Jump to content

చెట్టుకింద ప్లీడరు

వికీపీడియా నుండి
చెట్టుకింద ప్లీడరు
(1989 తెలుగు సినిమా)
దర్శకత్వం వంశీ
తారాగణం రాజేంద్ర ప్రసాద్, కిన్నెర, శరత్ బాబు, గొల్లపూడి మారుతీరావు, ఊర్వశి, రావి కొండలరావు, దేవదాస్ కనకాల .
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ సిరి సినీచిత్ర
భాష తెలుగు

పాత్రల వివరాలు

[మార్చు]

చిత్ర కథ

[మార్చు]

గోపాలకృష్ణ, సుజాతను ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. సుజాతను ఒక అనాధాశ్రమంలో చూసి నచ్చి పెళ్ళి చేసుకుంటాడు గోపాలకృష్ణ. తిరుపతిలో,అతని భార్య, కొడుకులతో అన్యోనంగా జీవితాన్ని గడుపుతారు. గోపాలకృష్ణకి సొంత ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆఫీసు పనుల్లో ఎప్పుడూ బిజీగా ఉంటాడు. అలా ఒక కొంత కాలం గడచిన తరువాత, గోపాలకృష్ణ ఆఫీసు పనులు ముగించుకుని ఆ రాత్రి ఇంటికి వస్తుండగా కారు ప్రమాదంలో మరణించినట్టుగా సుజాతకు పోలీస్ స్టేషను నుండి ఫోన్ వస్తుంది. గోపాలకృష్ణకి అంత్యక్రియలు జరుగుతాయి. అంత్యక్రియలు జరిగేటప్పుడు గోపాలకృష్ణ వాళ్ళ నాన్న శరభయ్య, అతని కొడుకు ఆలస్యంగా అక్కడికి వస్తారు. గోపాలకృష్ణ భార్య కంపెనీ బాధ్యతలు స్వీకరిస్తుంది. ఒక రోజు ఆఫీస్ లో ఉండగా శరభయ్య,వాళ్ళ అబ్బాయి అక్కడికి వస్తారు వచ్చి, అమ్మాయ్ నువ్వొక్కదానివి ఈ కంపెనీ వ్యవహారాలు చూసుకోవడం ఇబ్బందిగా ఉందేమో, మా అబ్బాయి ఆఫీస్ పనులు రాజబాబు, గోపాలకృష్ణ తమ్ముడు చూసుకుంటాడు నువ్వు ఇంట్లో ఉండి బాబు మంచి, చెడ్డ చూసుకోమ్మా అని శరభయ్య సలహా ఇస్తాడు. అందుకు సుజాత ఒప్పుకోదు. తరువాత రోజు శరభయ్య, సుజాతకు లాయర్ నోటీసు పంపిస్తాడు. అసలు ఆయనకు నాకు పెళ్ళే కాలేదని, అసలు మనకి వాళ్ళకి ఏ సంబంధము లేదని లాయర్ నోటిసు పంపిస్తాడు. తాను కూడా ఒక మంచి లాయర్ కోసం వెదుకుతూ ఉండగా బాలరాజు కనిపిస్తాడు. బాలరాజు (రాజేంద్ర ప్రసాద్) ఒక న్యాయవాది. ఒక డొక్కు కారు వేసుకుని తిరుగుతూ ఉంటాడు. అతనికి కేసులు వాదించడంపై పెద్దగా అవగాహన ఉండదు. కాని కేసులేమైనా దొరుకుతాయేమోనని ఆశగా ఎదురుచూస్తాడు. బాలరాజు వద్దకు సుజాత వచ్చి విషయమంతా చెప్తుంది. అప్పటి నుండి ఆకతాయిగా అల్లరిగా ఉండే, బాలరాజు ఈ కేసు పై ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఈ కేసు గెలిచి నేనేంటో వాళ్ళకి చూపిస్తానని అంటాడు బాలరాజు. ఈ విషయం తెలిసిన శరభయ్య బాలరాజుని చంపే ప్రయత్నం చేస్తాడు. ఒకానొక సందర్భంలో శరభయ్యకి భయపడి ఈ కేసుని వదిలేద్దామనే నిర్ణయానికి వస్తాడు బాలరాజు. సుజాత గారి దగ్గరకు వెళ్ళి, ఇదే విషయం ఆవిడకు చెబుతాడు. ఆవిడ ఏడుస్తూ బాలరాజు కాళ్ళు పట్టుకుని బాలరాజు గారు, అంత మాట అనకండి. మా బాబుని, నన్ను ఆదుర్మార్గుడి చేతిలో నుండి మమ్మలి రక్షించండి.మీరు తప్పమాకు వేరే దిక్కు లేదు. బాలరాజు ఆవిడ మాటలకు ఏ సమాధానం చెప్పలేక సరేనని చెప్పి ఆవిడని పంపిస్తాడు.

బాలరాజు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉండగా గోపాలకృష్ణ తన ప్రాణ స్నేహితుడైన భగవంతం (కనకాల దేవదాసు) చిత్రకారుడు దగ్గరకు అప్పుడప్పుడు వెళ్ళుతుండేవాడని తెలిసి, అతని వద్దకు ఏదైనా సమాచారం లభిస్తుందేమోనని అక్కడికి వెళ్తాడు. అక్కడ బాలరాజుకి భగవంతం ద్వారా కొన్ని షాక్ కలిగించే విషయాలు తెలుస్తాయి. కోర్టులో విచారణ జరుగుతుంది. గోపాలకృష్ణ స్నేహితుడైన భగవంతం బోనులో ఉన్నాడు. అతణ్ణి బాలారాజు ప్రశ్నలు అడుగుతున్నాడు. భగవంతం గారూ గోపాలకృష్ణగారు మీదగ్గరికి అప్పుడప్పుడు వస్తుండేవారు కారణం ఏమిటి? గోపాలకృష్ణ ప్రతి సంవత్సరం అక్టోబరు 2న తన తండ్రి సమాధి దగ్గరికి వచ్చేవాడు. భగవంతం గారు మీ స్నేహితుడికి మీకు మధ్య రహస్యాలేమైనా ఉన్నాయా? లేవు గాని ఒకటి మాత్రం ఉంది. చాలా కాలం తన మనసులోనే దాచుకుని ఒక రోజు తట్టుకోలేక నాతో చెప్పాడు. నా దగ్గరికి దిగులుగా బాధగా వచ్చాడు. ఏమైందని అడిగితే ఓరేయ్ భగవంతం నీకన్నా నాకు ఈ లోకంలో ఆత్మీయులు ఏవరూ లేరురా. అలాంటి నీ దగ్గర కూడా ఒక నిజం దాచనురా. అప్పుడు నాకు 11 ఏళ్ళ వయసు శరభయ్య అనే నీచుడు మా ఇంట్లో చేరి, మా నాన్నగారి దగ్గర మంచిగా నటిస్తూ మా అమ్మని నమ్మించి మోసం చేసి ఆమెతో అక్రమ సంభధం పెట్టుకున్నాడు. ఆ విషయం ఏవరి దగ్గర చెప్పలేక ఏంతగానో బాధపడేవాణ్ణి ఆ శరభయ్యని చంపి ముక్కలుగా నరకాలనిపించేది. కాని అప్పుడు నేను చాలా చిన్నవాణ్ణిరా ఏమి చేయ్యలేక ఏంతగానో ఏడ్చేవాడిని. ఒక రోజు ఆ శరభయ్య, మా అమ్మ, మా నాన్న గారికి దొరికిపోతే మా నాన్న కత్తి తీసి చంపబోతే ఆ కత్తిని బలవంతంగా లాక్కున్ని మా నాన్నని నిర్దక్ష్యణ్యంగా చంపేశాడురా అని చెప్పాడు ఇది జరిగింది బాలరాజు గారు. జడ్జి గారు దీని బట్టి తెలిసిందేమంటే గోపాలకృష్ణని చంపేస్తే అతడి ఆస్తికి అధికారి కావచ్చనే ఆలోచనతో అతడిని అతి కిరాతకంగా అతి దారుణంగా హత్య చేయించాడు ఈ శరభయ్యా.. ఈ విధంగా నిజం నిరూపించబడడంతో శరభయ్యకి శిక్ష పడుతుంది. సినిమా ముగుస్తుంది.

ఈ చిత్రం లోని పాటల వివరాలు

[మార్చు]
  • అల్లి బిల్లి కలలా రావే, రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • చల్తా కా నాం గాడి, రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • జిగి జిగి వనజా , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • కునాలో
  • నీరుగారి పారిపోకు, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర