కౌసల్యా సుప్రజా రామ
స్వరూపం
"కౌసల్యా సుప్రజారామ" అనే శ్లోకం శ్రీరామాయణంలో బాలకాండ లోనిది. రామ లక్ష్మణుల గురువైన విశ్వామిత్రుడు నిద్రిస్తున్న శిష్యులను ఈ శ్లోకంతో మేల్కొలుపుతాడు.
ఈ శ్లోకం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో వేంకటేశ్వరుడిని మేల్కొలపడానికి కూడా ఆలపిస్తారు. ఇది తిరుమలలో బంగారు వాకిలి వద్ద ప్రతీ రోజూ ఉదయం దేవాలయ తలుపులను తెరిచే సందర్భంలో మొట్టమొదటగా ఆలపిస్తున్న శ్లోకం.
శ్లోకం:
కౌసల్యా సుప్రజారామ
పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్ధూల
Nm
కర్తవ్యం దైవమాహ్నికం
తా. కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. కావున లెమ్ము.O OO.k
మూలాలు
[మార్చు]- Tirumala.org- Tirumala Tirupati Devasthanams