ఒక మనసు
ఒక మనసు | |
---|---|
దర్శకత్వం | గొట్టిముక్కల వెంకట రామరాజు |
రచన | గొట్టిముక్కల వెంకట రామరాజు |
స్క్రీన్ ప్లే | గొట్టిముక్కల వెంకట రామరాజు |
కథ | గొట్టిముక్కల వెంకట రామరాజు |
నిర్మాత | మధుర శ్రీధర్ రెడ్డి డా.కృష్ణ భట్ట, ఎ.అభినయ్ |
తారాగణం | నాగ సౌర్య నీహారిక కొణిదెల |
సంగీతం | సునీల్ కష్యప్ |
నిర్మాణ సంస్థలు | మధుర ఎంటర్‌టైన్‌మెంట్ టీవీ9 & కె.కె.ఎన్.కె.టి.వి |
విడుదల తేదీ | 24 జూన్ 2016 |
దేశం | భారతదేశము |
భాష | తెలుగు |
ఒక మనసు గొట్టిముక్కల వెంకట రామరాజు రచన, దర్శకత్వంలో 2016లో విడుదలైన తెలుగు సినిమా.[1] నాగసౌర్య, నీహారిక కొణిదెల ముఖ్య తారాగణంగా విడుదలైన ఈ సినిమాలో నీహారిక సినీరంగంలో మొదటిసారి ప్రవేశం చేసింది.[2][3][4] ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2016 జూన్ 24న విడుదలైంది.[5]
కథ
[మార్చు]సూర్య (నాగశౌర్య) రాజకీయ నాయకుడు కావాలన్న ఆశతో విజయనగరంలో సెటిల్‌మెంట్స్ చేస్తూ తిరిగే అబ్బాయి. సూర్య మామయ్య ఎమ్మెల్యే కావటంతో ఏ రోజుకైనా సూర్యను కూడా ఎమ్మెల్యేగా గెలిపించాలని కలకంటుంటాడు సూర్య తండ్రి (రావు రమేష్). విజయనగరం ప్రభుత్వాస్పత్రిలో హౌస్ సర్జన్‌గా చేస్తున్న సంధ్య (నీహారిక), సూర్యని తొలి చూపులోనే ఇష్టపడుతుంది. తరువాత ఆ ఇద్దరి పరిచయం ప్రేమగా మారుతుంది. అదే సమయంలో తన రాజకీయ అవసరాల కోసం ఓ పెద్ద సెటిల్‌మెంట్ ఒప్పుకున్న నాగశౌర్య చిక్కుల్లో పడతాడు. నమ్మకద్రోహం కారణంగా కోర్టు కేసులో ఇరుక్కుని మూడేళ్లపాటు జైలులో ఉంటాడు. ఆ తరువాత బెయిల్ వచ్చినా కేసు మాత్రం వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మరోసారి సంధ్యకు దగ్గరవుతాడు సూర్య. కానీ తన తండ్రి కలను నెరవేర్చటం కోసం ఈ సారి సంధ్యకు శాశ్వతంగా దూరం కావలసిన పరిస్థితి వస్తుంది. మరి సూర్య నిజంగానే సంధ్యను దూరం చేసుకున్నాడా.? సూర్య వదిలి వెళ్లిపోవటానికి సంధ్య అంగీకరించిందా..? అన్నదే మిగతా కథ.[6][7]
తారాగణం
[మార్చు]- నాగ సౌర్య - సూర్య
- నీహారిక కొణిదెల - సంధ్య
- రావు రమేశ్ - సూర్య తండ్రి
- కృష్ణ భగవాన్
- రేడియో మిర్చి ఆర్.జె.హేమంత్
- అవసరాల శ్రీనివాస్
- వెన్నెల కిశోర్
- ప్రగతి (నటి)
- రోషణ్ కనకాల [8]
సౌండ్‌ట్రాక్
[మార్చు]ఈ సినిమా ఆడియోలో తొమ్మిది ట్రాక్స్ ఉన్నాయి. వీటిని సునీల్ కశ్యప్ కంపోజ్ చేసారు. ఈ సినిమా పాటలను రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల రవికుమార్ రచించారు. ఈ సినిమా సంగీతం 2016 మే 8 న ప్రారంభమైనది. ఈ వేడుక మెగా కుటుంబం నుండి నాగేంద్రబాబు, రామచరణ్, వరుణ్ తేజ్, సాయిధరం తేజ్, అల్లు అర్జున్ వంటి అతిధుల సమక్షంలో జరిగింది.[9]
ఈ ఆల్బం ప్రేక్షకుల నుండి మంచి స్పందనలను అందుకుంది.[10]
క్రమసంఖ్య | పేరు | గీత రచన | గాయకులు | నిడివి | |||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "ఓ మనసా (Male)" | రామజోగయ్య శాస్త్రి | యాజిన్ నాజర్, | 04:54 | |||||
2. | "హృదయమా" | రామజోగయ్య శాస్త్రి | విజయ్ యేసుదాస్, స్వేతా మోహన్ | 04:04 | |||||
3. | "నిన్న లేనంత" | భాస్కరభట్ల రవికుమార్ | వెదల హేమచంద్ర, రమ్య బెహరా | 03:34 | |||||
4. | "చిరుగాలి ఆగిపోవే" | రామజోగయ్య శాస్త్రి | వెదల హేమచంద్ర, సమీరా భరద్వాజ్ | 04:09 | |||||
5. | "ఓ మనసా (Female)" | రామజోగయ్య శాస్త్రి | శ్రేయ ఘోషల్ | 04:54 | |||||
6. | "ఏమిటో ఈ క్షణం" | భాస్కరభట్ల రవికుమార్ | వెదల హేమచంద్ర, ప్రణవి | 04:58 | |||||
7. | "నీ మనసున" | రామజోగయ్య శాస్త్రి | విజయ్ ప్రాకాష్ | 04:19 | |||||
8. | "అమృత వర్షిణి (Instrumental)" | 02:56 | |||||||
9. | "ఓ మనసా (Instrumental)" | 03:43 | |||||||
37:31 |
మూలాలు
[మార్చు]- ↑ "Straight from the heart:'Oka Manasu' director Rama Raju"
- ↑ "Meet ‘Mega Princess’ Niharika Konidela"
- ↑ "Nagababu’s daughter Niharika’s debut film is ready"
- ↑ "Waiting for Niharika"
- ↑ "'Oka Manasu' clears censor board; Madhura Sreedhar reveals release date of Naga Shourya-Niharika-starrer"
- ↑ 'ఒక మనసు' మూవీ రివ్యూ : June 24, 2016
- ↑ "Oka Manasu Review". Retrieved 4 July 2016.
- ↑ http://www.idlebrain.com/movie/archive/okamanasu.html
- ↑ "Ram Charan attends Oka Manasu audio"
- ↑ http://www.indiaglitz.com/oka-manasu-telugu-music-review-20656.html