Jump to content

గొట్టిముక్కల వెంకట రామరాజు

వికీపీడియా నుండి
గొట్టిముక్కల వెంకట రామరాజు
జి.వి.రామరాజు
వృత్తిసినిమా దర్శకుడు, రచయిత

గొట్టిముక్కల వెంకట రామరాజు తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన భీమవరం పట్టణానికి చెందినవాడు.[1] రామరాజు తన జీవితంలో అనేక వృత్తులను చేపట్టారు చివరికి సినిమా పరిశ్రమలో స్థిరపడ్డాడు. ఆయమ మొదటి సినిమా మల్లెలతీరంలో సిరిమల్లెపువ్వు. ఆ సినిమాలో క్రాంతి, శ్రీదివ్య నటించి ప్రముఖ దర్శకులైన శేఖర్ కమ్ముల, వి.వి.వినాయక్, హరీష్ శంకర్ ల నుండి విమర్శనాత్మక ప్రశంసలు అందుకున్నారు.[2] ఆయన రెండవ చిత్రం ఒక మనసు శృంగార నాటక చిత్రం. అందులో నీహారిక కొణిదెల, నాగ సౌర్య నటించారు. ఇది జూన్ 2016లో విడుదలైంది.[3]

వృత్తి

[మార్చు]

ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పిదప సివిల్ సర్వీసు పరీక్షలకు కొరకు ప్రిపేర్ అయి ఇంటర్వ్యూకి కూడా హాజరైనారు. డా. ఎస్.రావు గారు ఆయనకు అధికారస్వామ్య పరిపాలన నిర్వహించలేరని కనుక యితర రంగాలను వెదుక్కోవలసినదిగా సలహానిచ్చారు. సినిమా దర్శకుడైన రాం గోపాల్ వర్మ ఆయనకు బంధువు అయినందున ఆయన రాంగోపాల్ వర్మ వద్ద దర్శక విభాగంలో చేరాడు. ఆయన దెయ్యం సినిమా కోసం పనిచేసాడు. రాంగగోపాల్ వర్మ సలహా మేరకు ఆయన క్రియేటివ్ స్క్రిప్ట్ రచనలపై దృష్టి సారించాడు. తరువాత ఆయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఒరాకిల్ డాటా బేస్ పై కొంతకాలం పాటు పనిచేసాడు. తరువాత ఆయన సినిమా రంగంలోనికి తిరిగి ప్రవేశించి ఈశ్వర్ నివాస్ చిత్ర బృందంలో చేరాడు. ఆ చిత్రంలో పనిచేస్తున్నప్పుడు ఆయన అనురాగ్ కశ్యప్ తో పరిచయమయ్యాడు. తరువాత అనురాగ్ కశ్యప్ యొక్క బ్లాక్ ప్రైడే, పంచ్ చిత్రాలకు పనిచేశాడు. బాలీవుడ్ రంగంలో అనుభవంతో హైదరాబాదు వచ్చి స్వంత ఆలోచనలు ప్రారంభించారు. అనుగాగ్ కశ్యప్ ప్రేరణతో ఆయన మల్లెల తీరంలో సిరెమల్లె పువ్వు చిత్రాన్ని తీసారు.[4][5]

చిత్రాలు

[మార్చు]
సంవత్సరం చిత్రం దర్శకుడు రచయిత స్క్రీన్ ప్లే ఇతరములు సంగీతం
2013 మల్లెలతీరంలో సిరిమల్లెపువ్వు Yes Yes Yes రవీంద్ర ప్రసాద్
2016 ఒక మనసు Yes Yes Yes సునీల్ కశ్యప్

మూలాలు

[మార్చు]
  1. "Ramaraju". idlebrain.com. 2016-07-04. Archived from the original on 2016-07-10. Retrieved 2016-07-09.
  2. "Sekhar Kammula Talks about Mallela Teeramlo Sirimalle Puvvu Telugu Movie". 2016-07-04.
  3. "Making Oka Manasu was like a spiritual journey: Ramaraju". 2016-07-04.
  4. "Ramaraju Bio Facebook". 2016-07-04.
  5. "Ramaraju". idlebrain.com. 2016-07-04. Archived from the original on 2016-07-10. Retrieved 2016-07-09.

ఇతర లింకులు

[మార్చు]