రతీమన్మథ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రతీమన్మథ
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం పోలవరపు బ్రహ్మానందరావు
నిర్మాణం పి.వి.ఎస్.వి.ప్రసాద్
తారాగణం సంగీత,
ప్రసాద్ బాబు,
వంకాయల,
గోపీకృష్ణ
సంగీతం సత్యం
నేపథ్య గానం ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
సంభాషణలు కె.వి.రమణమూర్తి
ఛాయాగ్రహణం వి.వి.ఆర్.చౌదరి
నిర్మాణ సంస్థ శ్రీవాణీ వరలక్ష్మి కంబైన్స్
విడుదల తేదీ 9 నవంబర్ 1979
భాష తెలుగు

రతీమన్మథ నవంబరు 9, 1979వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాకు పోలవరపు బ్రహ్మానందరావు దర్శకత్వం వహించాడు.

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: పోలవరపు బ్రహ్మానందరావు
  • మాటలు: కె.వి.రమణమూర్తి
  • సంగీతం: సత్యం
  • ఛాయాగ్రహణం: వి.వి.ఆర్.చౌదరి
  • కూర్పు: నాయని మహేశ్వరరావు
  • నిర్మాత: పి.వి.ఎస్.వి.ప్రసాద్

కథ[మార్చు]

సుశీల చదువుకున్న అమ్మాయి. వంపులు సొంపులు వున్న యువతి. తల్లి, చెల్లెలు, ఇద్దరు తమ్ముల పోషణ బాధ్యత ఆమెపై పడుతుంది. సుశీలపై కన్నువేసిన సమితి అధ్యక్షుడు ఆమె లొంగకపోవడంతో ఉద్యోగంలోంచి తీసివేయిస్తాడు. ఊళ్లో ఆమెకు ఆమె కుటుంబానికి పరపతి లేకుండా చేస్తాడు. సుశీల తమ్ముడు చనిపోతే, సహాయానికి ఒక్కరు కూడా రారు. సుశీలకు పట్నంలో ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం ఇచ్చిన నాగేంద్రరావు తనకు, తన క్లయింట్లకు ఆనందాన్ని అందించాలని షరతు విధిస్తాడు. పరిస్థితుల ప్రాబల్యం వల్ల సుశీల అంగీకరిస్తుంది. ఆమెలో బిగువు సడలగానే నాగేంద్రరావు ఆమెను ఉద్యోగంలో నుంచి తీసివేస్తాడు. సుశీలను ఒక యువతి ఆదరిస్తుంది. వారిద్దరూ వ్యాపారంలో భాగస్వాములవుతారు. ఏనాడో ఇల్లు వదిలి వెళ్ళిపోయిన సుశీల అన్న మోహన్ ఇంటికి వచ్చి కుటుంబం సంగతి తెలుసుకుని, పట్నం వెళ్లి అక్కడ తన చెల్లెల్లు నాగేంద్రరావు మూలంగా నాశనమైందని, కారు ప్రమాదంలో మరణించిందని తెలుసుకుని పగ తీర్చుకునే పనులు మొదలు పెడతాడు[1].

పాటలు[మార్చు]

  1. హృదయాలు రెండు ఒకటై - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: దాశరథి

మూలాలు[మార్చు]

  1. వి.ఆర్. (15 November 1979). "చిత్రసమీక్ష రతీమన్మథ". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 66, సంచిక 223. Retrieved 3 January 2018.[permanent dead link]

బయటిలింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=రతీమన్మథ&oldid=3686209" నుండి వెలికితీశారు