ఆర్. వి. ఉదయకుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆర్. వి. ఉదయకుమార్
జననం
మెట్టుపాళయం, కోయంబత్తూరు జిల్లా, తమిళనాడు, భారతదేశం
విద్యాసంస్థఎంజీఆర్ గవర్నమెంట్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్
వృత్తిదర్శకుడు, నటుడు, గీత రచయిత
క్రియాశీల సంవత్సరాలు1988–1996
2005
2012–ప్రస్తుతం
జీవిత భాగస్వామిసుజాత

ఆర్. వి. ఉదయకుమార్ భారతీయ చలనచిత్ర దర్శకుడు, పాటల రచయిత, నటుడు, ఆయన 1990లలో తమిళ చిత్ర పరిశ్రమలో ప్రధానంగా పనిచేశాడు, యెజమాన్ (1993), చిన్న గౌండర్ (1992) వంటి చిత్రాలను నిర్మించాడు.[1][2] కొన్ని తెలుగు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.

ఆయన దర్శకత్వం వహించిన కిజక్కు వాసల్ (1990), చిన్న గౌండర్ (1992) సినిమాలు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్ (తృతీయ బహుమతి) అందుకున్నాయి. ఇక తెలుగులో ఆయన తారక రాముడు (1997), మిస్టర్ రాస్కెల్ (2011) చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఆయన పదుల సంఖ్యలో తమిళ చలనచిత్రాలకు పాటలను కూడా రాసాడు.

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

మెట్టుపాళయం సమీపంలోని మొల్లేపాళయం అనే గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో ఆర్. వి. ఉదయకుమార్ జన్మించాడు. అతని తండ్రి వెంకటసామి, తల్లి కన్నమ్మాళ్. ఆయన ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుండి పి. యు.సి పట్టభద్రుడయ్యాడు. కోయంబత్తూరులో బ్యాచులర్ ఆఫ్ సైన్స్ పూర్తిచేసాడు. ఆ తరువాత, డైరెక్షన్‌లో డిప్లొమా చేయడానికి మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు. ఆ సమయంలో ఆయన పలు లఘు చిత్రాలకు దర్శకత్వం వహించాడు.[3]

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఆయన తన పలు చిత్రాలకు కథ అందించిన సుజాతను వివాహం చేసుకున్నాడు.[4]

ఫిల్మోగ్రఫీ[మార్చు]

నటుడిగా[మార్చు]

చిన్న గౌండర్ (1992)
పొన్నుమణి (1993) తెలుగులో ముద్దుల బావ
ఎజమాన్ (1993)
రాజకుమారన్ (1994)
చిన్న రామసామి పెరియ రామసామి (2000) – విడుదల కాలేదు
ఇరు నాధిగల్ (2008)
సూర్య నగరం (2012)
పసంగ 2 (2015) తెలుగులో మేము
అంజల (2016)
తొడారి (2016) తెలుగులో రైల్
దేవి (2016 - బహుభాషా) తెలుగులో అభినేత్రి
పాంభు సత్తాయ్ (2017)
కెలంబితంగయ కెళంబితంగయ (2018)
100% కాదల్ (2019)
ఇది కథాయిల్లా నిజం (2023)
కారుమేగంగల్ కలైగింద్రణ (2023)

మూలాలు[మార్చు]

  1. "Archive News". The Hindu. 2007-10-22. Archived from the original on 2010-12-19.
  2. "A director's take on movies". The Hindu. 27 November 2004. p. 03. Archived from the original on 25 January 2005 – via The Hindu (old).
  3. "சத்யா மூவிஸ் படத்தில் சிவாஜிகணேசனை டைரக்ட் செய்த உதயகுமார்" [Udayakumar directed Sivaji Ganesan for Sathya Movies]. Maalai Malar. April 11, 2016. Archived from the original on 3 May 2016.
  4. "ஐடியா கொடுப்பதே முதல் வேலை!". Kalki (in తమిళము). 17 March 1996. pp. 4–5. Archived from the original on 17 May 2023. Retrieved 17 May 2023.