మల్లెలతీరంలో సిరిమల్లెపువ్వు
మల్లెలతీరంలో సిరిమల్లెపువ్వు | |
---|---|
దర్శకత్వం | రామరాజు |
రచన | రామరాజు |
నిర్మాత | ఉమాదేవి |
తారాగణం | క్రాంతిచంద్ శ్రీదివ్య |
సంగీతం | పవన్‌కుమార్ |
విడుదల తేదీ | జూలై 6, 2013 |
భాష | తెలుగు |
మల్లెలతీరంలో సిరిమల్లెపువ్వు 2013 జూలై 6 న విడుదలైన తెలుగు చిత్రం. దర్శకుడు రామరాజుకు ఇది తొలి చిత్రం.
కథ
[మార్చు]లక్ష్మి (శ్రీదివ్య) సాదాసీదా జీవితాన్ని గడుపుతూ తన జీవితం గురించి బంగారు కలలు కంటుండే ఒక సాంప్రదాయిక యువతి. ఆమె తండ్రి (రావు రమేశ్) ఒక మంచి సంబంధాన్ని చూసి లక్ష్మి పెళ్ళి జరిపిస్తాడు. కోటి ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన లక్ష్మికి తన భర్త మానవ సంబంధాలకన్నా కేవలం డబ్బుకు విలువ ఇచ్చే వ్యక్తని తెలుస్తుంది. భర్త ఆమెని నిర్లక్ష్యం చేస్తాడు. అదే సమయంలో ఆమెకు గేయ రచయిత క్రాంతి (క్రాంతి చంద్) పరిచయమౌతాడు. ఇద్దరి భావాలు దాదాపు ఒకటే కావడంతో లక్ష్మికి అతను దగ్గరౌతాడు. తర్వాత వారి జీవితాలలో చోటుచేసుకునే మార్పులేమిటి? తదనంతర పరిణామాలతో చిత్ర కథ సాగుతుంది.
నటవర్గం
[మార్చు]- రావు రమేశ్ - లక్ష్మి తండ్రి
- శ్రీదివ్య - లక్ష్మి
- క్రాంతి చంద్ - క్రాంతి
సాంకేతికవర్గం
[మార్చు]- కథ, దర్శకుడు - రామరాజు
- సంగీతం - పవన్ కుమార్
- నిర్మాత - ఉమాదేవి
ప్రశంసలు
[మార్చు]ఈ చిత్రం విమర్శల ప్రశంసలు అందుకుంది. మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు తన్ హృదయాన్ని దోచుకుందని, ఒక మంచి పుస్తకాన్ని చదివిన అనుభూతి కలిగిందని ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తెలిపారు. చిత్ర కథానాయిక శ్రీదివ్య నటనను ప్రత్యేకంగా ప్రశంసించారు.[1]
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-07-09. Retrieved 2013-07-09.