అర్చన కవి
అర్చన కవి | |
---|---|
జననం | అర్చన జోస్ కవి 1990 జనవరి 4 [ఆధారం చూపాలి] న్యూ ఢిల్లీ, భారతదేశం |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2009 - ప్రస్తుతం |
అర్చన జోస్ కవి (జననం 1990 జనవరి 4) భారతీయ నటి, యూట్యూబర్, టెలివిజన్ హోస్ట్. ఎం. టి. వాసుదేవన్ నాయర్ స్క్రిప్ట్, లాల్ జోస్ దర్శకత్వం వహించిన నీలతామర (2009) చిత్రంతో ఆమె సినిమా ప్రపంచంలోకి అరంగేట్రం చేసింది.[1][2]
2013లో వచ్చిన బ్యాక్‌బెంచ్ స్టూడెంట్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది,[3][4]
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]ఆమె న్యూఢిల్లీలో సీనియర్ పాత్రికేయుడు జోస్ కవియిల్, రోసమ్మ దంపతులకు జన్మించింది. జోస్ కవియిల్ కుటుంబం కేరళలోని కన్నూర్ జిల్లా కుడియన్మలకి చెందినది.[5] ఆమెకు ఆశిష్ కవి అనే అన్నయ్య ఉన్నాడు. ఆమె ఢిల్లీలోని సెయింట్ జేవియర్స్ స్కూల్ లో చదువుకుంది. 2006లో మార్ అగస్టినోస్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు కోసం అర్చన కేరళలోని రామాపురం వెళ్లింది.[6]
కెరీర్
[మార్చు]ఆమె టెలివిజన్ ఛానెల్ యెస్ ఇండియావిజన్‌లో ఇంటర్న్‌షిప్ చేసింది.[7] అక్కడ కొన్ని కార్యక్రమాల నిర్మాణంలో సహాయం చేసింది. ఆ తరువాత ఆమె అదే ఛానెల్‌లో బ్లడీ లవ్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఈ సమయంలో దర్శకుడు లాల్ జోస్ ఆమెను గుర్తించాడు. అతను మార్చి 2009లో తన చిత్రంలో ప్రధాన మహిళా పాత్రతో ఆమెను వెండితెరకు పరిచయం చేసాడు.[8]
వ్యక్తిగతం
[మార్చు]ఆమెకి స్టాండప్ కమెడియన్ అబిష్ మాథ్యూతో 2015 అక్టోబరు 31న నిశ్చితార్థం జరిగింది. వారు 2016 జనవరి 23న కేరళలోని వల్లర్‌పదం చర్చ్‌లో వివాహం చేసుకున్నారు,[9] అయితే 2021లో, ఈ జంట విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది.[10]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | నోట్స్ |
2009 | నీలతామర | కుంజిమలు | మలయాళం | |
2010 | మమ్మీ & మీ | ఆభరణం | ||
బెస్ట్ ఆఫ్ లక్ | నీతూ | |||
2011 | సాల్ట్ ఎన్ పెప్పర్ | పూజా నాయర్ | అతిధి పాత్ర | |
2012 | స్పానిష్ మసాలా | లిల్లీకుట్టి | ||
అరవాన్ | చిమిట్టి | తమిళం | ||
మజవిల్లినాట్టం వారే | రబియా | మలయాళం | ||
2013 | బ్యాక్‌బెంచ్ స్టూడెంట్ | ప్రియాంక | తెలుగు | |
అభియుంజనం | అభిరామి | మలయాళం | ||
హానీబీ | సారా | |||
పట్టం పోల్ | షెరిన్ | |||
బ్యాంగిల్స్ | ఏంజెల్ | |||
నాడోడిమన్నన్ | అతిరా | |||
2014 | టూ నూరా విత్ లవ్ | శ్రీపార్వతి | ||
డే నైట్ గేమ్ | అభిరామి | |||
మొనాయి అన్గానే ఆనయి | మెరిన్ | |||
జ్ఞాన కిరుక్కన్ | సుమతి | తమిళం | ||
2015 | సుఘమాయిరిక్కట్టే | రామ్లా | మలయాళం | |
కుక్కిలియార్ | సరయు | |||
2016 | దూరం | రసియా | ||
వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ దేర్ ఎ కల్లన్ |
మూలాలు
[మార్చు]- ↑ johnsonrichards (25 June 2012). "Archana Kavi:"I AM BLESSED" | Kochi Cochin News". Cochinsquare.com. Archived from the original on 12 December 2009. Retrieved 12 July 2012.
- ↑ "Going native". The Hindu. Chennai, India. 25 November 2009. Retrieved 10 June 2013.
- ↑ "First look of Back Bench Student". Times of India. Archived from the original on 2013-04-11. Retrieved 24 June 2020.
- ↑ "Back Bench Student to hit screens on March 15". The Hindu. Retrieved 24 June 2020.
- ↑ Sebastian, Shevlin. "Archana acting like a 'naadan' girl". The New Indian Express. Archived from the original on 23 అక్టోబరు 2013. Retrieved 14 October 2013.
- ↑ Asha Prakash, TNN (22 August 2011). "Archana Kavi Turns Tribal". The Times of India. Archived from the original on 12 April 2012. Retrieved 14 October 2013.
- ↑ Athira M. (27 December 2012). "Television beckons". The Hindu. Chennai, India. Retrieved 14 October 2013.
- ↑ Sreedhar Pillai, TNN (10 July 2010). "Archana Kavi gets bold". The Times of India. Archived from the original on 4 November 2012. Retrieved 14 October 2013.
- ↑ "Archana Kavi to marry stand-up comedian Abish Mathew | Archana Kavi to marry Abish Mathew".
- ↑ "Archana Kavi opens up about her fight with depression and her divorce". OnManorama. Retrieved 2021-12-23.