Jump to content

కోరుకున్న మొగుడు

వికీపీడియా నుండి
కోరుకున్న మొగుడు
(1982 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కట్టా సుబ్బారావు
తారాగణం శోభన్‌బాబు ,
లక్ష్మి,
జయసుధ
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ పి.వి.ఎస్. ఫిల్మ్స్
భాష తెలుగు

కోరుకున్న మొగుడు పి.వి.ఎస్. ఫిల్మ్స్ బ్యానర్‌పై కట్టా సుబ్బారావు దర్శకత్వంలో జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి నిర్మించిన తెలుగు సినిమా. ఈ సినిమా 1982, జూన్ 12న విడుదలయ్యింది.[1]శోభన్ బాబు, లక్ష్మి, జయసుధ నటించిన ఈ చిత్రానికి సంగీతం చేళ్ళపిళ్ళ సత్యం సమకూర్చారు.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

సంక్షిప్త కథ

[మార్చు]

పార్వతి శ్రీమంతుల బిడ్డ. శంకరరావు సామాన్యుడు. పరిస్థితులు వారిని దగ్గర చేశాయి. ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు. శంకరరావుకు ఒక ప్రాణస్నేహితుడున్నాడు. అతడంటే పార్వతికి అసహ్యం. అతని విషయంలో భార్యాభర్తలు ఘర్షణ పడి విడిపోతారు. పార్వతి అప్పటికే గర్భవతి. కాలం గడిచిపోతుంది. పార్వతి కొడుకు మురళి పెరిగి పెద్దవాడవుతాడు. గీత అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఊహించని పరిస్థితులలో రాధ అనే అమ్మాయిని తన ప్రియురాలు గీతగా పార్వతికి పరిచయం చేస్తాడు. రాధ సపర్యలతో పార్వతి ఆరోగ్యం కుదుటపడుతుంది. తనకు తగిన కోడలు అనుకుంటుంది. రాధ ఎవరో కాదు శంకరరావు స్నేహితుని కూతురు. స్నేహితుడు చనిపోతే శంకరరావే ఆమెను పెంచాడు. విడిపోయిన పార్వతి శంకరరావులను కలపాలని రాధ, మురళి ప్రయత్నించడం, భార్యాభర్తల పునస్సమాగమనం పతాక సన్నివేశాలు.[2]


పాటల జాబితా

[మార్చు]

1. కోరుకున్న మొగుడు నే కోరుకున్న మొగుడు, రచన :వేటూరి సుందరరామమూర్తి, గానం. పులపాక సుశీల

2 .చిలకమ్మా గోరింక సరసాలాడితే , రచన: వేటూరి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

3.చిలకమ్మా గోరింక సరసలాడితే , రచన: వేటూరి, గానం.పి . సుశీల

4. చిలిపి చిన్నారి కృష్ణుడు ఓ అమ్మలాల , రచన: వేటూరి, గానం.పి.సుశీల, శిష్ట్లా జానకి, మాధవపెద్ది రమేష్

5.డు డు డు బసవన్న ఆడే పాడే వయసన్నా, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి

6.వినుడు వినుడు రామాయణ గాధ , రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం

7.విష్ణుప్రియా మహాలక్ష్మి,(శ్లోకం), గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

8.సిగ్నల్ కొట్టింది చిన్నది లగ్నం పెట్టింది, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

మూలాలు

[మార్చు]
  1. web master. "Korukunna Mogudu (Katta Subbarao) 1982". ఇండియన్ సినిమా. Retrieved 12 September 2022.
  2. మధుర (24 June 1982). "చిత్ర సమీక్ష: కోరుకున్న మొగుడు" (PDF). ఆంధ్రపత్రిక. No. సంపుటి:69 సంచిక 83. Archived from the original (PDF) on 12 సెప్టెంబరు 2022. Retrieved 12 September 2022.

3.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.