అమృతం చందమామలో
అమృతం చందమామలో | |
---|---|
దర్శకత్వం | గుణ్ణం గంగరాజు |
నిర్మాత | ఊర్మిళ గుణ్ణం |
తారాగణం | శ్రీనివాస్ అవసరాల, హరీష్, వాసు ఇంటూరి, నారిపెద్ది శివన్నారాయణ, ధన్య బాలకృష్ణ, సుచిత్ర |
ఛాయాగ్రహణం | రసూల్ ఎల్లోర్ |
కూర్పు | ధర్మేంద్ర కాకరాల |
సంగీతం | శ్రీ |
నిర్మాణ సంస్థ | జస్ట్ ఎల్లో మీడియా[1] |
విడుదల తేదీ | 17 మే 2014[1] |
సినిమా నిడివి | 140 నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అమృతం చందమామలో 2014, మే 17న విడుదలైన తెలుగు చలనచిత్రం. జస్ట్ ఎల్లో మీడియా పతాకంపై గుణ్ణం గంగరాజు[2] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీనివాస్ అవసరాల, హరీష్, వాసు ఇంటూరి, నారిపెద్ది శివన్నారాయణ, ధన్య బాలకృష్ణ, సుచిత్ర తదితరులు నటించగా, శ్రీ సంగీతం అందించాడు. అంతరిక్ష హస్య నేపథ్యంలో వచ్చిన తొలి తెలుగు చిత్రమిది.[3]
నటవర్గం
[మార్చు]- శ్రీనివాస్ అవసరాల (అమృతరావు)
- హరీష్ (ఆంజనేయులు/అంజి)
- వాసు ఇంటూరి (సర్వం)
- నారిపెద్ది శివన్నారాయణ (అప్పాజీ)
- ధన్య బాలకృష్ణ (సంజీవిని)
- సుచిత్ర బాండేకర్ (శాంత)
- బ్రహ్మానందం
- ఎం. ఎస్. నారాయణ
- సత్యం రాజేష్
- పావని రెడ్డి
- సప్తగిరి
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- కృష్ణ భగవాన్
- రావు రమేష్
- ఆహుతి ప్రసాద్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: గుణ్ణం గంగరాజు
- నిర్మాత: ఊర్మిళ గుణ్ణం
- సంగీతం: శ్రీ
- ఛాయాగ్రహణం: రసూల్ ఎల్లోర్
- కూర్పు: ధర్మేంద్ర కాకరాల
- నిర్మాణ సంస్థ: జస్ట్ ఎల్లో మీడియా
నిర్మాణం
[మార్చు]1996లో లిటిల్ సోల్జర్స్ సినిమాకు పనిచేసిన దర్శకుడు గుణ్ణం గంగరాజు, సంగీత దర్శకుడు శ్రీ కొమ్మినేని, సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ ముగ్గురు మళ్ళీ ఈ చిత్రం కోసం కలిసి పనిచేశారు.[1] ఈ చిత్రాన్ని చందమామలో అమృతం పేరుతో నిర్మించారు, తరువాత అమృతం చందమామలో అని మార్చారు. ఈ చిత్రంలో హైదరాబాదుకు చెందిన లాఫింగ్ డాట్స్, ఇసిఎస్ కంపెనీలు చేసిన 60 నిమిషాల గ్రాఫిక్స్ ఉన్నాయి. రెడ్ ఎపిక్ కెమెరా ఉపయోగించి ఈ చిత్రం చిత్రీకరించబడింది.[1][3]
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి శ్రీ సంగీతం అదించాడు.[4] ఇది శ్రీ సంగీతం అదించిన చివరి చిత్రం.[5]
సం. | పాట | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "లక లక" | శ్యామ్, ఎంఎల్ఆర్ కార్తికేయన్ | |
2. | "మూన్ లైట్ గర్ల్" | దీపు, ఎంఎల్ఆర్ కార్తికేయన్, సాహితి గాలిదేవర | |
3. | "పట పలాసుల" | సాయి శ్రీకాంత్ | |
4. | "బహుపరాక్" | మనో | |
5. | "యరుకగా" | మనో | |
6. | "ఏరువాక సాగారో" | సాహితి గాలిదేవర | |
7. | "ఘలాన్ ఘలాన్" | సాయి శ్రీకాంత్ |
విడుదల
[మార్చు]- టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ చిత్రానికి 3/5 రేటింగ్ ఇచ్చింది.[3]
- దక్కన్ క్రానికల్ ఈ చిత్రానికి 3/5 రేటింగ్ ఇచ్చింది. ఈ చిత్రం కుటుంబానికి, ముఖ్యంగా పిల్లలకు మంచి వినోదాన్ని అందిస్తుందని తెలిపింది.[2]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 Krishnamoorthy, Suresh (May 9, 2014). "Family-entertainer with dollops of comedy". The Hindu.
- ↑ 2.0 2.1 "Movie review 'Amrutham - Chandamama Lo': Is a good laughing piece". Deccan Chronicle. May 18, 2014.
- ↑ 3.0 3.1 3.2 "Amrutham Chandamamalo Movie Review {3/5}: Critic Review of Amrutham Chandamamalo by Times of India". The Times of India.
- ↑ "Amrutham Chandamama Lo - Sree, Anantha Sriram - Download or Listen Free - JioSaavn". JioSaavn. Archived from the original on 2020-06-04. Retrieved 2020-08-02.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (13 September 2015). "సంగీత దర్శకుడి శ్రీ జయంతి". andhrajyothy.com. Archived from the original on 2 August 2020. Retrieved 2 August 2020.
ఇతర లంకెలు
[మార్చు]- క్లుప్త వివరణ ఉన్న articles
- 2014 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- 2014 తెలుగు సినిమాలు
- తెలుగు హాస్య సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- ఎం.ఎస్.నారాయణ నటించిన సినిమాలు
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం నటించిన సినిమాలు
- కృష్ణ భగవాన్ నటించిన సినిమాలు
- ఆహుతి ప్రసాద్ నటించిన సినిమాలు
- కాకరాల నటించిన సినిమాలు