గౌతమ్ ఎస్.ఎస్.సి.

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గౌతమ్ ఎస్.ఎస్.సి.
(2005 తెలుగు సినిమా)
Gowtam SSC poster.jpg
దర్శకత్వం అరుణ్ ప్రసాద్
నిర్మాణం వై. సోనియా రెడ్డి
తారాగణం నవదీప్, సింధు తులానీ
సంగీతం అనూప్
సంభాషణలు రమేష్ - గోపి
ఛాయాగ్రహణం జె. శివకుమార్
నిర్మాణ సంస్థ విసు ఫిల్మ్ ఇంటర్నేషనల్
విడుదల తేదీ 2005 డిసెంబరు 30 (2005-12-30)
భాష తెలుగు
పెట్టుబడి 35 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

గౌతం ఎస్. ఎస్. సి 2005 లో అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో నవదీప్, సింధు తులానీ ముఖ్యపాత్రల్లో నటించారు. 2005 లో ఈ సినిమా ఉత్తమ చిత్రంగా తామ్ర నంది పురస్కారం అందుకుంది.[1]

కథ[మార్చు]

శంభుప్రసాద్ ఒక ఐ. ఎ. ఎస్. ఆఫీసరు. ఆయన కుటుంబంలో అందరూ ఉన్నత చదువులు చదివిన వారే. కానీ ఆఖరి కొడుకు గౌతమ్ మాత్రం చదువులో అంతగా రాణించడు. ఎప్పుడూ స్నేహితులతో కలిసి తిరుగుతూ కుటుంబ సభ్యుల దగ్గర చీవాట్లు తింటుంటాడు. ఒకసారి తండ్రి పి. ఎ. మాయమాటలు విని తన తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేస్తాడు. దాంతో తండ్రి అతన్ని ఇంటి నుంచి తరిమేస్తాడు. అప్పుడు గౌతం ఇంట్లో పిల్లలకు ట్యూషన్ పాఠాలు చెప్పడానికి వచ్చే జానకి అనే అమ్మాయి ఇతనికి ఆశ్రయం ఇస్తుంది. తనకి మెకానిక్ పని అంటే ఇష్టం ఉండటంతో ఓ షెడ్ ను అద్దెకు తీసుకుని నడుపుతుంటాడు. తన తెలివి తేటలతో అత్యధిక మైలేజీ నిచ్చే ఒక కార్బొరేటర్ ను తయారు చేస్తాడు. దాని ఫార్ములాను సొంతం చేసుకోవడానికి అనేక మోటారు వాహనాల సంస్థలు పోటీలు పడతాయి. కానీ తన అన్న కోసం దాన్ని ఉచితంగా ఇచ్చేస్తాడు.

గౌతం చెల్లెలు ఓ క్రికెటర్ ను ప్రేమించి ఉంటుంది. కానీ ఈ విషయం తెలుసుకున్న శంభుప్రసాద్ అతని కొడుకు కలిసి అతని మీద దాడి చేయిస్తారు. కానీ అతను కొద్ది రోజులకు జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికవుతాడు. అప్పుడు శంభుప్రసాద్ వాళ్ళ దగ్గరకు సంబంధం కలుపుకోవడానికి వెళితే వాళ్ళు తిరస్కరిస్తారు. ఇది తెలుసుకున్న గౌతం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నచ్చజెప్పి పెళ్ళికి ఒప్పిస్తాడు. ఈ లోపు డాక్టరుగా పనిచేస్తున్న తన పెద్దన్నయ్య ఓ కుట్ర కేసులో ఇరుక్కుంటాడు.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

  • అనగనగనగా ఒక రాజు

మూలాలు[మార్చు]

  1. "Nandi awards for 2005 announced". thehindu.com. ది హిందు. Retrieved 21 February 2018.