బ్యాక్‌బెంచ్ స్టూడెంట్
బ్యాక్‌బెంచ్ స్టూడెంట్ | |
---|---|
దర్శకత్వం | మధుర శ్రీధర్ రెడ్డి |
స్క్రీన్ ప్లే | మధుర శ్రీధర్ రెడ్డి వెంకట్ సిధారెడ్డి లక్ష్మీభూపాల్ |
కథ | మధుర శ్రీధర్ రెడ్డి |
నిర్మాత | ఎం.వి.కె. రెడ్డి |
తారాగణం | మహత్ రాఘవేంద్ర పియా బాజ్‌పాయ్ అర్చన కవి బ్రహ్మానందం |
ఛాయాగ్రహణం | ప్రసాద్. జి.కె. |
కూర్పు | ధర్మేంద్ర కాకరాల |
సంగీతం | సునీల్ కష్యప్ |
నిర్మాణ సంస్థ | శిరిడి సాయి కంబైన్స్ |
విడుదల తేదీ | 15 మార్చి 2013 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బ్యాక్‌బెంచ్ స్టూడెంట్ 2013, మార్చి 15న విడుదలైన తెలుగు చలనచిత్రం. శిరిడి సాయి కంబైన్స్ పతాకంపై ఎం.వి.కె. రెడ్డి నిర్మాణ సారథ్యంలో మధుర శ్రీధర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహత్ రాఘవేంద్ర, పియా బాజ్‌పాయ్, అర్చన కవి, బ్రహ్మానందం నటించగా, సునీల్ కష్యప్ సంగీతం అందించాడు.[1][2] 16 సబ్జెక్టులలో ఫెయిల్ అయిన ఒక విద్యార్థి జీవితం ఎలా మారింది అన్న కథాశంతో ఈ చిత్రం రూపొందింది. హైదరాబాదు, విశాఖపట్నంలలో 55 రోజుల చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రానికి ప్రసాద్ జి.కె. ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు.[3]
కథా సారాంశం
[మార్చు]కార్తీక్ (మహాత్ రాఘవేంద్ర) చదువుమీద ఆసక్తి లేని ఒక ఇంజనీరింగ్ విద్యార్థి. 16 సబ్జెక్టులలో ఫెయిల్ అవుతాడు. కార్తీక్, తన స్నేహితురాలు ప్రియాంక (అర్చన కవి) ప్రేమిస్తుంటాడు. ప్రియాంక అతని నుండి విడిపోయి ఎం.ఎస్. చదవడానికి యుఎస్ఎకు వెలుతుంది. తను ఫెయిల్ అయిన విషయం తల్లిదండ్రులు (శరత్ బాబు, ప్రగతి) లకు తెలిసి, తనని దూరం పెడుతారు. దాంతో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటాడు. ఆ ప్రయత్నంలో చిత్ర (పియా బాజ్‌పాయ్) పరిచయం అవుతుంది. అదే సమయంలో ప్రియాంక తన చదువును ఆపేసి, కార్తీక్ ను వెతుక్కుంటూ యుఎస్ నుండి తిరిగి వస్తుంది. కార్తీక్ చైత్రతో ప్రేమలో ఉన్నాడని ఆమె తెలుసుకుంటుంది. ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.
నటవర్గం
[మార్చు]- మహత్ రాఘవేంద్ర (కార్తీక్)
- పియా బాజ్‌పాయ్ (చైత్ర)
- అర్చన కవి (ప్రియాంక)
- బ్రహ్మానందం (కరీనా కపూర్)
- శరత్ బాబు (కార్తీక్ తండ్రి)
- ఆలీ (సాఫ్ట్వేర్ కంపనీ మేనేజర్)
- ప్రగతి (కార్తీక్ తల్లి)
- బెనర్జీ
- ఇన్సీ గుత్తా
సాంకేతికవర్గం
[మార్చు]- కథ, దర్శకత్వం: మధుర శ్రీధర్ రెడ్డి
- నిర్మాత: ఎం.వి.కె. రెడ్డి
- చిత్రానువాదం: మధుర శ్రీధర్ రెడ్డి, వెంకట్ సిధారెడ్డి, లక్ష్మీభూపాల్
- సంగీతం: సునీల్ కష్యప్
- ఛాయాగ్రహణం: ప్రసాద్. జి.కె.
- కూర్పు: ధర్మేంద్ర కాకరాల
- నిర్మాణ సంస్థ: శిరిడి సాయి కంబైన్స్
పాటలు
[మార్చు]బ్యాక్‌బెంచ్ స్టూడెంట్ | |||
---|---|---|---|
పాటలు by సునీల్ కశ్యప్ | |||
Released | 17 ఫిబ్రవరి 2013 | ||
Genre | సినిమా పాటలు | ||
Length | 25:39 | ||
Language | తెలుగు | ||
Label | ఆదిత్యా మ్యూజిక్ | ||
|
ఈ చిత్రంలోని 7 పాటలకు సునీల్ కశ్యప్ సంగీతం అందించగా, సిరాశ్రీ, లక్ష్మీభూపాల్ పాటలు రాశారు.[4] 2013, ఫిబ్రవరి 17న ఆదిత్యా మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[5]
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ఇంజనీరింగ్ (రచన: సిరాశ్రీ)" | సిరాశ్రీ | హేమచంద్ర & శ్రీజ్యోతి | 04:16 |
2. | "జగడ జగడ (రచన: సిరాశ్రీ)" | సిరాశ్రీ | హేమచంద్ర | 03:47 |
3. | "వెన్నెలమ్మ (రచన: లక్ష్మీభూపాల్)" | లక్ష్మీభూపాల్ | దినకర్ | 03:44 |
4. | "ఐ ఆమ్ సారీ వినరా (రచన: సిరాశ్రీ)" | సిరాశ్రీ | శ్రీజ్యోతి & హేమచంద్ర | 03:40 |
5. | "తెలిసి తెలిసి (రచన: లక్ష్మీభూపాల్)" | లక్ష్మీభూపాల్ | దినకర్, ప్రణవి & సునీల్ కశ్యప్ | 03:50 |
6. | "సింబస్ పవర్ (రచన: సిరాశ్రీ)" (రిమిక్స్) | సిరాశ్రీ | సింబు | 03:15 |
7. | "సచిన్ టెండూల్కర్ బ్యాక్‌బెంచర్ (రచన: లక్ష్మీభూపాల్)" | లక్ష్మీభూపాల్ | అనిరుధ్ రవిచందర్ | 03:06 |
మొత్తం నిడివి: | 25:39 |
స్పందన
[మార్చు]నటీనటుల నటన, సంగీతం, ఛాయాగ్రహణం విషయంలో అనుకూల స్పందనలు వచ్చాయి.[6]
మూలాలు
[మార్చు]- ↑ "First look of Back Bench Student". Times of India. Archived from the original on 2013-04-11. Retrieved 24 June 2020.
- ↑ "First Look: Back Bench Student". Rediff. Retrieved 24 June 2020.
- ↑ "Back Bench Student to hit screens on March 15". The Hindu. Retrieved 24 June 2020.
- ↑ "Back Bench Student - By Sunil Kashyap". Saavn. Archived from the original on 2018-06-30. Retrieved 2020-06-24.
- ↑ "Back Bench Student (Original Motion Picture Soundtrack)". iTunes.
- ↑ "Backbench Student: View from the backbench". The Hindu.
- క్లుప్త వివరణ ఉన్న articles
- 2013 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- Album articles with non-standard infoboxes
- Album articles lacking alt text for covers
- Track listings with input errors
- 2013 తెలుగు సినిమాలు
- తెలుగు ప్రేమకథా సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- ఆలీ నటించిన సినిమాలు
- శరత్ బాబు నటించిన సినిమాలు