ప్రతిరోజూ పండగే
ప్రతిరోజూ పండగే | |
---|---|
దర్శకత్వం | దాసరి మారుతి |
రచన | దేవా దత్తా |
స్క్రీన్ ప్లే | దాసరి మారుతి |
కథ | దాసరి మారుతి |
నిర్మాత | బన్ని వాసు అల్లు అరవింద్ (సమర్పణ) |
తారాగణం | |
ఛాయాగ్రహణం | జయకుమార్ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | ఎస్. తమన్ |
నిర్మాణ సంస్థలు | యువీ క్రియేషన్స్ గీతా ఆర్ట్స్2 పిక్చర్స్ |
విడుదల తేదీ | 20 డిసెంబరు 2019 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | 25 కోట్లు |
ప్రతిరోజూ పండగే 2019, డిసెంబరు 20న విడుదలైన తెలుగు చలనచిత్రం. దాసరి మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా, సత్యరాజ్, రావు రమేష్ నటించారు. యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్2 పిక్చర్స్ పతాకంపై బన్ని వాసు నిర్మించిన ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతం, జయకుమార్ సినిమాటోగ్రఫి, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ అందించారు.[1]
కథ
[మార్చు]నటవర్గం
[మార్చు]పాటల జాబితా
[మార్చు]- ప్రతిరోజూ పండుగే , రచన: కృష్ణకాంత్, గానం.శ్రీకృష్ణ
- ఓ బావా , రచన: కృష్ణకాంత్, గానం.సత్య యామిని , మోహన భోగరాజు , హరితేజ
- తకిట తకిట, రచన: కాసర్ల శ్యామ్ , గానం.రాహూల్ సింప్లీ గంజ్ , గీతా మాధురి
- చిన్నతనమే , రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి,గానం.విజయ్ యేసు దాస్
- యూ ఆర్ మై హై, రచన: శ్రీజో , గానం.రాశిఖన్నా , దీపు , రాహుల్ నంబియార్.
సాంకేతికవర్గం
[మార్చు]- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దాసరి మారుతి
- నిర్మాత: బన్ని వాసు, అల్లు అరవింద్ (సమర్పణ)
- రచన: దేవా దత్తా
- సంగీతం: ఎస్. తమన్
- ఛాయాగ్రహణం: జయకుమార్
- కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
- నిర్మాణ సంస్థ: యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్2 పిక్చర్స్
నిర్మాణం
[మార్చు]ప్రారంభం
[మార్చు]2019, జూన్‌లో పూజా కార్యక్రమాలతో, ముహూర్తం షాట్ చిత్రీకరణతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దిల్ రాజుతోపాటు చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.[2]
చిత్రీకరణ
[మార్చు]2019, జూలై నెలలో రెగ్యులర్ చిత్రీకరణ హైదరాబాదులో ప్రారంభమైంది. 2019, సెప్టెంబరులో ఈ చిత్రంలోని గ్రామీణ నేపథ్య సన్నివేశాల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ రాజమండ్రికి వెళ్ళింది.[3]
విడుదల
[మార్చు]ఈ చిత్రం 2019, డిసెంబరు 20న విడుదలయింది.[4]
ప్రచారం
[మార్చు]గీతా ఆర్ట్స్ 2019, సెప్టెంబరు 12వ తేదీన వివిధ వేదికల్లో ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. 2019, అక్టోబరు 15న చిత్ర టీజర్‌ను విడుదల చేసి, సినిమా విడుదల తేదీని ప్రకటించింది. దీపావళి పండుగ సందర్భంగా చిత్రంలోని నటీనటులందరి ఫోటోలతో ఒక పోస్టర్‌ను విడుదలచేసింది.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ "Watch: Teaser of 'Prathi Roju Pandage' promises a family entertainer". The News Minute. Retrieved 6 December 2019.[permanent dead link]
- ↑ "Tollywood buzz: Nithiin's 29th film titled Rang De!, Sai Dharam Tej's Prati Roju Pandage launched in Hyderabad". Indian Express. Retrieved 6 December 2019.
- ↑ "Prathiroju Pandage in Rajamundry". Idream. Archived from the original on 29 అక్టోబరు 2019. Retrieved 6 December 2019.
- ↑ "Sai Dharam Tej's Prati Roju Pandaage to clash with these two films. See inside". Times of India. 2 December 2019. Retrieved 6 December 2019.
- ↑ "Prati Roju Pandage' glimpse highlights Sathyaraj". NTV. Archived from the original on 29 అక్టోబరు 2019. Retrieved 6 December 2019.
- ↑ "ప్రతిరోజూ పండగే' ఫస్ట్ లుక్: నాన్నే కుర్రాడైతే..!". Telugu Samayam. Archived from the original on 29 అక్టోబరు 2019. Retrieved 6 December 2019.