నథాలియా కౌర్
నథాలియా కౌర్ | |
---|---|
జననం | నథాలియా పిన్హీరో ఫెలిపే మార్టిన్స్ 1990 ఆగస్టు 15 రియో డి జనీరో, బ్రెజిల్ |
విద్యాసంస్థ | యూనివర్సిడేడ్ కాండిడో మెండిస్ (డ్రాప్ అవుట్) |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2012–ప్రస్తుతం |
నథాలియా పిన్హీరో ఫెలిపే మార్టిన్స్ (ఆంగ్లం: Nathalia Pinheiro Felipe Martins; జననం 1990 ఆగస్టు 15), వృత్తిపరంగా నథాలియా కౌర్ అని పిలుస్తారు, ఒక బ్రెజిలియన్ మోడల్, నటి, ఆమె భారతీయ సినిమాలలో నటిస్తుంది.[1] ఆమె టెలివిజన్ లో వివిధ కార్యక్రమాలలో కనిపించడంతో పాటు ఒపెరా సింగర్ కూడా.
ప్రారంభ జీవితం
[మార్చు]నథాలియా కౌర్ బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో నథాలియా పిన్హీరో ఫెలిపే మార్టిన్స్‌గా జన్మించింది. ఆమె తల్లి పోర్చుగీస్ చెందినది. కాగా, తండ్రి భారతీయ పంజాబీ.[2][3] ఆమె కుటుంబం నుండి గ్లామర్ పరిశ్రమలోకి ప్రవేశించిన మొదటి వ్యక్తి. ఆమె 14 సంవత్సరాల వయస్సులో మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టింది. అప్పటి నుండి ఆమె టెలివిజన్ రంగంలో అనేక వాణిజ్య ప్రకటనలతో పాటు పత్రికలలో ప్రకటనలు కూడా చేసింది.
కెరీర్
[మార్చు]నథాలియా కౌర్ బ్రెజిల్, ఇతర దేశాలలో మోడల్‌గా చేస్తూ భారతదేశం చేరుకుంది. అక్కడ ఆమె 2012లో కింగ్‌ఫిషర్ క్యాలెండర్ మోడల్ హంట్‌ను గెలుచుకుంది. ఆమె దేశవ్యాప్తంగా పాల్గొన్న 15 మంది మోడల్‌లను ఓడించి టైటిల్‌ను సాధించింది. ఆ సంవత్సరం కింగ్‌ఫిషర్ స్విమ్‌సూట్ క్యాలెండర్‌లో మెరిసింది.[4]
ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం దేవ్ సన్ ఆఫ్ ముద్దె గౌడ (2012)లో ఆమె తన సినీ రంగ ప్రవేశం చేసింది.[5] దాని విడుదలకు ముందు రామ్ గోపాల్ వర్మ హిందీ చిత్రం డిపార్ట్‌మెంట్‌లో ఐటెమ్ సాంగ్ చేసింది.[6][7] 2015లో, ఆమె కలర్స్ టీవీ స్టంట్ షో ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 6లో పాల్గొంది.[8] ఏడు వారాల పాటు కొనసాగిన ఆమె షో నుండి తొలగించబడిన ఐదవ పోటీదారు.[9]
మోడల్
[మార్చు]ఆమె మిస్ ముండో ఎస్పిరిటో శాంటో 2015, మిస్ బ్రెజిల్ వరల్డ్ 2015 (మిస్ ముండో బ్రెజిల్) పోటీలలో పాల్గొంది, అక్కడ ఆమె టాప్ 10లో నిలిచింది. ఆ తరువాత, ఆమె మిస్ రియో డి జనీరో బీ ఎమోషన్ 2015, మిస్ బ్రెజిల్ 2015లలో పాల్గొంది, అక్కడ ఆమె టాప్ 15లో నిలిచింది.
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | భాష | పాత్ర | నోట్స్ |
---|---|---|---|---|
2012 | దేవ్ సన్ ఆఫ్ ముద్దెగౌడ | కన్నడ | అరంగేట్రం; ఐటమ్ సాంగ్ | |
2012 | డిపార్ట్మెంట్ | హిందీ | డన్ డన్ చీనీ ఐటమ్ సాంగ్ [10] | |
2013 | కమాండో-ఎ వన్ మ్యాన్ ఆర్మీ | హిందీ | స్పెషల్ అప్పియరెన్స్[11] | |
2013 | దళం / కూట్టం | తెలుగు / తమిళం | స్పెషల్ అప్పియరెన్స్ | |
2013 | భాయ్ | తెలుగు | స్పెషల్ అప్పియరెన్స్ | |
2013 | పోటుగాడు | తెలుగు | ||
2016 | రాకీ హ్యాండ్సమ్ | హిందీ | అన్నా | |
2017 | జిస్మ్ 3 | హిందీ | [12] | |
2020 | గన్స్ ఆఫ్ బనారస్ | హిందీ | హేమ |
మూలాలు
[మార్చు]- ↑ "Only Indians worship their actors: Nathalia Kaur". The Times of India. 23 June 2012. Archived from the original on 23 February 2013. Retrieved 16 August 2012.
- ↑ "Only Indians worship their actors: Nathalia Kaur". The Times of India. 23 June 2012. Archived from the original on 23 February 2013. Retrieved 16 August 2012.
- ↑ "From Pinheiro to Kaur: Nathalia cashes in on the exotic". The Times of India. 23 June 2012. Retrieved 16 August 2012.
- ↑ "Nathalia Pinheiro crowned Kingfisher Calendar Girl 2012 : What's Hot News". India Today. 15 December 2011. Retrieved 28 March 2012.
- ↑ "Nathalia used me and I used her: Indrajit Lankesh". The Times of India. 8 March 2012. Archived from the original on 4 November 2013. Retrieved 28 March 2012.
- ↑ "Brazilian model Nathalia Kaur shakes her booty in RGV's 'Department' : EYECATCHERS News". India Today. 3 March 2012. Retrieved 28 March 2012.
- ↑ "From Pinheiro to Kaur: Nathalia cashes in on the exotic". The Times of India. Retrieved 28 March 2012.
- ↑ "WOW! Bollywood diva Nathalia Kaur to be the hottest contestant on Khatron Ke Khiladi?". Hindustan Times. Retrieved 19 November 2014.
- ↑ "Nathalia Kaur Out of Khatron Ke Khiladi". web.archive.org. 2024-03-24. Archived from the original on 2024-03-24. Retrieved 2024-03-24.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Nathalia Kaur: Ram Gopal Verma's new item girl — Movies News — HitList — ibnlive". Ibnlive.in.com. Archived from the original on 9 July 2012. Retrieved 28 March 2012.
- ↑ "Subhash K Jha speaks about Commando". Bollywood Hungama. Archived from the original on 24 April 2013. Retrieved 16 April 2013.
- ↑ మూస:ওয়েব উদ্ধৃতি