దళం (2013 సినిమా)
దళం | |
---|---|
దర్శకత్వం | బి. జీవన్ రెడ్డి |
రచన | శంకర్ దేవరాజ్ |
స్క్రీన్ ప్లే | బి. జీవన్ |
కథ | బి. జీవన్ |
నిర్మాత | ఎం. సుమంత్ కుమార్ రెడ్డి |
తారాగణం | నవీన్ చంద్ర పియా బాజ్పాయ్ నాజర్ కిషోర్ అభిమన్యు సింగ్ |
కూర్పు | మధు |
సంగీతం | జేమ్స్ వసంతన్ |
నిర్మాణ సంస్థలు | ది మామోత్ మీడియా, ఎంటర్టైన్మెంట్ |
విడుదల తేదీ | 15 ఆగస్టు 2013 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
దళం 2013, ఆగస్టు 15న విడుదలైన తెలుగు చలనచిత్రం. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు బి. జీవన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవీన్ చంద్ర, పియా బాజ్పాయ్, నాజర్, అభిమన్యు సింగ్, కిషోర్ నటించగా జేమ్స్ వసంతన్ సంగీతం అందించాడు. ది మామోత్ మీడియా, ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎం. సుమంత్ కుమార్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించాడు. 2014, ఏప్రిల్ 4న కూట్టం పేరుతో తమిళంలో విడుదలైంది. జైలు నుండి విడుదలైవచ్చిన మాజీ నక్సలైట్ల బృందం కొత్తగా తమ జీవితాలను ప్రారంభించి పోలీసులు, రాజకీయ నాయకులపై వారు చేసిన పోరాట నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది.[1]
కథా సారాంశం
[మార్చు]నక్సలైట్లు ఉన్న ప్రాంతంలో చిత్రకథ ప్రారంభమవుతుంది. అక్కడ రాష్ట్ర పోలీసు, నక్సలైట్లకు మధ్య కాల్పుల పోరాటం జరుగుతోంది. ఆ పోరాటంలో చాలామంది నక్సలైట్లు చనిపోతారు. నక్సలైట్లు పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించుకొని ప్రభుత్వానికి లొంగిపోతారు. జైలులో ఉన్న సమయంలో వారు చాలా హింసకు గురవుతారు. అప్పుడు జైలు అధికారి వారిని మార్చి పోలీసు సానుభూతిపరులుగా మారడానికి, ఉద్యోగాలు రావడానికి సహాయం అందిస్తాడు.
నటవర్గం
[మార్చు]- నవీన్ చంద్ర (అభి)
- పియా బాజ్పాయ్ (శృతి)
- నాజర్ (జెకె)
- కిషోర్ (శత్రువు)
- అభిమన్యు సింగ్ (లడ్డా)
- కృష్ణుడు (భద్రం)
- ప్రగతి
- మహదేవన్
- అజయ్
- ధన్రాజ్
- హర్షవర్ధన్
- సాయికుమార్
- నథాలియా కౌర్
సాంకేతికవర్గం
[మార్చు]- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బి. జీవన్ రెడ్డి
- నిర్మాత: ఎం. సుమంత్ కుమార్ రెడ్డి
- రచన: శంకర్ దేవరాజ్
- సినిమాటోగ్రాఫర్ : సుధాకర్ రెడ్డి యక్కంటి
- సంగీతం: జేమ్స్ వసంతన్
- కూర్పు: మధు
- నిర్మాణ సంస్థ: ది మామోత్ మీడియా, ఎంటర్టైన్మెంట్
నిర్మాణం
[మార్చు]2012 ప్రారంభంలో పియా వాజ్పాయ్తో ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభమయింది. అప్పటికే నవీన్ చంద్రతో తమిళంలో చిత్రీకరించారు. ఈ చిత్రంలో నటులు కిషోర్, నాజర్, సాయికుమార్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. జేమ్స్ వసంతన్ సంగీతం అందించాడు. ప్రతి సన్నివేశాన్ని తమిళ, తెలుగు భాషల కోసం రెండుసార్లు చిత్రీకరించారు.[2]
పాటలు
[మార్చు]Untitled | |
---|---|
ఈ చిత్రానికి జేమ్స్ వసంతన్ సంగీతం అందించాడు.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ఎటెల్లినా అరణ్యమే (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | విజయ్ యేసుదాస్ | 3:09 |
2. | "తయ్యా తయ్యా (రచన: కృష్ణ చైతన్య)" | కృష్ణ చైతన్య | ధనుంజయ్, బెల్లీ రాజ్, రఘు, సోమసుందర్, ప్రసాద్ | 4:44 |
3. | "ఇక్కడి నుండి ఎక్కడి దాకా (రచన: అనంత శ్రీరామ్)" | అనంత శ్రీరామ్ | హరిచరణ్, శ్వేత మోహన్ | 5:26 |
4. | "అద్దిరబన్నా (రచన: సాహితి)" | సాహితి | ప్రియ సుబ్రహ్మణ్యం | 4:48 |
5. | "ఎక్ బార్ ఏసుకోరా తీన్ మార్ (రచన: కృష్ణ చైతన్య)" | కృష్ణ చైతన్య | ధనుంజయ్, సుందరన్, శ్రీనివాస్, పూజా | 4:24 |
మొత్తం నిడివి: | 22:31 |
విడుదల
[మార్చు]2013, ఆగస్టు 15లో విడుదలైన ఈ చిత్రం మిశ్రమ సమీక్షలు అందుకుంది. "సామాజిక అంశాల నేపథ్యంలో విడుదలైన ఈ చిత్రం మనలోని ఆలోచనలను కలిగిస్తుందని" పేర్కొనబడింది.[3]
మూలాలు
[మార్చు]- ↑ Times of India, Movie Review (15 August 2013). "Dalam Movie Review". Archived from the original on 27 March 2016. Retrieved 18 September 2020.
- ↑ "'Dalam is an intelligent film'". Rediff (in ఇంగ్లీష్). Retrieved 2020-09-18.
- ↑ Fully Hyderabad (2013-08-15). "Dalam Movie Review". Fully Hyderabad. Retrieved 2020-09-18.
{{cite web}}
: CS1 maint: url-status (link)
- CS1 maint: url-status
- క్లుప్త వివరణ ఉన్న articles
- 2013 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- Articles using infobox templates with no data rows
- Album articles lacking alt text for covers
- Pages using infobox album with empty type parameter
- Pages using infobox album with unknown parameters
- 2013 తెలుగు సినిమాలు
- నాజర్ నటించిన సినిమాలు
- సాయి కుమార్ నటించిన సినిమాలు