Jump to content

తోకలేని పిట్ట

వికీపీడియా నుండి
తోకలేని పిట్ట
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం ధర్మవరపు సుబ్రహ్మణ్యం
భాష తెలుగు
ధర్మవరపు సుభ్రమణ్యం

నేపధ్యము

[మార్చు]

కామెడీలో టైమింగ్‌ .. సొంతంగా రైటింగ్‌.. టాలెంట్‌ ఉన్న ఆర్టిస్టు కీర్తిశేషులు ధర్మవరపు సుబ్రమణ్యం. జంధ్యాల సినిమాలతో వెండితెరపై వెలుగొంది.. ఆనందోబ్రహ్మ ద్వారా తెలుగు వాళ్లకు దగ్గరైన ధర్మవరపు స్వతహాగా రచయిత ఇండస్ట్రీలో ఒక స్థాయికి వచ్చాకా.. ఆయనకు దర్శకత్వం మీద మక్కువ మొదలైంది. ఆ మక్కువను తీర్చేసుకున్నాడు కూడా. అలా ధర్మవరపు ముచ్చటగా తీసుకున్న సినిమా తోకలేని పిట్ట 90వ దశకం చివర్లో వచ్చిన సినిమా అది. కమర్షియల్‌గా వర్కవుట్‌ కాలేదు కానీ.. ఇప్పటికీ టీవీల్లో వస్తే ఈ సినిమాను మిస్సవ్వడం కొంచెం కష్టమే!

సరదా సరదాగా సాగిపోయే ఈ సినిమా సీనియర్‌ యాక్టర్‌ నరేష్‌ హీరోగా నటించాడు. ఈ సినిమాకు కమర్షియల్‌గా వర్కవుట్‌ కాకపోవడంతో ధర్మవరపు మళ్లీ దర్శకత్వ యత్నాలేవీ చేయలేదు. పూర్తి స్థాయిలో ఆయన నటుడిగానే స్థిరపడిపోయింది 'తోకలేని పిట్ల డెలివరీలో ఫెయిలవ్వడంతోనే! విశేషం ఏమిటంటే... ఈ సబ్జెక్టును చేతబట్టుకుని తిరుగుతున్న దశలో ధర్మవరపు ఆర్జీవీని మీట్‌ అయ్యారట.

అప్పటికే వేరే వాళ్ల దర్శకత్వంలో వర్మ సినిమాలు తీయడం మొదలై చాలా కాలమైంది. శివనాగేశ్వరరావు, కృష్ణవంశీ, వంశీ వంటి వాళ్ల దర్శకత్వంలో వర్మ మూవీలు ప్రొడ్యూస్‌ చేశాడు. వంశీ దర్శకత్వంలో వైఫ్‌ ఆఫ్‌ వీ వరప్రసాద్‌ అనే కామెడీ పీస్‌ను వర్మ ప్రొడ్యూస్‌ చేశాడు. అయితే.. అది వర్కవుట్‌ కాలేదు. దాని సంగతలా ఉంటే... తన దగ్గర ఉన్న సబ్జెక్టుకు నటీనటులను కూడా ఎంపిక చేసేసుకుని ధర్మవరపు వర్మను సంప్రదించాడు. అయితే వర్మ ఒక కండీషన్‌ పెట్టాడని ధర్మవరపు ఒకసారి చెప్పాడు.

సినిమాలో జె. డి. చక్రవర్తిని హీరోగా పెడతామనేది వర్మ ప్రతిపాదన. నరేష్‌ వద్దు.. జేడీని హీరోగా పెడితే తను సినిమాను ప్రొడ్యూస్‌ చేస్తానని వర్మ చెప్పాడు. కానీ అప్పటికే కమిటయినందు వల్ల ధర్మవరపు వర్మషరతుకు ఒప్పుకోలేకపోయాడు. ఆ విధంగా సినిమా వర్మ క్యాంపును దాటి వెళ్లిపోయింది. నరేష్‌ హీరోగా రూపొందింది. సినిమా డిస్ట్రి బ్యూషన్‌ రైట్స్‌ విషయంలో కూడా ఇలాంటిదే ఒకటి జరిగింది.

సినిమా రైట్స్‌ను తనకు అప్పగించి ఉంటే.. తనే విడుదల చేసేవాడినని డి.రామానాయుడు సినిమా విడుదల అయ్యాకా చెప్పారట! సినిమాను సరిగా విడుదల చేసుకోకపోవడం కూడా దాని ఫెయిల్యూర్‌కు ఒక రీజన్‌ అని నమ్మే ధర్మవరపు.. దాన్ని రామానాయుడికి అప్పగించి ఉంటే.. బొమ్మ కచ్చితంగా నిలబడేదనే ఫీలింగ్‌ నే వ్యక్త పరిచాడు. ఏదైతేనేం.. ధర్మవరపు దర్శకత్వ ప్రతిభను ఆవిష్కరించిన తోకలేని పిట్ట ఇద్దరు బడా ప్రొడ్యూసర్ల చేతులను దాటి సరిగా పోస్టు కాలేకపోయింది[1].

తారాగణం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "జేడీ కోసం ఆర్జీవీ పెట్టిన షరతు అది!". greatandhra.com. 2015-10-01. Retrieved 2015-11-01.

బయటి లంకలు

[మార్చు]