శ్వేత మోహన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్వేత మోహన్
Shweta Mohan.jpg
శ్వేత మోహన్
జననం
చెన్నై, తమిళనాడు, భారతదేశం
వృత్తినేపధ్య గాయకురాలు
క్రియాశీల సంవత్సరాలు2005 – ప్రస్తుతం
జీవిత భాగస్వామిఅశ్విన్ (2011–ప్రస్తుతం)
పిల్లలుశ్రేష్ఠ [1]
తల్లిదండ్రులుకృష్ణమోహన్ n
సుజాతా మోహన్ (గాయకురాలు)
వెబ్‌సైటుshwetamohan.com

శ్వేతా మోహన్ భారతీయ నేపధ్య గాయని. ఆమె ఉత్తమ మహిళా నేపధ్య గాయనిగా నాలుగు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు అందుకుంది. అందులో ఒకటి కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం కాగా మరొకటి తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారం. ఆమె హిందీ భాషతో పాటు దక్షిణ భారత భాషలైన మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ సినిమాలలో చలనచిత్ర సంగీతం, ఆల్బమ్‌ల కోసం పాటలను రికార్డ్ చేసింది. ఆమె దక్షిణ భారత సినిమా రంగంలో గుర్తింపు పొందిన నేపధ్య గాయకురాలిగా స్థిరపడింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

శ్వేతా మోహన్ చెన్నైలోని ఒక మలయాళ కుటుంబానికి చెందిన కృష్ణమోహన్, సుజాత మోహన్ దంపతులకు జన్మించింది.   ఆమె తల్లి సుజాత  సినీ నేపధ్యగాయిని,  సంప్రదాయ సంగీత గాయిని. ఆమె చెన్నైలోని గుడ్ షెపర్డ్ కాన్వెంత్ లొ విద్యాభ్యాసం చేసింది. చెన్నైలోని స్టెల్లా మేరీస్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ చేసింది. [2] ఆమె తన స్నేహితుడు అయిన అశ్విన్ శశిని 2011 జనవరి 16న వివాహం చేసుకుంది. [3] వారికి శ్రేష్ఠ అనే కుమార్తె 2017 డిసెంబరు 1న జన్మించింది.[1][4]

వృత్తి జీవితం[మార్చు]

ఆమె భారతదేశ సినిమా సంగీత దర్శకులైన ఇళయరాజా, ఎ. ఆర్. రెహమాన్, విద్యాసాగర్ , ఎం. ఎం. కీరవాణి, ఎం.జయచంద్రన్, జాన్సన్, మణిశర్మ, కన్నన్, ఎన్.ఆర్.రఘునందన్, మణికాంత్ కద్రి, దేవి శ్రీ ప్రసాద్, అనిరుధ్ రవిచంద్ర ల దర్శకత్వంలో పాటలు పాడింది. ఆమె శ్రీమతి బిన్ని క్రిష్ణకుమార్ వద్ద కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించింది.[5]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Singer Shweta Mohan blessed with a baby n girl named Sreshta Archived 2018-05-21 at the Wayback Machine. English.mathrubhumi.com (1 December 2017). Retrieved on 2019-08-25.
  2. [https://www.newindianexpress.com/cities/kochi/2012/jun/25/a-timeless-melody-380408.html A timeless melody ].
  3. A Timeless Melody, The New Indian Express (25 June 2012). Retrieved on 25 August 2019.
  4. A Timeless Melody, The New Indian Express
  5. "And Quiet Flows The Karamana: Two of a kind". The Hindu. 5 October 2012.

బాహ్య లంకెలు[మార్చు]