబ్రహ్మతేజ

ధర్మవరపు సుబ్రహ్మణ్యం (1954 సెప్టెంబరు 20 - 2013 డిసెంబరు 7) తెలుగు సినిమా హాస్యనటుడు. టీవీ రంగం నుండి సినిమా రంగం లోకి ప్రవేశించాడు. స్వస్థలం ప్రకాశం జిల్లాలోని కొమ్మినేనివారి పాలెం .వామపక్షభావాలు కలిగిన సుబ్రహ్మణ్యం గతంలో ప్రజా నాట్యమండలి తరఫున ఎన్నో నాటకాలు, ప్రదర్శనలు ఇచ్చారు.[1] దూరదర్శన్లో ప్రసారమైన ఆనందోబ్రహ్మ (యర్రంశెట్టి సాయి) ద్వారా మంచి గుర్తింపు పొందాడు. చిత్రరంగంలో హాస్యపాత్రలో తనదైన ముద్ర వేశాడు. తోకలేని పిట్ట అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. 2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ విజయానికి తన వంతు కృషి చేసాడు. 2004 నుండి 2013 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శిగా కొనసాగాడు. 2013 డిసెంబరు 7 న అనారోగ్య కారణాలతో మరణించాడు.

బాల్యం

[మార్చు]

ధర్మవరపు సుబ్రహ్మణ్యం 1954 సెప్టెంబరు 20 న ప్రకాశం జిల్లా లోని బల్లికురవ మండలం కొమ్మినేనివారి పాలెంలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పుడే తండ్రి చనిపోతే నలుగురు పిల్లలను ఆయన తల్లే పెంచి పెద్ద చేసింది. ఉన్నత పాఠశాల విద్య అద్దంకిలోనూ, ఇంటర్ ఒంగోలు సి.ఎస్.ఆర్ శర్మ కళాశాలలోనూ చదివాడు. ఆ దశలోనే ఆయనకు ప్రజానాట్యమండలితో పరిచయం ఏర్పడింది. నాటకాల మీదే ఎక్కువ దృష్టి పెట్టడంతో ఇంటర్లో ఉత్తీర్ణుడవలేదు. అమ్మ బాధ చూసి మళ్ళీ పట్టుదలగా సప్లిమెంటరీ పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యాడు.

తరువాత బీకాంలో చేరినా ఆయన మనసు సినిమాల వైపే ఉండేది. ఇంట్లో చెప్పకుండా మద్రాసు వెళ్ళిపోయాడు. అక్కడ అవకాశాలు రాకపోవడంతో మళ్ళీ సొంత ఊరుకు తిరిగి వచ్చాడు.

ఉద్యోగం

[మార్చు]

మద్రాసు నుండి తిరిగి వచ్చి కొన్నాళ్ళు వ్యవసాయ పనుల్లో ఉండగా కొందరు మిత్రుల సలహా మేరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాశాడు. అందులో ఉత్తీర్ణుడవడంతో హైదరాబాద్ లోని పంచాయితీ రాజ్ శాఖలో అధికారిగా ఉద్యోగం వచ్చింది. అక్కడ కొద్ది కాలం కుదుట పడ్డాక ఆయన దృష్టి మళ్ళీ నాటకాల వైపు మళ్ళింది. తరువాత ఆకాశవాణి కోసం కొన్ని రేడియో నాటకాలు రాశాడు. తరువాత దూరదర్శన్ లో తొలి తెలుగు ధారావాహిక అనగనగా ఒక శోభను ప్రారంభించారు. ఆ తరువాత మనసు గుర్రం లేదు కళ్ళెం, పరమానందయ్య శిష్యుల కథ ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఆనందో బ్రహ్మతో ఆయన తెలుగువారందరికీ చిరపరిచితుడయ్యాడు.

సినిమాలు

[మార్చు]

దూరదర్శన్ లో ఉండగానే ఆయనకు జంధ్యాల సినిమా జయమ్ము నిశ్చయమ్మురాలో అవకాశం వచ్చింది. దాంతో పలు సినిమాల్లో ఆయనకు పాత్రలు లభించాయి. నటనలో తలమునకలై ఉండగానే తోక లేని పిట్ట అనే సినిమాకు దర్శకత్వం, సంగీత దర్శకత్వం వహించాడు. అయితే ఆ సినిమా ఆశించనంతగా ఆడకపోవడంతో మళ్ళీ దర్శకత్వ బాధ్యతల జోలికి పోలేదు.

నువ్వు నేను, ధైర్యం చిత్రాల మొదలుకొని చాలా చిత్రాల్లో అధ్యాపక పాత్ర వేసి నవ్వించారు. అయితే ఆ పాత్రలను కించ పరిచే విధంగా మలుస్తూ ఉండటంతో క్రమంగా ఆ పాత్రలకు దూరమయ్యాడు.[2]ఆయన నట ప్రస్థానంలో ఒక్కడు సినిమాలో చేసిన పాస్‌పోర్ట్ ఆఫీసర్ పాత్ర, వర్షం సినిమాలో వాతావరణ వార్తలు చదివే గాలి గన్నారావు, రెడీ సినిమాలో హ్యాపీ రెడ్డి అలియాస్ సంతోష్ రెడ్డి మొదలైన పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఆలస్యం అమృతం సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఆయన నటించిన చివరి సినిమా ప్రేమాగీమా జాంతానై విడుదల కావాల్సి ఉంది. అప్పటికే అనారోగ్యంగా ఉన్నప్పటికీ ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వికారాబాద్‌లో జరిగిన షూటింగ్‌కు హాజరైనాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

1989 ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు సాంస్కృతిక మండలి అధ్యక్షడిగా పనిచేశాడు.

కుటుంబం

[మార్చు]

ఆయనకు భార్య కృష్ణజ, ఇద్దరు కుమారులు రోహన్ సందీప్, రవిబ్రహ్మతేజ ఉన్నారు. దిల్‌షుక్ నగర్ లోని శారదానగర్ లో ఆయన 1979 నుండి స్థిర నివాసం ఏర్పరుచుకున్నాడు.

నటించిన సినిమాలు

[మార్చు]

{{columns-list|colwidth=25em|

  1. బావా బావా పన్నీరు (1989)
  2. జయమ్ము నిశ్చయమ్మురా (1989)
  3. ప్రేమా జిందాబాద్
  4. పెళ్ళి పుస్తకం (1991)
  5. స్వాతికిరణం (1992)
  6. ప్రేమ చిత్రం పెళ్ళి విచిత్రం (1993)
  7. పరుగో పరుగు (1993)
  8. మిస్టర్ పెళ్ళాం (1993)
  9. లేడీస్ స్పెషల్ (1993)
  10. ష్ గప్ చుప్ (1993)
  11. పెళ్ళికొడుకు (1994)
  12. బ్రహ్మచారి మొగుడు (1994)
  13. ఘరానా బుల్లోడు (1995)
  14. సాహసవీరుడు - సాగరకన్య (1996)
  15. తోకలేని పిట్ట (1997) (దర్శకుడు)
  16. ఫ్యామిలీ సర్కస్ (2001)
  17. 9 నెలలు (2001)
  18. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం (2001)
  19. డార్లింగ్ డార్లింగ్ (2001)
  20. ఒకటో నంబర్ కుర్రాడు (2002)
  21. తప్పు చేసి పప్పుకూడు (2002)
  22. ఇంద్ర (2002)
  23. ఒట్టు ఈ అమ్మాయెవరో తెలీదు! (2003)
  24. ఒక్కడు (2003)
  25. సింహాద్రి (2003)
  26. నేను పెళ్ళికి రెడీ (2003)
  27. విష్ణు
  28. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి (2003)
  29. పిలిస్తే పలుకుతా (2003)
  30. అమ్ములు (2003)
  31. 143 (2004)[3][4]
  32. నేనున్నాను - సంగీత కళాశాల ప్రిన్సిపాల్
  33. మాయాబజార్ (2006)
  34. ఆదివారం ఆడవాళ్లకు సెలవు (2007)
  35. దుబాయ్ శీను (2007)
  36. లక్ష్యం (2007)
  37. ఆపరేషన్ దుర్యోధన (2007)
  38. అత్తిలి సత్తిబాబు LKG (2007)
  39. శంకర్ దాదా జిందాబాద్ (2007)
  40. చిరుత (2007)
  41. కేక (2008)
  42. బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ (2008)
  43. సోంబేరి (2008)
  44. జల్సా (2008)
  45. మిస్టర్ మేధావి (2008)
  46. [[రెయిన్‌బో (2008)
  47. ఆ ఒక్కడు (2009)
  48. అన్నవరం (2006)
  49. ఖతర్నాక్ (2006)
  50. అందాల రాముడు (2006)
  51. బొమ్మరిల్లు (2006)
  52. ఏవండోయ్ శ్రీవారు (2006)
  53. బంగారం (2006)
  54. శ్రీ రామదాసు (2006)
  55. స్టైల్ (2006)
  56. గౌతమ్ SSC (2005)
  57. జై చిరంజీవ (2005)
  58. వీరి వీరి గుమ్మడి పండు (2005)
  59. మన్మధుడు (2002) -- ప్రొఫెసర్ సుబ్రమణ్యం
  60. ఆంధ్రుడు (2005)
  61. అందరివాడు (2005)
  62. అతనొక్కడు (2005)
  63. అవునన్నా కాదన్నా (2005)
  64. నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)
  65. బాలు (2005)
  66. అల్లరి బుల్లోడు (2005)
  67. మాస్ (2004)
  68. పుట్టింటికి రా చెల్లి (2004)
  69. మోర్నింగ్ రాగా (2004)
  70. మిస్టర్ అండ్ మిసెస్ శైలజా క్రిష్ణమూర్తి (2004)
  71. వర్షం (2004)
  72. దొంగోడు (2003)
  73. విజయం (2003)
  74. ఆలస్యం అమృతం (2010)
  75. కలెక్టర్ గారి భార్య (2010)
  76. నాగవల్లి (2010)[5]
  77. నిప్పు (2012)
  78. షాడో (2013 సినిమా) (2013)
  79. అమృతం చందమామలో (2014)

}}

మరణం

[మార్చు]

ఆరు నెలల పాటు కాలేయ కేన్సర్‌తో బాధపడి ధర్మవరపు సుబ్రహ్మణ్యం, 2013 డిసెంబరు 7 శనివారం రాత్రి 10.30 గంటలకు చైతన్యపురిలోని గీతా ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచాడు.[6]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-12-11. Retrieved 2013-12-07.
  2. ఈనాడు వార్త, డిసెంబరు 8, 2013
  3. "143 review". idlebrain. Retrieved 16 May 2019.
  4. తెలుగు ఫిల్మీబీట్. "143 (సినిమా)". telugu.filmibeat.com. Retrieved 16 May 2019.
  5. "Nagavalli — Movie Review". Oneindia Entertainment. Archived from the original on 22 అక్టోబరు 2012. Retrieved 9 June 2020. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  6. http://www.sakshi.com/news/andhra-pradesh/film-actor-dharmavarapu-subramanyam-passed-away-86609?pfrom=home-top-story