రమేశ్ చెప్పాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రమేశ్ చెప్పాల
జననం1976, మార్చి 16
వృత్తిసినిమా దర్శకుడు
స్క్రీన్ ప్లే రచయిత
క్రియాశీల సంవత్సరాలు2001 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిస్వరూప
పిల్లలుతరుణ్, జాహ్నవి
తల్లిదండ్రులు
 • ఆగయ్య (తండ్రి)
 • లక్ష్మీ (తల్లి)

రమేశ్ చెప్పాల తెలంగాణకు చెందిన తెలుగు సినిమా దర్శకుడు, రచయిత. కథ, పుస్తక రచయితగా గుర్తింపు పొందిన రమేశ్ 2018లో ‘బేవర్స్’ సినిమా, 2023లో ‘భీమదేవరపల్లి బ్రాంచి’ సినిమాలకు దర్శకత్వం వహించాడు.[1]

జననం, విద్య

[మార్చు]

రమేశ్‌ 1976, మార్చి 16న ఆగయ్య – లక్ష్మీ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, వీణవంక మండలంలోని కనపర్తి గ్రామంలో జన్మించాడు. రమేశ్ కు ఇద్దరు అన్నలు, ఇద్దరు అక్కలు ఉన్నారు. ఐదవతరగతి వరకు కనపర్తి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో, ఆరు నుంచి పదోతరగతి నుంచి పది వరకు హుజూరాబాద్ విశ్వ ప్రగతి విద్యాలయంలో చదివిన రమేశ్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఆపై చదువులు హైదరాబాద్‌ నగరంలో పూర్తిచేశాడు.[2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

రమేశ్‌ కు స్వరూపతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు (తరుణ్, జాహ్నవి).

రచనా ప్రస్థానం

[మార్చు]

చిన్ననాటి నుంచి సాహిత్యం, సినిమా, సంగీతం అంటే అమితమైన ఇష్టమున్న రమేశ్ ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, స్వాతి, నమస్తే తెలంగాణ వంటి పత్రికల్లో అనేక కవితలు, కథలు రాశాడు. ‘మా కనపర్తి ముషాయిరా’ (2021), ‘బాంబే డాల్‌’, శ్రీరాజరాజేశ్వరి యాత్ర స్పెషల్‌’ వంటి పుస్తకాలు కూడా ప్రచురించాడు.

‘మా కనపర్తి ముషాయిరా’ నోస్టాల్జియా కథల పుస్తకానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఈనాడు గ్రూప్స్ చైర్మన్ రామోజీరావు, రచయిత యండమూరి వీరేంద్రనాథ్, బాహుబలి సినిమా రచయిత విజయేంద్రప్రసాద్ తదితర ప్రముఖుల నుండి ప్రశంశలు అందుకున్నాడు.[3] ఆ తరువాత రాసిన నవల ‘బాంబే డాల్‌’ కూడా అశేష పాఠక ఆదరణ పొందింది. ‘బాంబే డాల్‌’ పుస్తకం ఆధారంగా ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా బన్సాలీ అసోసియేట్‌ సురేన్‌, రైట్స్‌ తీసుకొని హిందీలో సినిమా తీయబోతున్నాడు.

సినిమారంగం

[మార్చు]

గౌతమ్ ఎస్.ఎస్.సి., మీ శ్రేయోభిలాషి, కౌసల్య సుప్రజా రామ, కాశీపట్నం చూడరా బాబు వంటి అనేక సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించాడు. మరెన్నో విజయవంతమైన సినిమాలకు తన పేరు లేకుండా సహ రచయితగా వ్యవహరించాడు. విసు ఇంటర్నేషనల్, దిల్ రాజు, రామోజీరావు, డి. రామానాయుడు, మల్టీ డైమెన్షన్ వంటి ప్రసిద్ధ నిర్మాణ సంస్థల్లో పనిచేశాడు.[2]

2008లో రాజేంద్రప్రసాద్‌ ప్రధానపాత్రలో వచ్చిన ‘బేవర్స్’ సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు.[4] ఈ సినిమా ప్రేక్షకులకు చాలా కనెక్ట్‌ అవ్వడంతోపాటు వెబ్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది. నలభై మిలియన్స్ వ్యూవర్ షిప్ సాధించింది. ఆ తరువాత పలు సినిమాలకు మాటలు, కథ అందించాడు.

రాజకీయ నాయకుల హామీని కథాంశంగా తీసుకొని 2023లో ‘భీమదేవరపల్లి బ్రాంచి’ సినిమాను తీశాడు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రశంసలు పొంది ఆర్గానిక్ హిట్ సాధించింది.[5]

సినిమాలు

[మార్చు]

రచయితగా

[మార్చు]
 1. గౌతమ్ ఎస్.ఎస్.సి. (2005) సహాయ రచయిత
 2. మీ శ్రేయోభిలాషి (2007) మాటలు
 3. కౌసల్య సుప్రజా రామ (2008) కథ, స్క్రీన్ ప్లే
 4. బ్రహ్మీగాడి కథ (2011) సహ రచయిత

దర్శకుడిగా

[మార్చు]
 1. బేవర్స్ (2018)
 2. భీమదేవరపల్లి బ్రాంచి (2023)[6]
 3. లగ్గం (నిర్మాణంలో ఉంది)[7]
 4. సర్పంచ్ ( pre-production)

అవార్డులు

[మార్చు]
 • భరతముని అవార్డు
 • అక్కినేని జన్మదిన పురస్కారం
 • ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అనలిటికల్ & అప్రిసియేషన్ సొసైటీ అవార్డు
 • సంగం అకాడమీ అవార్డు

మూలాలు

[మార్చు]
 1. "Director Ramesh Cheppala on the success of 'Bheemadevarapally Branchi': The response to the film has been overwhelmingly positive". The Times of India. 2023-07-04. ISSN 0971-8257. Archived from the original on 2023-07-04. Retrieved 2023-07-25.
 2. 2.0 2.1 "'భీమదేవరపల్లి బ్రాంచి' డైరెక్టర్‌ మనోడే". Sakshi. 2023-06-23. Archived from the original on 2023-07-25. Retrieved 2023-07-25.
 3. Cheppala, Ramesh (2021-02-08). Maa Kanaparthi Mushaira (in Telugu). హైదరాబాదు: logili. ISBN 978-93-5437-996-3. Archived from the original on 2023-07-25.{{cite book}}: CS1 maint: date and year (link) CS1 maint: unrecognized language (link)
 4. "'Bewars is a socially-conscious movie'". indiaglitz. 10 April 2018.
 5. "Yet another film is crowned in native Telangana Accent". Sakshi Post (in ఇంగ్లీష్). 2023-06-29. Archived from the original on 2023-07-25. Retrieved 2023-07-25.
 6. "Triumph of Good Content Over Formulaic Plots!". www.deccanchronicle.com. 2023-07-03. Archived from the original on 2023-07-03. Retrieved 2023-07-25.
 7. "భీమదేవరపల్లి బ్రాంచి దర్శకుడి 'లగ్గం'". Sakshi. 2023-11-01. Archived from the original on 2023-11-03. Retrieved 2023-12-24.

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.