Jump to content

బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్

వికీపీడియా నుండి
బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం శ్రీనివాసరెడ్డి
నిర్మాణం కానుమిల్లి అమ్మిరాజు
చిత్రానువాదం శ్రీనివాసరెడ్డి
తారాగణం అల్లరి నరేశ్,
ఫర్జానా,
కృష్ణ భగవాన్,
రమ్యశ్రీ,
రిథిమ్,
ధర్మవరపు సుబ్రహ్మణ్యం,
తనికెళ్ళ భరణి,
రఘుబాబు,
కోట శ్రీనివాసరావు,
వేణుమాధవ్,
కోవై సరళ,
రజిత,
జయప్రకాశ్ రెడ్డి,
పెనుమత్స సుబ్బరాజు,
ప్రభాకర్,
ఎల్.బి.శ్రీరామ్
సంగీతం ఎం.ఎం.శ్రీలేఖ
గీతరచన భాస్కరభట్ల రవికుమార్
సంభాషణలు వెలిగొండ శ్రీనివాస్
ఛాయాగ్రహణం అడుసుమిల్లి విజయకుమార్
నిర్మాణ సంస్థ సిరి సినిమా
భాష తెలుగు

బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ 2008 లో వచ్చిన తెలుగు కామెడీ డ్రామా చిత్రం. అల్లరి నరేష్, కృష్ణ భగవాన్, ఫర్జనా, చారులత, రఘు బాబు, సుమన్ శెట్టి, కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను సిరి సినిమా బ్యానర్‌లో కనుమిల్లి అమ్మిరాజు నిర్మించాడు. ఎంఎం శ్రీలేఖ సంగీతం అందించిన ఈ చిత్రం 2008 ఏప్రిల్ 18 న విడుదలైంది.

బొమ్మన బ్రదర్స్ (అల్లరి నరేష్, కృష్ణ భగవాన్) వృత్తిరీత్యా దొంగలు. వారి తల్లిదండ్రులు (తనికెళ్ళ భరణి, కోవై సరళ) దొంగతనాలు చేయమని వారిని ప్రోత్సహిస్తారు. ఒకసారి, ఈ బొమ్మన బ్రదర్స్ ఒక బ్యాంక్ మేనేజర్ ( ధర్మవరపు సుబ్రమణ్యం ) ను దోచుకొని డబ్బుతో తప్పించుకుంటారు. చివరికి వారు పోలీసులకు చిక్కి, వారి తండ్రి సహాయంతో పోలీసుల నుండి కూడా తప్పించుకుంటారు. అప్పుడు, వారు అనుకోకుండా ఇద్దరు సోదరీమణుల ఫోటోలను చూసి వారి గురించి సమాచారాన్ని సేకరిస్తారు. వారు సిరి చందన ( ఫర్జానా ), మణి చందన ( చారులత ) అనీ, వారిద్దరూ ప్రసిద్ధ వస్త్ర వ్యాపారాల యజమాని మోహనరావు ( కోట శ్రీనివాసరావు ) కుమార్తెలనీ తెలుసుకుంటారు.

సిరికి దేవుడంటే భక్తి. మణి ఎప్పుడూ అనాథలకు, అంగవికలురకూ సహాయం చేస్తూంటుంది. బొమ్మన బ్రదర్స్ వారి వేషధారణలను మార్చుకుని మణి, సిరి లను మోసం చేసి వారి హృదయాలను గెలుచుకుంటారు. కొన్ని మలుపుల తరువాత, బొమ్మన బ్రదర్స్ చందన సోదరీమణులను వివాహం చేసుకుంటారు. తరువాత, బొమ్మన బ్రదర్స్ మరికొన్ని ఎత్తులు వేసి మామగారి ఆస్తిని చేజిక్కించుకునే ప్రయత్నాలు చేస్తారు. అయితే, వారు మోసగాళ్ళు అని తెలిసి మోహనరావు పిచ్చివాడౌతడు. ఇది మణి, సిరి లకు తీవ్రంగా కోపం వస్తుంది. తమ భర్తలను హత్య చేయడానికి ప్రొఫెషనల్ కిల్లర్ ( రఘు బాబు ) ను మాట్లాడుతారు . దీనికి ముందే బ్రదర్స్ వారి తప్పును గ్రహించి, అస్తి పత్రాలను అందజేయడానికి అక్కాచెల్లెళ్ళను కలవడానికి ప్రయత్నిస్తారు. విలన్లతో పోరాటం తరువాత, సోదరులు ఆ పత్రాలను అప్పగించి, వారి విశ్వాసాన్ని తిరిగి పొందుతారు. మోహన రావు బాగవడం, బ్రదర్స్ నిజాయితీగల జీవితాన్ని గడపడంతో సినిమా ముగుస్తుంది.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]
క్రమసంఖ్య పేరుగాయనీ గాయకులు నిడివి
1. "ఇశాకపట్నం, భీమిలీ"  సుజిత్ 04:08
2. "పొద్దున్నేమో ఓసారి"  శ్వేత, కార్తిక్ 05:00
3. "మాయమాయగా"  టిప్పు, కల్పన 04:41
4. "వానొస్తే వర్షాకాలం"  కార్తిక్, కౌసల్య 03:51
5. "నేను రెడీ"  జస్సీ గిఫ్ట్, మాలతి 03:20
21:00

సమీక్షలు

[మార్చు]

ఈ చిత్రానికి మంచి సమీక్షలు వచ్చాయి. CineGoer.com 3/5 రేటింగు ఇచ్చింది. "పక్కా కామెడీ, పైసా వసూల్ సినిమా. క్లైమాక్స్‌కు వచ్చే వరకు సమయం పరిగెడుతుంది " [1]

మూలాలు

[మార్చు]
  1. "BBCS Review - Fun Summertime Watch". CineGoer.com. Retrieved 18 April 2008.