ఖుషి ఖుషీగా

వికీపీడియా నుండి
(ఖుషీ ఖుషీగా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఖుషి ఖుషీగా
Kushi Kushiga.jpg
దర్శకత్వంజి. రాంప్రసాద్
దృశ్య రచయితజి. రాంప్రసాద్
కథసిద్ధిక్
నిర్మాతఆదిత్యరాం
తారాగణంజగపతి బాబు
రమ్యకృష్ణ
సంగీత
నిఖిత
తొట్టెంపూడి వేణు
ఛాయాగ్రహణండి. ప్రసాద్ బాబు
కూర్పుకె. రమేష్
సంగీతంఎస్. ఎ. రాజ్ కుమార్
నిర్మాణ
సంస్థ
ఆదిత్యరాం మూవీస్
విడుదల తేదీ
2004 ఏప్రిల్ 16 (2004-04-16)
సినిమా నిడివి
148 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

ఖుషీ ఖుషీగా 2004 లో జి. రాంప్రసాద్ దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] ఇందులో జగపతి బాబు, రమ్యకృష్ణ, వేణు, నిఖిత, సంగీత ముఖ్యపాత్రల్లో నటించారు.

కథ[మార్చు]

సూర్యప్రకాష్ అలియాస్ ఎస్. పి ఒక బ్రహ్మచారి. ఇతనికి అమ్మాయిలన్నా ప్రేమన్నా పడదు. తన ఇంట్లో కూడా మైదానం అనే వ్యక్తిని వంట దగ్గర్నుంచి అన్ని పనులకూ నియమించుకుంటాడు. ఎస్. పి భవాని పై కోర్టులో ఓ కేసు గెలిచి చనిపోయిన తన తండ్రి ఆస్తి సంపాదించుకుంటాడు. ఓడిపోయినందుకు ప్రతీకారంగా భవాని అతనిమీద ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకుంటుంది. ఎస్. పి ఇల్లు ఒక అమ్మాయిల వసతి గృహం పక్కనే ఉంటుంది. ఇలా ఉండగా ఎస్. పి బావమరిది శ్రీ కుమార్ పనీ పాట లేకుండా తిరుగుతున్నాడని అతని తండ్రి ఎస్. పి. కి వ్యాపారంలో సహాయం చేయమని పంపిస్తాడు. ఇతను అమ్మాయిల వెంట పడుతూ ఉంటాడు. పక్కనే హాస్టల్ లో ఉన్న సంధ్య అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఎస్. పి. సంధ్యకు తనెవరో తెలీకుండా సహాయం చేస్తుంటాడు.

తారాగణం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. జి. వి., రమణ. "ఐడిల్ బ్రెయిన్ లో చిత్ర సమీక్ష". idlebrain.com. Retrieved 19 February 2018.