Jump to content

సోలో బ్రతుకే సో బెటర్

వికీపీడియా నుండి
సోలో బ్రతుకే సో బెటర్
సోలో బ్రతుకే సో బెటర్ సినిమా పోస్టర్
దర్శకత్వంసుబ్బు
రచనసుబ్బు
నిర్మాతబివిఎస్ఎన్ ప్రసాద్
తారాగణంసాయి ధరమ్ తేజ్, నభా నటేష్, రాజేంద్ర ప్రసాద్, విజయ నరేష్
ఛాయాగ్రహణంవెంకట్ సి దిలీప్
కూర్పునవీన్ నూలి
సంగీతంతమన్
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుజీ స్టూడియోస్
విడుదల తేదీ
25 డిసెంబర్‌ 2020
దేశంభారతదేశం
భాషతెలుగు

సోలో బ్రతుకే సో బెటర్, 2020 డిసెంబరు 25న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో సుబ్బు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో[1] సాయి ధరమ్ తేజ్, నభా నటేష్, రాజేంద్ర ప్రసాద్, విజయ నరేష్ ముఖ్యపాత్రల్లో నటించగా, తమన్ సంగీతం అందించాడు. ఈ చిత్రం 2020, మే 1న విడుదలకావాల్సి ఉంది,[2] కాని కరోనా-19 మహమ్మారి కారణంగా వాయిదా పడింది.[3] 2020, డిసెంబరు 25న జీ స్టూడియోస్ సంస్థ ద్వారా థియేటర్లలో విడుదలయింది.[4][5]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • రచన, దర్శకత్వం: సుబ్బు
  • నిర్మాత: బివిఎస్ఎన్ ప్రసాద్
  • సంగీతం: తమన్
  • ఛాయాగ్రహణం: వెంకట్ సి దిలీప్
  • కూర్పు: నవీన్ నూలి
  • నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
  • పంపిణీదారు: జీ స్టూడియోస్

నిర్మాణం

[మార్చు]

తేజ్ నటించిన ప్రతిరోజూ పండగే సినిమా సందర్భంగా సాయి ధరమ్ తేజ్ తో ఒక సినిమాను చేస్తున్నట్టు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర యూనిట్ ప్రకటించింది. 2019, అక్టోబరు 7న జరిగిన చిత్ర ప్రారంభోత్సవ వేడుకకు చిత్రబృందం హాజరయింది.[6][7]

చిత్రీకరణ

[మార్చు]

2019, నవంబరు 19న అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా అధికారికంగా ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమయింది.[8] విశాఖపట్నం లోని కైలాసాగిరి ప్రాంతంలో 20 రోజులకు పైగా చిత్రీకరణ జరిగింది.[9] ఆ తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయం, గీతంలలో 15 రోజుల పాటు చిత్రీకరణ జరిగింది.

పాటలు

[మార్చు]
Untitled

ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించాడు. అర్మాన్ మాలిక్ పాడిన "నో పెళ్ళి" పాట మొదటగా 2020 మే 25న విడుదలైంది. వరుణ్ తేజ్, రానా దగ్గుబాటి ఈ పాట ప్రమోషనల్ వీడియోలో కనిపించారు. సిద్ శ్రీరామ్ పాడిన "హే ఇది నేనేనా" పాట రెండవ పాటగా 2020 ఆగస్టు 25న విడుదల చేశారు.[10] నకాష్ అజీజ్ పాడిన "అమృతా" పాట మూడవ పాటగా 2020, అక్టోబరు 15న విడుదల చేశారు.[11] విశాల్ దాద్లానీ పాడిన "సోలో బ్రతుకే సో బెటర్" పాట చివరి పాటగా 2020, డిసెంబరు 11న విడుదల చేశారు.[12]

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."నో పెళ్ళి (రచన: రఘురాం)"రఘురాంఅర్మాన్ మాలిక్3:08
2."హేయ్ ఇది నేనేనా (రచన: రఘురాం)"రఘురాంసిద్ శ్రీరామ్4:15
3."అమృత (రచన: కాసర్ల శ్యామ్‌"కాసర్ల శ్యామ్‌నకాష్ అజీజ్3:28
4."సోలో బ్రతుకే సో బెటర్ (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"సిరివెన్నెల సీతారామశాస్త్రివిశాల్ దాదాన్లీ3:00
మొత్తం నిడివి:13:51

మార్కెటింగ్

[మార్చు]

2019, నవంబరు 11న న సింగిల్స్ డే సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలయింది.[13] 2020, ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా "సోలో బ్రతుకే సో బెటర్ థీమ్" అనే థీమ్ వీడియో విడుదల చేయబడింది.[14] 2020, డిసెంబరు 25న జీ స్టూడియోస్ ద్వారా థియేటర్లలో విడుదలయింది.[4]

మూలాలు

[మార్చు]
  1. Chowdhary, Y. Sunita (9 March 2020). "Puri Jagannadh is an inspiration for 'Solo Brathuke So Better', says director Subbu". The Hindu. Retrieved 25 December 2020.
  2. "Sai Dharam Tej film going as Expected". Tollywood. 9 March 2020. Retrieved 25 December 2020.
  3. "Shootings to resume first, releases can wait". telugucinema.com. 1 May 2020. Retrieved 25 December 2020.
  4. 4.0 4.1 "Solo Brathuke So Better to release on Dec 25". Telugu Cinema. Retrieved 25 December 2020.
  5. Arikatla, Venkat (18 November 2020). "Solo Brathuke So Better: A ray of hope for theaters". greatandhra.com. Retrieved 25 December 2020.
  6. "Sai Dharam Tej and Nabha Natesh team up for 'Solo Brathuke So Better'". The Times of India. 7 October 2019. Retrieved 25 December 2020.
  7. "Sai Dharam Tej starrer Solo Brathuke So Better goes on floors". The Indian Express. 7 October 2019. Retrieved 25 December 2020.
  8. "Solo Brathuke So Better: Shooting of Sai Dharam Tej starrer kicks-off on International Men's Day". The Times of India. 19 November 2019. Retrieved 25 December 2020.
  9. "Sai Dharam Tej plays the lead role and the shooting has been continuing in Vizag". The Financial Express. 11 February 2019. Retrieved 25 December 2020.
  10. "Solo Brathuke So Better – Hey Idi Nenena Lyric | Sai Tej | Nabha Natesh | Subbu | Thaman S – YouTube". www.youtube.com. Retrieved 25 December 2020.
  11. "Solo Brathuke So Better – Amrutha Lyric | Sai Tej | Nabha Natesh | Subbu | Thaman S". youtube.com. Retrieved 25 December 2020.{{cite web}}: CS1 maint: url-status (link)
  12. "Solo Brathuke So Better – Title Track Lyric | Sai Tej | Nabha Natesh | Subbu | Thaman S". youtube.com. 11 December 2020. Retrieved 25 December 2020.{{cite web}}: CS1 maint: url-status (link)
  13. "Happy Singles Day: 'Solo Brathuke So Better' First Look". The Times of India. 11 November 2019. Retrieved 25 December 2020.
  14. "Solo Brathuke So Better Theme Video: Sai Dharam Tej pledges everyone to stay single". The Times of India. 13 February 2020. Retrieved 25 December 2020.

ఇతర లంకెలు

[మార్చు]