తారక రాముడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తారక రాముడు
దర్శకత్వంఆర్. వి. ఉదయకుమార్
రచనఎం. వి. ఎస్. హరనాథ రావు (మాటలు),
సుజాత ఉదయ్ కుమార్ (కథ)
నిర్మాతఎం. సుధాకర్, కె. శోభన్ బాబు
తారాగణంశ్రీకాంత్,
సౌందర్య
ఛాయాగ్రహణంఎం. సుధాకర్
కూర్పుఅనిల్ మల్నాడ్
సంగీతంకోటి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
ఆగస్టు 29, 1997 (1997-08-29)[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

తారక రాముడు 1997లో ఆర్. వి. ఉదయకుమార్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో శ్రీకాంత్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది తమిళంలోకి వెళ్ళి నిలవే అనే పేరుతో అనువాదం చేయబడింది.

రాముడు ఒక అనాథగా పెరుగుతుంటాడు. తారక అతణ్ణి ఆదరిస్తూ ఉంటుంది. ధనవంతుడైన గజపతి తన తండ్రి అని, ఆయన మొదటి భార్య బిడ్డ రాముడికి తెలుస్తుంది. గజపతి రెండో భార్య, బావమరిది ఎలాగైనా అతని ఆస్తిని స్వాధీనం చేసుకోవాలని చూస్తుంటారు. అందుకోసం రకరకాల ఎత్తులు వేస్తుంటారు. రాముడు ఆస్తికి వారసుడవుతాడని తెలియడంతో అతన్ని ఇంటికి కొడుకుగా ఆహ్వానించి తండ్రీ కొడుకుల్నిద్దరినీ విషం పెట్టాలని చూస్తారు. కానీ సమయానికి తారక వచ్చి కాపాడుతుంది. రాముడు తండ్రి మీద కోపంతో అలిగి తారక దగ్గరకు వచ్చేస్తాడు. కానీ ఆమె గజపతి అమాయకుడనీ, గజపతి భార్య, అతని అన్న ఆయన్ను చంపడానికి చూస్తున్నారని చెప్పడంతో వాళ్ళను తండ్రిని కాపాడుకుంటాడు రాముడు. కానీ ఆ నేరంపై జైలుకు వెళతాడు. తనకు నా అనే వాళ్ళెవరూ జామీను ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో తారక భార్యగా ముందుకు రావడంతో కథ ముగుస్తుంది.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]

పాటల రచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి

  • రాముడు మంచి బాలుడు అనీ అంతా అంటారు, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • ఇవ్వాలి ఇవ్వాళైన మీరు , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • సడి చేయకమ్మా గాలి , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • హాయి హాయి వెన్నెలమ్మ హాయి (ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం)
  • కోపం వస్తే మండుటెండ , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • దండాలండి కొత్త దొర గారికి , గానం. కృష్ణంరాజు, కె ఎస్ చిత్ర.
  • చెట్టు మీద, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

[మార్చు]
  1. "Taraka Ramudu on Moviebuff.com". Moviebuff.com. Retrieved 2020-05-12.