అనిల్ మల్నాడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జి. ఆర్. అనిల్ మల్నాడ్
జననం
జి. ఆర్. దత్తాత్రేయ

1957 అక్టోబర్ 12
మల్నాడ్, కర్ణాటక, భారతదేశం
మరణం2018 మార్చి 19(2018-03-19) (వయసు 60)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
వృత్తిసినిమా ఎడిటర్

జి. ఆర్. అనిల్ మల్నాడ్ (1957 అక్టోబరు 12 - 2018 మార్చి 19) భారతీయ సినిమా ఎడిటర్.[1][2] తెలుగు, తమిళ, ఒడియా, తదితర భాషల సినిమా రంగాల్లో 200 పైచిలుకు సినిమాలుక ఎడిటర్‌గా పనిచేశాడు. సితార సినిమా ఎడిటింగ్‌కు గాను 1984 జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ ఎడిటర్‌గా పురస్కారం అందుకున్నాడు.

జీవిత చరిత్ర[మార్చు]

అనిల్ మల్నాడ్ అసలు పేరు జి.ఆర్.దత్తాత్రేయ. కర్ణాటకలోని మల్నాడ్ ప్రాంతంలో జన్మించాడు.

సినిమాటోగ్రఫీ కోర్సు నేర్చుకుందామనే ఆలోచనతో చెన్నై చేరుకున్న అనిల్‌కు ఆ కోర్సులో సీటు దొరకకపోవడంతో దర్శకత్వ విభాగంలో పనిచేయడానికి ప్రయత్నాలు చేశాడు. 1971లో బాపు దర్శకత్వం వహించిన సంపూర్ణ రామాయణం సినిమాకు సహాయ దర్శకుడిగా తన సినిమా కెరీర్ ప్రారంభించాడు. దర్శకత్వ విభాగంతో పాటు ఎడిటింగ్‌పైనా శ్రద్ధ పెట్టి నేర్చుకున్నాడు.[3] అనిల్ పనితీరు నచ్చడంతో బాపు తన వంశవృక్షం (1980) సినిమాతో ఎడిటర్‌గా పనిచేసేందుకు తొలి అవకాశం ఇచ్చాడు. ఆపై తెలుగు, తమిళ, ఒడియా, హిందీ వంటి 9 భాషల్లో 200 పైచిలుకు సినిమాలకు ఎడిటింగ్ చేశాడు.[4] ఇన్ని భాషల్లో ఎడిటర్‌గా పనిచేసిన అతికొద్దిమందిలో ఒకరిగా పేరొందాడు.[3] బాపు దర్శకత్వంలోనే 22 సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత వంశీ సినిమా సితారతో ప్రారంభించి అతని సినిమాలకూ వరుసగా ఎడిటింగ్ చేయసాగాడు. గీతా కృష్ణ, కె. రాఘవేంద్రరావు వంటి ఇతర దర్శకులకు కూడా పనిచేశాడు.[3]

1984లో సితార సినిమా ఎడిటింగ్‌కు గాను జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ ఎడిటర్‌గా పురస్కారం అందుకున్నాడు.[5] పలు నంది అవార్డులూ అందుకున్నాడు.[3] లేడీస్ టైలర్ సినిమాని కన్నడలో డబ్బింగ్ చేసి విడుదల చేశాడు. సినిమా ఫ్లాప్‌ అయింది.[6] దత్తాత్రేయ అన్న పేరు చెన్నైలోని తమిళ సినిమా పరిశ్రమలో ఎవరికీ సరిగా తన పేరు ఉచ్చరించకలేక పోవడంతో అనిల్ అన్న పేరు ఖాయం చేసుకున్నాడు, వెనుక తన ఊరి పేరైన మల్నాడ్ చేర్చుకున్నాడు.[3]

అనిల్ మల్నాడ్ తన కుటుంబంతో చెన్నైలోని క్రోమ్‌పేటలో జీవించాడు. 2018 మార్చి 19న చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించాడు.[4]

సంక్షిప్త ఫిల్మోగ్రఫీ[మార్చు]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-03-21. Retrieved 2020-06-14.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-06-14. Retrieved 2020-06-14.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 "సీనియర్‌ ఎడిటర్‌ అనిల్‌ మల్నాడ్‌ ఇకలేరు". Sakshi. 2018-03-20. Retrieved 2020-06-14.
  4. 4.0 4.1 "'సితార' చిత్రంతో జాతీయ అవార్డు పొందిన ఎడిటర్ అనిల్ మల్నాడ్ ఇక లేరు!." ap7am.com. Archived from the original on 2020-06-14. Retrieved 2020-06-14.
  5. Narasimham, M. L. (2017-10-02). "Kinnerasani: Lyrical and melodious treat". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-06-14.
  6. "30 Years of Ladies Tailor". telugucinema.com (in ఇంగ్లీష్). 2016-12-03. Archived from the original on 2020-02-06. Retrieved 2020-06-14.
  7. admin (2015-10-27). "Anveshana (1985) - A Retrospective". telugucinema.com (in ఇంగ్లీష్). Archived from the original on 2020-06-14. Retrieved 2020-06-14.