ధర్మేంద్ర కాకరాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధర్మేంద్ర కాకరాల
ధర్మేంద్ర కాకరాల
జననం1981 (age 42–43)
వృత్తిసినిమా ఎడిటర్
క్రియాశీల సంవత్సరాలు2010 – ప్రస్తుతం

ధర్మేంద్ర కాకరాల భారతీయ సినిమా ఎడిటర్. ఇతడు తెలుగు, హిందీ సినిమాలలో పనిచేశాడు. కొన్ని వెబ్ సిరీస్‌లకు కూడా ఎడిటర్‌గా పనిచేశాడు.

జీవిత విశేషాలు[మార్చు]

ధర్మేంద్ర కాకరాల ఏలూరులో 1981లో జన్మించాడు. ఇతని కుటుంబ నేపథ్యం చాలా పెద్దది. ఇతని ముత్తాత కె. బాలకృష్ణారావు పేరుమోసిన న్యాయవాది, భూస్వామి. ఇతని తాత కె.ధర్మారావు ప్రఖ్యాత వైద్యుడు. ఇతని నాన్నమ్మ లలితాదేవి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పేరు గడించింది. ఇతడు మొదట బి.ఎ. డిగ్రీ చదివాడు. తరువాత కోల్‌కాతాలోని సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి 2004లో ఆ సంస్థ నుండి పట్టభద్రుడయ్యాడు.[1]

సినిమా రంగం[మార్చు]

ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి వచ్చిన వెంటనే ఇతడు ఒక 'వి' చిత్రం, లక్ష్మీ కళ్యాణం, బంగారు బాబు, చందమామ వంటి అనేక సినిమాలకు సహాయ ఎడిటర్‌గా, అసోసియేట్ ఎడిటర్‌గా పనిచేసి అనుభవాన్ని గడించాడు. దేవ కట్టా దర్శకత్వంలో 2010లో విడుదలైన ప్రస్థానం సినిమాతో ఇతడు ఎడిటర్‌గా తన ప్రస్థానాన్ని ఆరంభించాడు.

ఫిల్మోగ్రఫీ[మార్చు]

ఇతడు ఎడిటర్‌గా పనిచేసిన తెలుగు సినిమాల జాబితా:

విడుదలైన సంవత్సరం సినిమా పేరు వివరాలు
2010 ప్రస్థానం తొలి సినిమా
2011 ఎల్‌బిడబ్ల్యు: లైఫ్ బిఫోర్ వెడ్డింగ్
దడ
2012 వెన్నెల 1 1/2
రొటీన్ లవ్ స్టోరీ
2013 బ్యాక్‌బెంచ్ స్టూడెంట్
మల్లెలతీరంలో సిరిమల్లెపువ్వు
డి ఫర్ దోపిడి
2014 అమృతం చందమామలో
చందమామ కథలు
బంగారు కోడిపెట్ట
2015 బందిపోటు
దాగుడుమూత దండాకోర్
అసుర
2016 పడేసావే
గుంటూర్ టాకీస్
ఒక మనసు
2017 పిఎస్‌వి గరుడ వేగ
2019 సకల కళా వల్లభుడు
తిప్పరా మీసం
2021 సినిమా బండి
2022 అల్లూరి
తెలిసినవాళ్లు
ది ఘోస్ట్
పెళ్ళికూతురు పార్టీ
వాళ్ళిద్దరి మధ్య
2023 ది గ్రేట్ ఇండియన్ సూసైడ్
శబరి

వెబ్ సిరీస్[మార్చు]

మూలాలు[మార్చు]

  1. వెబ్ మాస్టర్. "Dharmendra Kakarala Editor". వి సినిమా. Retrieved 24 December 2023.

బయటి లింకులు[మార్చు]