అవసరాల శ్రీనివాస్

వికీపీడియా నుండి
(శ్రీనివాస్ అవసరాల నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అవసరాల శ్రీనివాస్
జననం
ఇతర పేర్లుశ్రీ, శ్రీని, లంబూ
వృత్తినటుడు, రచయిత, దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు2007-ప్రస్తుతం
తల్లిదండ్రులువెంకట సత్యనారాయణ మూర్తి, నాగమణి

అవసరాల శ్రీనివాస్ భారతీయ నటుడు, దర్శకుడు, సినిమా స్క్రిప్ట్ రచయిత. హైదరాబాద్లో పుట్టి పెరిగిన శ్రీనివాస్ కొద్ది రోజులు విజయవాడ, కొత్త ఢిల్లీ, చెన్నై, కోల్కతాలలో నివసించారు. శ్రీనివాస్ మెకానికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ చేసారు. ఫైనైట్ ఎలిమెంట్ ఎనాలసిస్ విషయంలో ప్రిన్స్‍టన్ ప్లాస్మా ఫిజిక్స్ లేబొరేటరీలో పనిచేసారు.[1] యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజలెస్ (UCLA) నుండి స్క్రీన్ రైటింగ్ లో డిప్లోమా పొందారు. లీస్ట్రాస్ బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, న్యూయార్క్ వద్ద సంవత్సరం పాటు నటనలో శిక్షణ పొందారు. న్యూయార్క్ లో కొన్ని రోజులు రంగస్థలంలో పనిచేసి, ఆపై బ్లైండ్ ఆంబిషన్ అనే చిత్రానికి సహదర్శకుడిగా పనిచేసారు. యూనివర్సల్ స్టూడియోస్ వద్ద స్క్రిప్ట్ స్క్రీనర్ గా పనిచేసారు. అష్టా-చమ్మా ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యారు. ఈ చిత్రంలో కొని సన్నివేశాలను వ్రాయటంలో సహాయమందించారు.[2] ముగ్గురు, పిల్ల జమీందార్, వర ప్రసాద్ పొట్టి ప్రసాద్ లాంటి సినిమాలల్ పనిచేసారు. ఊహలు గుసగుసలాడే అనే ప్రేమ-హాస్య కథా చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నాగశౌర్య కథానాయకుడిగా నటించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.[3]

2022 డిసెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో విడుదలవుతున్న అవతార్ 2(అవతార్: ది వే ఆఫ్ వాటర్) సినిమాకు తెలుగు మాటలు అవసరాల శ్రీనివాస్ అందించారు.[4]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

అవసరాల శ్రీనివాస్ స్వస్థలం కాకినాడ. హైదరాబాదులో పెరిగాడు. తండ్రి బ్యాంకర్.[5] విజయవాడ, విశాఖపట్నం, ఢిల్లీ, చెన్నై, కోల్ కతలో కూడా కొద్ది రోజులున్నాడు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. కొద్ది రోజుల పాటు ప్రిన్స్ టన్ విశ్వవిద్యాలయంలో పనిచేశాడు. స్క్రీన్ రైటింగ్, సినిమా సంబంధిత కోర్సులు కొన్ని పూర్తి చేశాడు.[6]

సినిమారంగం

[మార్చు]

2008 లో విడుదలైన అష్టా చమ్మా సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు. ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద చిత్రాలకు దర్శకత్వం వహించాడు.[7]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2007 బ్లైండ్ ఆంబిషన్ సహదర్శకత్వం
2008 అష్టా-చమ్మా ఆనంద్
2010 ఆరెంజ్ అజయ్
సరదాగ కాసేపు శ్రీనివాస్
2011 వరప్రసాద్ అండ్ పొట్టిప్రసాద్ వర ప్రసాద్
ముగ్గురు అంజి
పిల్ల జమీందార్ కన్న బాబు
2013 అమృతం చందమామలో అమృత రావు
అడ్డా[8] కిషోర్
అంతకు ముందు... ఆ తరువాత... విశ్వ
అరవింద్ 2 చిత్ర దర్శకుడు
సుకుమారుడు ఏఎన్ఆర్
చమ్మక్ చల్లో కిషోర్
2014 గోవిందుడు అందరివాడేలే డాక్టర్ ఎన్. రాజు
ఊహలు గుసగుసలాడే ఉదయ్ భాస్కర్ రచయిత, దర్శకుడు కూడా
2015 జిల్ అజయ్
ఎవడే సుబ్రహ్మణ్యం ప్రభాకర్
బందిపోటు చీకటి
కంచె దాస్
2016 నాన్నకు ప్రేమతో అభిరామ్ సోదరుడు
రాజా చెయ్యి వేస్తే చక్రి
అ ఆ శేఖర్ బెనర్జీ
జెంటిల్ మేన్ వంశీ
ఒక మనసు సత్య
2017 బాబు బాగా బిజీ మాధవ్ / మ్యాడీ
అమీ తుమీ విజయ్
మేడ మీద అబ్బాయి సీబీసీఐడీ అధికారి నరేష్
పిఎస్‌వి గరుడ వేగ ప్రకాష్
ఒక్క క్షణం శ్రీనివాస్
2018 అ! శివుడు
మహానటి ఎల్వీ ప్రసాద్ అతిధి పాత్ర
సమ్మోహనం అతనే ప్రత్యేక ప్రదర్శన
దేవదాస్[9] రాజన్
అంతరిక్షం మోహన్
2019 ఎన్టీఆర్: కథానాయకుడు డివి నరస రాజు అతిధి పాత్ర
కథనం
ఊరంతా అనుకుంటున్నారు శివ రామన్ అయ్యర్
2020 నిశ్శబ్దం పూర్ణ చంద్రరావు
2021 నూటొక్క జిల్లాల అందగాడు గొట్టి సూర్య నారాయణ రచయిత కూడా
2022 ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి డాక్టర్ వరుణ్
2023 పిండం
2014 కిస్మత్ వివేక్
శ్రీ‌రంగ‌నీతులు

దర్శకుడు \ రచయితగా

[మార్చు]
సంవత్సరం సినిమా దర్శకుడు రచయిత గమనికలు
2011 గోల్కొండ హైస్కూల్ కాదు సంభాషణ
2014 ఊహలు గుసగుసలాడే అవును అవును
2016 జ్యో అచ్యుతానంద అవును అవును
2021 నూటొక్క జిల్లాల అందగాడు కాదు అవును [10]
2022 బ్రహ్మాస్త్రం కాదు సంభాషణ తెలుగు డబ్బింగ్ వెర్షన్[11]
2022 అవతార్: ది వే ఆఫ్ వాటర్ కాదు సంభాషణ తెలుగు డబ్బింగ్ వెర్షన్[12]
2023 ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అవును అవును [13]

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర నెట్‌వర్క్ గమనికలు
2019 శ్రీమతి సుబ్బలక్ష్మి సుబ్రహ్మణ్యం జీ5 [14][15]
2021 పిట్ట కథలు హర్ష నెట్‌ఫ్లిక్స్ పింకీ సెగ్మెంట్
అన్‌హెర్డ్ అన్వర్ డిస్నీ+ హాట్‌స్టార్ [16]

పురస్కారాలు

[మార్చు]

సైమా అవార్డులు

మూలాలు

[మార్చు]
  1. "rediff.com: ఫ్రం ప్రిన్స్టన్ టు అష్టాచెమ్మా". Specials.rediff.com. Retrieved 2013-12-12.
  2. "rediff.com: ఫ్రం ప్రిన్స్టన్ టు అష్టాచెమ్మా". Specials.rediff.com. Retrieved 2013-12-12.
  3. TNN (2013-09-12). "శ్రీనివాస్ అవసరాల టర్న్స్ డైరెక్టర్ -- టైంస్ ఆఫ్ ఇండియా". Articles.timesofindia.indiatimes.com. Archived from the original on 2013-12-04. Retrieved 2013-12-12.
  4. "Avatar 2: 'అవతార్‌2'కు డైలాగ్‌ రైటర్‌గా అవసరాల శ్రీనివాస్‌". web.archive.org. 2022-12-14. Archived from the original on 2022-12-14. Retrieved 2022-12-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "24 గంటలూ సినిమా గురించిన ధ్యాసే". 7 April 2019. Archived from the original on 8 April 2019.
  6. "Srinivas Avasarala interview". Idlebrain.com. Idlebrain. 11 September 2008.
  7. "మరో ఇంట్రస్టింగ్‌ టైటిల్‌తో అవసరాల". 14 March 2019. Archived from the original on 8 April 2019. Retrieved 8 April 2019.
  8. "jeevi review for Adda". idlebrain.com. Retrieved 16 July 2019.
  9. సాక్షి, సినిమా (27 September 2018). "'దేవదాస్‌' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 29 March 2020. Retrieved 2 April 2020.
  10. "Nootokka Jillala Andagaadu to be out on May 7". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 2021-04-07.
  11. "Brahmastra Telugu Movie Trailer Out Now". Telugu Filmnagar. 15 June 2022. Archived from the original on 19 నవంబర్ 2023. Retrieved 19 నవంబర్ 2023. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (help)
  12. "Avatar 2 Telugu Dialogues by Srinivas". India Herald (in ఇంగ్లీష్). 2022-12-15.
  13. "Naga Shaurya - Srinivas Avasarala film". The Times of India (in ఇంగ్లీష్). 2020-10-28. Retrieved 2021-01-13.
  14. "Mrs Subbalakshmi review: Lakshmi Manchu's web-series turns a progressive idea into an insipid drama". Firstpost. 2019-03-14. Retrieved 2021-06-01.
  15. "Lakshmi Manchu's 'Mrs Subbalakshmi' to release on March 8". The News Minute (in ఇంగ్లీష్). 2019-02-24. Retrieved 2021-06-01.
  16. "Disney Plus Hotstar's Telugu series Unheard gets release date". The Indian Express. 6 September 2021.

బయటి లంకెలు

[మార్చు]