ప్రేమికుల దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రేమికుల దినోత్సవం
ప్రేమికుల దినోత్సవం
1909 వాలెంటైన్స్ కార్డు
యితర పేర్లువాలెంటైన్‌ డే
జరుపుకొనేవారుఅనేక దేశంలో ప్రజలు
రకంక్రైస్తవ,శృంగార,సాంస్కృతిక, వాణిజ్య ఆచారం.
జరుపుకొనే రోజుఫిబ్రవరి 14
వేడుకలుప్రేమికులు ఒకరికొకరు తమ భావాలను వ్యక్తం చేస్తారు
ఆవృత్తివార్షికం

ప్రేమికుల దినోత్సవం (ఆంగ్లం: Valentine's Day) ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14 న జరుపుకుంటారు.[1]అమెరికా, కెనడా, మెక్సికో, యునైటేడ్‌ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, భారత్, ఇటలీ, డెన్మార్క్, జపాన్‌లలో ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు.పాశ్చాత్య దేశాల ప్రభావంగా భావించే వాలెంటైన్స్ డే వేడుకలు భారతదేశంలో వ్యతిరేకిస్తున్నారు.దాదాపు ప్రతి సంవత్సరం, నిరసనల కారణంగా భారతదేశంలోని అనేక నగరాల్లో ఫిబ్రవరి 14న శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయి.[2][3]

చరిత్ర

[మార్చు]

వాలెంటైన్‌ అనే ఒక ప్రవక్త. ప్రేమికుల రోజు పుట్టడానికి ఆద్యుడు. సా.శ.పూ. 270లో రోమ్‌ దేశంలో జీవించిన వాలెంటైన్‌ యువతకు ప్రేమ సందేశాలు ఇవ్వడం, ప్రేమ వివాహాలను ప్రోత్సహించడం చేసేవాడు. అదే సమయంలో రోమ్‌ను పాలిస్తున్న చక్రవర్తి క్లాడియస్‌ కుమార్తె వాలెంటైన్‌ అభిమానిగా మారడంతో చక్రవర్తికి భయం పట్టుకుంది. దీంతో యువతకు ప్రేమ సందేశాలిచ్చి తప్పుడు దోవ చూపిస్తున్నాడన్న నెపంతో వాలెంటైన్‌కు మరణశిక్ష విధించి ఫిబ్రవరి 14న ఉరి తీయించాడు. ఈ ఘటన జరిగిన రెండు దశాబ్దాల తర్వాత అప్పటి పోప్‌ గెలాసియన్స్‌ వాలెంటైన్‌ మరణించిన రోజును ప్రేమికుల రోజుగా ప్రకటించారు. అప్పటినుంచి ఖండాంతరాలను దాటుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు పండుగగా జరుపుకునేలా ప్రేమికుల దినోత్సవం విస్తరించింది.[4][5][6][7] ఏటా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమికులు తమకిష్టమైన కానుకలు ఇచ్చు పుచ్చుకుంటారు.

వివిధ దేశాల్లో జరుపుకునే విధానం

[మార్చు]
 • భారతదేశంలో ప్రేమికుల రోజు దినోత్సవం జరుపుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కానీ విదేశీ సంస్కృతి కావడంతో చాలామంది దీనిని వ్యతిరేకిస్తున్నారు.విదేశాలలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సెలవు ఇచ్చే విధానం ఉంది. మన దేశంలో లేదు.
 • జర్మనీలో ప్రేమికుల రోజున పంది బొమ్మ ఉన్న గ్రీటింగ్‌ కార్డును ఇచ్చిపుచ్చుకోవడం శుభసూచకంగా భావిస్తారు. వాలెంటైన్‌ డేకు పంది బొమ్మలకు జర్మనీలో డిమాండ్‌ ఉంటుంది.
 • అర్జెంటీనాలో ఇక్కడ విభిన్నంగా జూలై 13 నుంచి 20వ తేదీ వరకూ వారం పాటు వాలెంటైన్‌ వీక్‌గా జరుపుకొంటారు.
 • కొరియాలో ఏప్రిల్‌ 14ను వైట్‌ డేగా భావిస్తూ ప్రేమికులు దినోత్సవం ఉత్సాహంగా తీసుకుంటారు.

ఏడు రోజుల పండగ

[మార్చు]

వాలెంటైన్స్‌ వీక్‌లో మొదటి రోజైన రోజ్‌ డే ప్రారంభం అవుతుంది.[8]

 • ఫిబ్రవరి 7: రోజ్ డే
 • ఫిబ్రవరి 8: ప్రపోజ్ డే
 • ఫిబ్రవరి 9: చాక్లెట్ డే
 • ఫిబ్రవరి 10: టెడ్డీ డే
 • ఫిబ్రవరి 11: ప్రామిస్ డే
 • ఫిబ్రవరి 12: హగ్ డే
 • ఫిబ్రవరి 13: కిస్ డే
 • ఫిబ్రవరి 14: వాలెంటైన్స్ డే

వివాదాలు

[మార్చు]

ప్రేమికుల రోజును వ్యతిరేకించే వాళ్లలో దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తరాదిలో ఎక్కువని ఓ సర్వేలో వెల్లడైంది.ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ భారతదేశంలో ప్రేమికుల రోజుకు ప్రత్యామ్నాయంగా ఫిబ్రవరి 14న వివిధ దినోత్సవాలు నిర్వహిస్తున్నారు.

 • మాతృ-పితృ పూజా దినోత్సవం:2012లో ఉత్తర్‌ ప్రదేశ్‌ సీఎంగా అఖిలేశ్‌ యాదవ్ ఉన్నప్పుడు ఫిబ్రవరి 14న మాతృ-పితృ పూజ నిర్వహించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.అప్పటి నుంచి ప్రతి ఏడాది యూపీ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
 • బ్లాక్‌ డే: మహారాష్ట్రలో రాజకీయ పార్టీ అయినా శివసేన ఫిబ్రవరి 14న ‘బ్లాక్‌ డే’గా నిర్వహిస్తోంది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడంలో అహర్నిశలు శ్రమించిన భగత్‌ సింగ్‌తో పాటు మరో ఇద్దరికి ఈ రోజునే న్యాయస్థానం మరణశిక్ష విధిస్తున్నట్టు తీర్పు వెలువరించింది. దీంతో స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన, ఇప్పటికీ ప్రతి భారతీయుడి గుండెల్లో నిలిచిపోయిన భగత్‌ సింగ్‌కు శిక్ష పడిన ఆరోజును ఆనందంతో కాకుండా వారికి నివాళిగా జరుపుకోవాలనేది శివసేన అభిమతం.[9]

భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు

[మార్చు]

భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు ప్రేమికుల రోజున రోడ్ల మీద ఎవరైనా ప్రేమజంట కనిపిస్తే వారికి అక్కడిక్కడే పెళ్లి చేసేస్తారు. సదరు వ్యక్తులకు ఇష్టం ఉన్నా లేకపోయినా వివాహం జరిపించేస్తారు. ప్రేమికుల దినోత్సవాన్ని వ్యతిరేకించే ఇతర రాజకీయ పార్టీలు, మతపరమైన సంఘాలు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, అఖిల్ భారతీయ విద్యా పరిషత్, [10] శ్రీ రామ్ సేన, [11] స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, [12] హిందూ మున్నాని, హిందూ మక్కల్ కచ్చి, [13] మొదలైనవి ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
 1. "Valentine's Day | Definition, History, & Traditions". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2021-02-14.
 2. "India's fascination with Valentine's Day". BBC News. 14 February 2002. Retrieved 27 January 2015.
 3. "Mobocracy and anti Valentine Day protest". The Hindu. 1 March 2013. Retrieved 27 January 2015.
 4. Butler, Alban (1981). Butler's Lives of the saints (in ఇంగ్లీష్). Burns & Oates. ISBN 9780860121121.
 5. Chanchreek, K. L.; Jain, M. K. (2007). Encyclopaedia of Great Festivals (in ఇంగ్లీష్). Shree Publishers & Distributors. ISBN 9788183291910.
 6. "నేడు ప్రేమికుల దినోత్సవం". www.andhrajyothy.com. Retrieved 2020-02-28.
 7. "ఈ దేశాల్లో ప్రేమికుల దినోత్సవం నిషేధం!". www.10tv.in (in ఇంగ్లీష్). Archived from the original on 2020-02-28. Retrieved 2020-02-28.
 8. "Valentine's Week Full List 2022: Rose Day to Kiss Day, significance and all you need to know about the days of love". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-02-06. Retrieved 2022-02-12.
 9. "ప్రేమికుల రోజు మాత్రమే కాదు..అంతకుమించి". www.eenadu.net. Archived from the original on 2020-02-28. Retrieved 2020-02-28.
 10. "ABVP prevents Valentine’s Day celebrations". The Hindu (in Indian English). 2010-02-15. ISSN 0971-751X. Retrieved 2021-02-14.
 11. "We’ll not spare dating couples on Valentine’s Day: Muthalik". The Hindu (in Indian English). 2009-02-06. ISSN 0971-751X. Retrieved 2021-02-14.
 12. "Muslims told to stay away from Valentine's Day". The Hindu (in Indian English). Special Correspondent. 2012-02-14. ISSN 0971-751X. Retrieved 2021-02-14.{{cite news}}: CS1 maint: others (link)
 13. Reporter, Staff (2013-02-15). "Protests against Valentine's Day celebrations". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-02-14.