సకల కళా వల్లభుడు
సకల కళా వల్లభుడు | |
---|---|
దర్శకత్వం | శివ గణేష్ |
కథ | శివ గణేష్ |
నిర్మాత | అనిల్ కుమార్ గుంట్రెడ్డి, త్రినాథ్ దడల, కిషోర్, శ్రీకాంత్ దీపాల |
తారాగణం | తనిష్క్ రెడ్డి, మేఘల ముక్తా, పృథ్వీరాజ్, సుమన్, జీవా |
ఛాయాగ్రహణం | సాయి చరణ్ |
కూర్పు | ధర్మేంద్ర కాకరాల |
సంగీతం | అజయ్ పట్నాయక్ |
నిర్మాణ సంస్థ | సింహ ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 1 ఫిబ్రవరి 2019 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సకల కళా వల్లభుడు 2019, ఫిబ్రవరి 1న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1][2] సింహా ఫిల్మ్స్ పతాకంపై అనిల్ కుమార్ గుంట్రెడ్డి నిర్మాణ సారథ్యంలో శివ గణేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తనిష్క్ రెడ్డి, మేఘల, పృథ్వీరాజ్, సుమన్, జీవా తదితరులు నటించగా, అజయ్ పట్నాయిక్ సంగీతం అందించాడు. ఒక గ్రామ నేపథ్యంలో[3] కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్[4] గా తెరకెక్కిన ఈ చిత్రం 2017, డిసెంబరులో షూటింగ్ ప్రారంభించబడింది.[5][6]
కథా నేపథ్యం
[మార్చు]తనిష్క్ (తనిష్క్ రెడ్డి), చైత్ర (మేఘాల ముక్తా) తో ఫస్ట్ లుక్ లోనే ప్రేమలో పడతాడు. అతని ప్రవర్తన నచ్చకపోవడంతో ఆమె పట్టించుకోదు. అదే సమయంలో చైత్ర కిడ్నాప్ కి గురౌతుంది. ఇంతకీ ఈ చైత్ర ఎవరు, ఆమెను ఎందుకు కిడ్నాప్ చేస్తారు, తనిష్క్ ఆమెను ఎలా కాపాడుతాడు అన్నది మిగతా కథ.[7]
నటవర్గం
[మార్చు]- తనీష్క్ రెడ్డి
- సుమన్
- మేఘల ముక్త
- పృథ్వీరాజ్
- అలెక్సియస్ మాక్లియోడ్
- జబర్దస్త్ వినోద్ కుమార్
- ఉత్తేజ్
- జీవా
- అనంత్
- అపూర్వ
సాంకేతికవర్గం
[మార్చు]- కథ, దర్శకత్వం: శివ గణేష్
- నిర్మాత: అనిల్ కుమార్ గుంట్రెడ్డి, త్రినాథ్ ధడాలా, కిషోర్, శ్రీకాంత్ దీపాల
- సంగీతం: అజయ్ పట్నాయక్
- సినిమాటోగ్రఫీ: సాయి చరణ్
- కూర్పు: ధర్మేంద్ర కాకరల ఎడిట్ చేశారు
- నిర్మాణసంస్థ: సింహా ఫిల్మ్స్
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి అజయ్ పట్నాయక్ (ఆర్. పి. పట్నాయక్ తమ్ముడు) సంగీతం అందించాడు. మ్యాంగో మ్యూజిక్ సంస్థ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[8] సుభాస్ నటయన్, గిరిధర్ నాయుడు పాటలు రాశారు.
క్రమసంఖ్య | పాటపేరు | గాయకులు | రచయిత |
---|---|---|---|
1. | తిక్కరేగిన | గీతామాధురి | గిరిధర్ నాయుడు |
2. | కుర్ర ఈడు | శ్రీచరణ్ | గిరిధర్ నాయుడు |
3. | ఎలా ఎలా | ధనుంజయ్ భట్టాచార్య | సుభాష్ నటయన్ |
4. | ఆంధ్ర తెలంగాణ | కెపిఎస్ఎస్ ఐశ్వర్య | గిరిధర్ నాయుడు |
విడుదల
[మార్చు]ఈ చిత్రం 2020, ఫిబ్రవరి 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.[9] ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది.[10][11]
మూలాలు
[మార్చు]- ↑ "Sakalakala Vallabhudu completes shoot - Times of India". The Times of India. Retrieved 2020-12-05.
- ↑ "Sakala Kala Vallabhudu in Post Production Stagechitram_bhalare | chitram_bhalare". Chitram Bhalare. 2018-08-11. Archived from the original on 2018-09-09. Retrieved 2020-12-05.
- ↑ "గ్రామీణ నేపథ్యంలో..." Sakshi. 2017-12-27. Retrieved 2020-12-05.
- ↑ "Tanish Reddy set for a mass appeal | 123telugu.com". 123telugu.com. 2018-03-21. Retrieved 2020-12-05.
- ↑ "Sakalakala Vallabudu shooting start". www.cinemaguru123.com. Retrieved 2020-12-05.
- ↑ Cinemas, Telugu. "Sakala Kala Vallabhudu Shooting Started". www.telugucinemas.in. Retrieved 2020-12-05.
- ↑ BookMyShow. "Sakala Kala Vallabhudu Movie (2019)". BookMyShow. Retrieved 2020-12-06.
- ↑ "Tanishq Reddy is pretty confident about his 'Sakala Kala Vallabhudu'". www.raagalahari.com. Retrieved 2020-12-06.
- ↑ Manju (2019-01-29). "Sakalakala Vallabhudu Release Date February 1, 2019". actioncutok.com. Retrieved 2020-12-06.
- ↑ "Sakalakalavallabhudu Telugu Movie Review". 123telugu.com. 2019-02-01. Retrieved 2020-12-06.
- ↑ Codingest. "Review: Sakalakala Vallabhudu(Tanishq Reddy, Suman, Meghla)". NTV Telugu. Retrieved 2020-12-06.[permanent dead link]