Jump to content

పెళ్ళి పుస్తకం

వికీపీడియా నుండి
పెళ్ళి పుస్తకం
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం బాపు
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
దివ్యవాణి,
గుమ్మడి వెంకటేశ్వరరావు
సంగీతం కె.వి.మహదేవన్
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.పి.శైలజ
గీతరచన ఆత్రేయ, ఆరుద్ర, వేటూరి
కూర్పు అనిల్ మల్నాడ్
నిర్మాణ సంస్థ శ్రీ సీతారామ ఫిల్మ్స్
భాష తెలుగు

పెళ్ళి పుస్తకం 1991 లో విడుదలయిన ఒక తెలుగు చలనచిత్రం. ప్రముఖ దర్శకుడు బాపు ద్వారా రూపుదిద్దుకున్న ఈ చిత్రం సత్సంప్రదాయ భారతీయ దాంపత్య జీవితపు ఔన్నత్యాన్ని, వైశిష్ట్యాన్ని కుటుంబ విలువలను చాటిచెప్పే ఒక మనోరంజకమైన సకుటుంబ కథా చిత్రం.

కథా సంగ్రహం

[మార్చు]

కొత్తగా పెళ్ళి చేసుకున్న కృష్ణమూర్తి (రాజేంద్ర ప్రసాద్) ముంబైలోని ఒక సంస్థలో కళా దర్శకుడుగా పనిచేస్తుంటాడు. అతని భార్య సత్యభామ (దివ్యవాణి) కేరళలో స్టెనోగ్రాఫర్ గా పనిచేస్తుంది. వీరిద్దరికీ ఆర్థిక ఇబ్బందులను తొలగించుకునేందుకు ఒక పెద్ద సంస్థలో చేరడాని కోసం అవివాహితులమని గుమ్మడికి అబద్ధం చేబుతారు. అక్కడ చేరిన తర్వాత వారెదుర్కొనే సమస్యలు చిత్రంలోని ప్రధానాంశం.

పాత్రలు-పాత్రధారులు

[మార్చు]

పాటలు

[మార్చు]
పాట రచయిత సంగీతం గాయకులు
శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది క్రొత్తజీవితం ఆరుద్ర కె.వి.మహదేవన్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
అమ్ముకుట్టి అమ్ముకుట్టి మనసిలాయో వేటూరి కె.వి.మహదేవన్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
కృష్ణం కలయ సఖి సుందరం నారాయణ తీర్థ కె.వి.మహదేవన్ ఎస్.పి.శైలజ, రాజేశ్వరి
సరికొత్త చీర ఊహించినాను ఆరుద్ర కె.వి.మహదేవన్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
హాయి హాయి శ్రీరంగ సాయి ఆరుద్ర కె.వి.మహదేవన్ ఎస్.పి.శైలజ, పి.సుశీల
పా ప పప్పు దప్పళం ఆరుద్ర కె.వి.మహదేవన్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
జగదానంద కారక కృష్ణంకలయశక్తి కె.వి.మహదేవన్ వాణీ జయరాం

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

బయటి లింకులు

[మార్చు]