దాసరి మారుతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దాసరి మారుతి
జననం (1981-10-08) 1981 అక్టోబరు 8 (వయసు 43)[1]
వృత్తిదర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు2005 - ప్రస్తుతము
జీవిత భాగస్వామివీణారాగ స్పందన (2003 -ఇప్పటి వరకు)
పిల్లలు1

దాసరి మారుతీ ఒక తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత.[2]

నేపథ్యము

[మార్చు]

ఇతడిది మచిలీపట్నం.[3] పేదరికంలో పెరిగాడు. వీళ్ళ నాన్న బండ్ల మీద అరటిపళ్లు అమ్మేవాడు. అమ్మ టైలరింగ్ చేసేది. ఇతను మొదట్లో వాహనాలకు నంబర్ స్టిక్కర్లు వేసేవాడు. కష్టాల మధ్యే డిగ్రీ పూర్తి చేశాడు. టూడీ యానిమేషన్ నేర్చుకోవాలన్న సంకల్పంతో 1998లో హైదరాబాదు వచ్చేశాడు. నిజాంపేటలోని వీళ్ళ అక్క వాళ్లింటో మొదటి నివాసము.

ఆ రోజుల్లో నిజాంపేటకు బస్సులు తక్కువ. ఆటోలు కూడా వచ్చేవి కావు. జేఎన్‌టీయూ నుంచి నిజాంపేట వరకూ నడిచేవాడు. జూబ్లీహిల్స్‌ లోని హార్ట్ ఇనిస్టిట్యూట్ అకాడమీలో టూడీ యానిమేషన్ కోర్స్‌లో చేరాడు. ఉదయం పదింటికే నిజాంపేట నుంచి సైకిల్ మీద జేఎన్‌టీయూ బస్టాప్ చేరుకునేవాడు. తెలిసిన వాళ్ల షాప్ దగ్గర సైకిల్ పార్క్ చేసి బస్సులు మారి రెండింటికి ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లేవాడు. ఐదింటికి క్లాస్ అయిపోయాక బయల్దేరితే.. ఇంటికి చేరుకునే సరికి రాత్రి తొమ్మిది దాటేది. ఇలా చదువు కన్నా జర్నీకే ఎక్కువ టైం పట్టేది.

ఇతడికి బొమ్మలేయడం అంటే సరదా. సిటీ రోడ్లపై బాగా చక్కర్లు కొట్టేవాడు. ఆ టైంలోనే బస్టాప్‌ల దగ్గర వేచి ఉండే ప్రయాణికుల బొమ్మలు గీసేవాడు. గోల్కొండ, చార్మినార్, నెహ్రూ జంతుప్రదర్శనశాలలోని జంతువులు, పక్షులు ఇలా ఎన్నో బొమ్మలు వేశాడు. సమయం దొరికితే చాలు హైదరాబాద్ అందాలను స్కెచింగ్‌లో చూపించే ప్రయత్నం చే సేవాడు.

సినీ జీవితము

[మార్చు]

2008లో ఇతనికి పెళ్లయింది. తర్వాత యానిమేషన్ ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహిస్తూ జీవనం కొనసాగించాడు. ఈ టైంలోనే బన్నీ వాసుతో పరిచయం ఇతని జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. ఆర్య సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా అవకాశం వచ్చింది. తర్వాత ఏ ఫిల్మ్ బై అరవింద్, ప్రేమిస్తే సినిమాలకు కో ప్రొడ్యూసర్‌గా చేశాడు. కొన్ని ప్రకటనలు కూడా తీశాడు. తర్వాత దర్శకత్వం తన వృత్తిగా స్వీకరించాడు. ప్రభాస్ ప్రస్తుతం రెబెల్ స్టార్ ప్రభాస్ తో సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు ప్రస్తుతం నిర్మాణదశలో ఉంది ఈ చిత్రం. [4]

సహా నిర్మాత

[మార్చు]
  1. గ్రీన్ సిగ్నల్ (2014)[5]
  2. లవ్ యు బంగారమ్ (2014)
సినిమాలు
సంవత్సరం పేరు దర్శకుడు రచయిత నిర్మాత గమనికలు
2012 ఈ రోజుల్లో
బస్ స్టాప్
2013 ప్రేమకథా చిత్రమ్
రొమాన్స్
2014 లవ్ యు బంగారమ్
గ్రీన్ సిగ్నల్
లవర్స్ స్క్రీన్ ప్లే
కొత్త జంట
2015 బెస్ట్ యాక్టర్స్
భలే భలే మగాడివోయ్
2016 భద్రం బీ కేర్ ఫుల్ బ్రదర్
బాబు బంగారం
రోజులు మారాయి
2017 లండన్ బాబులు
మహానుభావుడు
2018 బ్రాండ్ బాబు
శైలజా రెడ్డి అల్లుడు
2019 ప్రతిరోజూ పండగే
2021 మంచి రోజులు వ‌చ్చాయి [6]
3 రోజెస్ షో ర‌న్న‌ర్‌ ఆహా వెబ్ సిరీస్[7]
2022 పక్కా కమర్షియల్
2024 భ‌లే ఉన్నాడే [8]
2024 ది రాజా సాబ్

మూలాలు

[మార్చు]
  1. "Maruthi Dasari Profile". tvlap.com. Archived from the original on 14 October 2017. Retrieved 5 December 2017.
  2. వై, సునీతా చౌదరి. "Dasari Maruti breaks the mould with his next film". thehindu.com. ది హిందు. Retrieved 5 December 2017.
  3. "Interview with Maruthi". idlebrain.com. Idlebrain. Retrieved 5 December 2017.
  4. "Prabhas - Maruthi Movie First look on Sankranthi 2024". Manamnews. 2023-12-29.
  5. The Times of India, Entertainment (30 May 2014). "Green Signal to release on May 30" (in ఇంగ్లీష్). Archived from the original on 30 మే 2020. Retrieved 31 May 2020.
  6. NTV (15 June 2021). "'మంచి రోజులు వచ్చాయి' అంటున్న మారుతి!". Archived from the original on 17 August 2021. Retrieved 17 August 2021.
  7. TV9 Telugu (1 October 2021). "'ఆహా' కోసం వెబ్ సిరీస్ సిద్ధం చేసిన స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ మారుతి... 'త్రీ రోజెస్' ఫస్ట్ పోస్ట‌ర్‌ విడుదల". Archived from the original on 10 November 2021. Retrieved 10 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  8. Andhrajyothy (14 January 2024). "మారుతి, రాజ్ త‌రుణ్ సినిమా.. 'భ‌లే ఉన్నాడే'". Archived from the original on 14 January 2024. Retrieved 14 January 2024.