పియా బాజ్‌పాయ్
పియా బాజ్‌పాయ్ | |
---|---|
జననం | ఎటావా, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | 1993 డిసెంబరు 22
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2008– ప్రస్తుతం |
పియా బాజ్‌పాయ్ (ఆంగ్లం: Pia Bajpiee; జననం 1993 డిసెంబరు 22) ఒక భారతీయ నటి, మోడల్. ఆమె ప్రధానంగా బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలలో కనిపిస్తుంది. వెంకట్ ప్రభు కామెడీ చిత్రం గోవా (2010)లో రోషిణిగా, కె.వి.ఆనంద్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ కో (2011)లో సరోగా ఆమె తన నటనకు ప్రసిద్ధి చెందింది. కో తెలుగులోనూ రంగం అనే పేరుతో అనువాద చిత్రంగా విడుదలై విజయం సాధించింది.
ప్రారంభ జీవితం
[మార్చు]ఆమె ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఎటావాలో 1993 డిసెంబరు 22న జన్మించింది.[1] అక్కడే విద్యాభ్యాసం చేసిన ఆమె కంప్యూటర్ కోర్సులు చదివేందుకు ఢిల్లీకి మారింది.[2][3] ఆమె నిర్ణయాన్ని తల్లిదండ్రులు వ్యతిరేకించినప్పటికీ, ఆమె కంప్యూటర్ సైన్స్‌లో డిప్లొమా పూర్తిచేసింది. అక్కడ, ఆమె రిసెప్షనిస్ట్‌గా, ట్యూటర్‌గా పనిచేయడం ఆరంభించింది. అయితే, ఈ ఉద్యోగాలు ఆమెను అశాంతికి గురిచేసాయి. ఇక, ఆమె తన సొంత డబ్బుతో ముంబైకి మకాం మార్చి సీరియల్స్‌కు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ తిరిగి ప్రారంభించింది. ఆ తరువాత, ఆమె ప్రింట్ మీడియా యాడ్స్, వాణిజ్య ప్రకటనలు, మ్యూజిక్ వీడియోలలో మోడలింగ్ చేసింది.[4] ఆమె ప్రముఖ నటుడు, అమితాబ్ బచ్చన్, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీలతో కలిసి క్యాడ్‌బరీ(Cadbury) వాణిజ్య ప్రకటనలో నటించింది. ప్రముఖ సినీ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఒక వాణిజ్య ప్రకటనలో నటించిన ఆమెకు సినిమాల్లోకి ప్రవేశించడానికి అవకాశం వచ్చింది.[5]
కెరీర్
[మార్చు]పియా బాజ్‌పాయ్ వాణిజ్య ప్రకటనలో కనిపించిన తర్వాత, ప్రియదర్శన్ ఆమెకు తన తమిళ చిత్రంలో అవకాశాన్ని ఇచ్చాడు.[6] ఇది కామెడీ చిత్రం, పోయి సొల్ల పోరోమ్ (2008), ఎ. ఎల్. విజయ్ దర్శకత్వం వహించగా, కార్తీక్ కుమార్, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. విడుదలైన తర్వాత ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు, అనుకూలమైన సమీక్షలను గెలుచుకుంది.[7][8] ఆమె "బబ్లీ అండ్ ఛీరీ"గా వెలిగిపోయింది. ఆమె రాజు సుందరం ఏగన్‌లో కళాశాల విద్యార్థిగా నటించింది, ఈ చిత్రంలో ఆమె అజిత్ కుమార్, నయనతార, నవదీప్‌లతో కలిసి నటించింది. 2004 నాటి హిందీ చిత్రం మై హూ నా రీమేక్ ఇది.[9] 2009లో, ఆమె తక్కువ బడ్జెట్ తెలుగు చిత్రం, నిన్ను కలిశాకలో నటించింది.[10]
గోవా చిత్రం ఆమెకు పెద్ద బ్రేక్‌గా నిలిచింది. అందులో గోవా అమ్మాయి రోషిణి పాత్రను పోషించినందుకు ఆమె విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇందులోని ఆమె నటించిన పాట "ఇధు వరై" అవార్డు గెలుచుకుంది.[11][12] దర్శకుడు విజయ్ సహాయంతో, ఆమె సిద్ధార్థ్ చంద్రశేఖర్ కామెడీ బలే పాండియా (2010)లో విష్ణు విశాల్ తో కలిసి ప్రధాన పాత్రలో పోషించింది. ఇది, ఆమె ప్రధాన కథానాయికగా మొదటి అతిపెద్ద విజయం.[13]
ఆమె నటించిన మరో చిత్రం కె. వి. ఆనంద్ పొలిటికల్ థ్రిల్లర్ కో, ఇందులో ఆమె జీవా, కార్తికా నాయర్, అజ్మల్ అమీర్ లతో పాటు సరస్వతి అనే పాత్రికేయ పాత్ర పోషించింది.[14] ఈ చిత్రం వాణిజ్యపరమైన విజయంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మరీ ముఖ్యంగా, ఆమె నటనకు ప్రత్యేక ప్రశంసలు లభించాయి.[15] ఆమె మొదటి మలయాళ భాషా చిత్రం మాస్టర్స్ (2012) పృథ్వీరాజ్ సరసన నటించింది.[16] లక్ష్మీ రామకృష్ణన్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం నెరుంగి వా ముత్తమీదతేలో ఆమె కథానాయిక పాత్ర పోషించింది.[17]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | నోట్స్ | మూలాలు |
---|---|---|---|---|---|
2008 | పోయి సొల్ల పోరం | అమృత | తమిళం | తొలి తమిళ చిత్రం | |
ఏగన్ | పూజ | తమిళం | |||
2009 | నిన్ను కలిశాక | బిందు | తెలుగు | తొలి తెలుగు సినిమా | |
2010 | గోవా | రోషిణి | తమిళం | ||
బలే పాండియా | వైష్ణవి | తమిళం | |||
2011 | కో | సరస్వతి (సారో) | తమిళం | ఉత్తమ సహాయ నటిగా విజయ్ అవార్డు
- నామినేట్ చేయబడింది |
|
2012 | మాస్టర్స్ | దక్ష | మలయాళం | తొలి మలయాళ చిత్రం | |
సత్తమ్ ఓరు ఇరుత్తరై | జెస్సామిన్ | తమిళం | |||
2013 | బ్యాక్‌బెంచ్ స్టూడెంట్ | చైత్ర | తెలుగు | ||
దళం | శృతి | తెలుగు | |||
2014 | కూట్టం | శృతి | తమిళం | ||
నెఱుంగి వా ముత్తమీదతే | మాయ | తమిళం | |||
ఆమయుం ముయలుం | థమరా | మలయాళం | |||
ముంబై ఢిల్లీ ముంబై | పియా | హిందీ | |||
2015 | X: పాస్ట్ ఈజ్ ప్రజెంట్ | షిరీన్ | ఆంగ్ల | ||
2016 | లాల్ రంగ్ | పూనమ్ శర్మ | హిందీ | తొలి హిందీ చిత్రం | |
2016 | ది వర్జిన్స్ | అనికా | హిందీ | షార్ట్ ఫిల్మ్ | [18] |
2018 | మీర్జా జూలియట్ | జూలీ | హిందీ | ||
అభియుం అనువుం | అను | తమిళం | ద్విభాషా చిత్రం | ||
అభియుడే కదా అనువింటెయుం | మలయాళం | ||||
2023 | లాస్ట్ | అంకితా చౌహాన్ | హిందీ | [19] |
మూలాలు
[మార్చు]- ↑ Rawal, Sugandha (28 March 2022). "Pia Bajpiee: Whether a series is set in rural or urban areas, people are shown throwing abuses, having sex or drinking". Hindustan Times. Archived from the original on 29 March 2022. Retrieved 29 March 2022.
- ↑ "Meet the real Babli". DNA India. 2010-12-02. Retrieved 2012-03-27.
- ↑ "Piaa goes on a promotional tour". Sify. 2010-02-16. Archived from the original on 2014-10-10. Retrieved 2012-03-27.
- ↑ Sudhish Kamath (2010-05-06). "The Hindu : Arts / Cinema : Bale Piaa!". Beta.thehindu.com. Retrieved 2012-03-27.
- ↑ "Cinema Plus / Cinema : Kollywood Dreams". The Hindu. 2008-10-03. Archived from the original on 2008-10-06. Retrieved 2012-03-27.
- ↑ "Piaa - Tamil Movie Actress Interview - Goa | Eagan | Poi Solla Porom (remake of Hindi film "Khosla ka ghosla)". Videos.behindwoods.com. Archived from the original on 5 March 2011. Retrieved 2012-03-27.
- ↑ "Review: Poi Solla Porom". Rediff. 2008-09-12. Archived from the original on 15 November 2010. Retrieved 2012-03-27.
- ↑ "Movie Review:Review: Poi Solla Porom". Sify. Archived from the original on 2013-06-28. Retrieved 2012-03-27.
- ↑ "Movie Review:Aegan". Sify. Archived from the original on 2014-02-21. Retrieved 2012-03-27.
- ↑ "Ninnu Kalisaka film review - Telugu cinema Review - Santosh Samrat, Chaitanya Krishna, Dipa Shah, Piaa Bajpai". Idlebrain.com. 2009-10-02. Archived from the original on 20 August 2011. Retrieved 2012-03-27.
- ↑ "Meet Goa's bindaas heroine". Rediff. 2010-01-28. Archived from the original on 4 April 2011. Retrieved 2012-03-27.
- ↑ "Piaa's hard work pays off!". Sify. 2010-02-02. Archived from the original on 2017-08-30. Retrieved 2012-03-27.
- ↑ "Movie Review:Bale Pandiya". Sify. Archived from the original on 2013-06-28. Retrieved 2012-03-27.
- ↑ "Piaa Bajpai to take viewers by storm in 'Ko'". The New Indian Express. 2011-01-13. Archived from the original on 3 March 2014. Retrieved 2012-03-27.
- ↑ "Movie Review:Ko-Review". Sify. Archived from the original on 2013-11-14. Retrieved 2012-03-27.
- ↑ "Piaa Bajpai, actress". The New Indian Express. 2011-07-10. Archived from the original on 3 March 2014. Retrieved 2012-11-17.
- ↑ "Piaa Bajpai to star in Lakshmy Ramakrishnan's next Project". IANS. Biharprabha News. Archived from the original on 11 September 2014. Retrieved 5 February 2014.
- ↑ "The Virgins – short film". Archived from the original on 30 June 2016. Retrieved 25 July 2016.
- ↑ "'पिंक'के निर्देशक की अगली फ़िल्म में पिया". www.amarujala.com/. 15 July 2021. Archived from the original on 1 August 2021. Retrieved 1 August 2021.