బ్రహ్మచారి మొగుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బ్రహ్మచారి మొగుడు
దర్శకత్వంరేలంగి నరసింహారావు
నిర్మాతబత్తిన వెంకటకృష్ణా రెడ్డి
తారాగణంరాజేంద్ర ప్రసాద్,
యమున
సంగీతంజె. వి. రాఘవులు
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1994 జనవరి 1 (1994-01-01)
భాషతెలుగు

బ్రహ్మచారి మొగుడు 1993 లో రేలంగి నరసింహారావు దర్శకత్వంలో విడుదలైన హాస్యభరిత చిత్రం.[1] రాజేంద్ర ప్రసాద్, యమున ఇందులో ప్రధాన పాత్రధారులు. జె. వి. రాఘవులు స్వరాలు సమకూర్చాడు. దీనిని శ్రీ సాయి మాధవి ఆర్ట్స్ నిర్మాణ సంస్థ [2] లో బత్తిన వెంకట కృష్ణారెడ్డి నిర్మించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాపైంది.

కథ[మార్చు]

రాంబాబు (రాజేంద్ర ప్రసాద్) కుటుంబరావు (గిరి బాబు) నేతృత్వంలోని ఒక ప్రైవేట్ కంపెనీలో జూనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్‌గా కొత్తగా చేరతాడు.కుటుంబరావు సోదరిని ఒక బ్రహ్మచారి మోసం చేసాడు. అంచేత అతడు బ్రహ్మచారులను ద్వేషిస్తాడు. అందువల్ల అతడు బ్రహ్మచారి రాంబాబుకు చవకబారు పనులు చెప్పి అతనిని చాలా వేధిస్తాడు. అతని ఉద్యోగం ఇంకా ప్రొబేషను లోనే ఉన్నందున, ఇదే అతని మొదటి ఉద్యోగం అయినందున, వేరే ఖాళీలేమీ లేనందున, రాంబాబు ఈ ఉద్యోగాన్ని వదులుకోలేడు. మరొక ఉద్యోగం పొందనూ లేడు.

తాను పెళ్ళి చేసుకోబోతున్నానని యజమానికి అబద్ధం చెప్పమని అతని సహోద్యోగి గురునాధం (బ్రహ్మానందం) సలహా ఇస్తాడు. అతను యాదృచ్ఛికంగా ఒక అమ్మాయి ఫోటోను తీసి పెళ్ళి కార్డులు వేసి పంపిణీ చేస్తాడు. కొంతకాలం తర్వాత, అనుకోకుండా జయలక్ష్మి (యమున) అనే ఆ ఫోటోలోని అమ్మాయి అతని భార్యనని చెప్పుకుంటూ అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఇక, రాంబాబు ఆమెను వదిలించుకోవాలని వివిధ ఉపాయాలు పన్నడం, అవి పారకపోవడం, చివరికి వాళ్ళ గతి ఏమౌతుందనేది మిగతా కథ.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

సం.పాటగాయనీ గాయకులుపాట నిడివి
1."చిగురాకులలోనా"ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర్ర4:32
2."కామునిపట్నం"ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర్ర5:21
3."అహా ముత్యాల"కె.ఎస్. చిత్ర్ర4:44
4."వచ్చాను గురూ"కె.ఎస్. చిత్ర్ర4:22
5."కాష్మోరా"ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, రమణ5:08
Total length:24:07

మూలాలు[మార్చు]

  1. "బ్రహ్మచారి మొగుడు సినిమా సమీక్ష". thecinebay.com. Archived from the original on 9 ఆగస్టు 2018. Retrieved 24 September 2017.
  2. [dead link]