భలే భలే మగాడివోయ్ (సినిమా)
భలే భలే మగాడివోయ్ (2015 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | దాసరి మారుతీ |
---|---|
నిర్మాణం | వీ. వంశికృష్ణ రెడ్డి ఉప్పలపాటి ప్రమోద్ బన్నీ వాసు |
కథ | దాసరి మారుతీ |
చిత్రానువాదం | దాసరి మారుతీ |
తారాగణం | నాని , లావణ్య త్రిపాఠి |
సంగీతం | గోపి సుందర్ |
ఛాయాగ్రహణం | నిజార్ షఫి |
కూర్పు | ఎస్.బీ .ఉద్ధవ్ |
నిర్మాణ సంస్థ | యువి క్రియేషన్స్, గీత ఆర్ట్స్ 2 |
నిడివి | 145 నిముషాలు |
భాష | తెలుగు |
పెట్టుబడి | 7 కోట్లు[1] |
"భలే భలే మగాడివోయ్" 2015లో విడుదలైన తెలుగు సినిమా.ఈ సినిమాని గీతా ఆర్ట్స్2, యు.వీ.క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో వంశి కృష్ణ రెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్, బన్నీ వాసు నిర్మించారు. దాసరి మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నాని, లావణ్య త్రిపాఠి ఈ సినిమా హీరో, హీరోయిన్లు, మురళి శర్మ, అజయ్, నరేష్, సితార,వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు.
ఈ సినిమా "లక్కీ" అనే మతిమరుపు ఉన్న వ్యవసాయ శాస్త్రవేత్త చుట్టూ తిరుగుతుంది. అతడు తన మతిమరుపుని కప్పిపుచుకోవటానికి చేసే పనులు, తన ప్రేమించే అమ్మాయిని చివరికి ఎలా సాధించుకుండానేదే ఈ చిత్ర కథ. ఈ చిత్రం పేరు 1978 లో వచ్చిన సుపర్ హిట్ మరోచరిత్ర చిత్రంలో ఉన్న పాట నుండి తీసుకున్నారు. ఆ పాటకి ఎం.ఎస్. విశ్వనాథన్ సంగీతం సమకూర్చగా, ఆ చిత్రానికి కె.బాలచందర్ దర్శకుడు.
ఈ చిత్ర నిర్మాణం మార్చి 2013 లో ప్రారంభమవ్వగా, ప్రధాన చిత్రీకరణ పనులు జూలై 2015 లో పూర్తయ్యాయి. పోస్ట్-ప్రొడక్షన్ పనులతో కలిపి ఈ చిత్రాన్ని 7 నెలల్లో పూర్తి చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా చిత్రీకరణ చాలా వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తీశారు. ఒక పాట చిత్రీకరణ గోవాలో జరిగింది. 7 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా 700 సెంటర్లలో విడుదలయి, 55 కోట్ల గ్రాస్ తో పెట్టిన పెట్టుబడికి నికరంగా మూడింతలు వసూలు చేసి భారీ విజయాన్ని సాధించింది. అమెరికా తెలుగు బాక్సాఫీస్ గ్రాస్ లో 4వ స్థానంలో ఉంది. అక్కడ 115 సెంటర్లలో విడుదలైంది ఈ చిత్రం.
చిత్రకథ
[మార్చు]లక్కీ (నాని) మొక్కలపై పరిశోధన చేసే అధ్యయన కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేస్తుంటాడు. అంత వరకు బాగానే ఉంది. అయితే లక్కీకి మతిమరపు అనే పెద్ద లోపం ఉంటుంది. దాంతో ముందు చేసే పనిని వదిలేసి రెండోపనిలోకి వెళ్లిపోతుంటాడు. దాని వల్ల తనకి చాలా సమస్యలు వస్తుంటాయి, పెళ్ళి కూడా కాదు. పిల్లనివ్వడానికి వచ్చిన పాండు రంగారావు (మురళీశర్మ) లక్కీకి ఉన్న లోపాన్ని తెలుసుకుని తనకి పిల్లనివ్వనని అంటాడు. ఇలాంటి సందర్భంలో ఓ రోజు నందన (లావణ్య త్రిపాఠి)ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. తనకి కావాల్సిన వారికి సహాయం చేసి తనకి దగ్గరవుతాడు. అయితే లక్కీ తన మతిమరుపు వల్ల వచ్చే సమస్యలను తనకి అనుకూలంగా మలుచుకుంటూ నందన దగ్గర మంచి ఇంప్రెషన్ కొట్టేస్తాడు. నందన వదిన (మధుమతి)ని ఓ సందర్భంలో కాపాడడంతో నందన ఫ్యామిలీకి దగ్గరవుతాడు. అప్పుడే నందన, పాండు రంగారావు కుమార్తె అని తెలుస్తుంది. అప్పటి నుండి అసలు కథ ప్రారంభమవుతుంది. తన ప్రేమను కాపాడుకోవడానికి పాండు రంగారావు దగ్గర నాటకం మొదలు పెడతాడు. అందులో భాగంగా తన స్నేహితుడు (వెన్నెల కిషోర్)ను లక్కీ పరిచయం చేస్తాడు. కానీ నందన ఇష్టపడే పాండు రంగారావు స్నేహితుడి కొడుకు అజయ్ (అజయ్)కి ఎలాగైనా నందనకి లక్కీతో ఉన్న రిలేషన్ ని చెడగొట్టి తనవైపు తిప్పుకోవాలనుకుంటుంటాడు. మరి అప్పుడు లక్కీ ఏం చేస్తాడు? అజయ్ కి ఎలా బుద్ధి చెబుతాడు? పాండు రంగారావు మనసు మారుతుందా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
తారాగణం
[మార్చు]- నాని - లక్కరాజు/ లక్కీ
- లావణ్య త్రిపాఠి - నందన
- మురళీ శర్మ - పాండురంగ రావు, నందన తండ్రి
- విజయ నరేష్ - హనుమంత రావు, లక్కీ తండ్రి[2]
- సితార - లక్కీ అమ్మ
- అజయ్ - ఇంస్పెక్టర్ అజయ్
- మధుమిత - నందన వదిన
- వెన్నెల కిషోర్ - లక్కీ స్నేహితుడు
- శ్రీనివాస్ రెడ్డి - నందన బందువు
- సత్య కృష్ణన్ - నందన బందువు
- ప్రవీణ్ - ప్రవీణ్, లక్కీ స్నేహితుడు
- విక్రం సవ్యసాచి - అజయ్ కిందిస్థాయి అధికారి
నిర్మాణం
[మార్చు]సంగీతం
[మార్చు]గోపీ సుందర్ అనే మలయాళ సంగీత దర్శకులు ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. తెలుగులో ఇతనికి ఇది 2వ చిత్రం. ఇంతకు ముందు "మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు " చిత్రానికి పనిచేసారు.ఈ చిత్రంలో 5 పాటలు ఉన్నాయి. ఈ చిత్ర పాటలికి రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి, భాస్కరభట్ల రచన చేసారు. త్యాగరాజ పంచరత్న కృతుల్లో ఒకటైన "ఎందరో మహానుభావులు"ని "ఫ్యూషన్" (శాస్త్రీయ సంగీతానికి పాశ్చాత్య వాయిద్యాలతో చేసే ప్రయోగం) తో జనాలకి ఆకట్టుకునేల మార్పు చేసారు సంగీత దర్శకులు. ఈ చిత్ర సందర్భానికి సరిపోయేలా లిరిక్స్ ల మార్పులు చేసారు.[3] ప్రముఖ గాయకుడు కార్తీక్ ఐదిట్లో మూడు పాటలకి పాడాడు. చిత్ర పాటల వరుసలో మొదటి మూడు పాటలని 2015 ఆగస్టు 12 న హైదరాబాద్ ల ఒక FM స్టేషన్ ల విడుదల చేసారు. మిగిలిన పాటలని మూడు రోజల తరువాత హైదరాబాద్ లనే ఒక "ప్రమోషనల్ ఈవెంట్" లో విడుదల చేసారు. ఈ ఈవెంట్ కి హీరో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ చిత్ర పాటల సిడీని "లహరి మ్యూజిక్" లేబుల్ పై మార్కెట్ లోకి విడుదల చేసారు.
స్పందన
[మార్చు]పాటలు మంచి విజయాన్ని సాధించాయి, సినీ విమర్శకుల నుండి కూడా మంచి స్పందన వచ్చింది. "ఎందరో మహానుభావులు" పాటకి మంచి గుర్తింపు వచ్చింది. రాష్ట్రం ల ఉన్న అన్ని ఎఫ్.ఎం.స్టేషన్ ల ఈ పాటలు బాగానే ప్రసారం అవుతున్నాయి.ప్రముఖ దినపత్రిక "టైమ్స్ అఫ్ ఇండియా" దీనికి 5 కి 3.5 రేటింగ్ ఇచ్చింది.
చిత్ర పాటలు[4]
క్రమసంఖ్య | పేరు | గీత రచన | Artist(s) | నిడివి | |||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "మొట్ట మొదటిసారి" | రామజోగయ్య శాస్త్రి | సచిన్ వార్రిఎర్ | 03:55 | |||||
2. | "హలో హలో" | శ్రీ మణి | కార్తీక్, చిన్మయి | 03:33 | |||||
3. | "భలే భలే మగాడివోయ్" | భాస్కరభట్ల | కార్తీక్, భోగరాజు మోహన | 03:47 | |||||
4. | "ఎందరో మహానుభావులు" | రామజోగయ్య శాస్త్రి | రేణుక అరుణ్ | 03:50 | |||||
5. | "హౌ హౌ" | భాస్కరభట్ల | కార్తీక్ | 03:50 | |||||
18:52 |
విడుదల
[మార్చు]"భలే భలే మగాడివోయ్" 2015 సెప్టెంబరు 4 న ప్రపంచవ్యాప్తంగా 700 సెంటర్లలో మంచు విష్ణు "డైనమైట్", విశాల్ డబ్బింగ్ సినిమా "జయసూర్య" మీద పోటిగా వచ్చి మంచి విజయాన్ని సాధించింది సినీ గాలక్సీ అనే సంస్థ ఈ సినిమా యుక్క అన్ని ఓవర్సీస్ హక్కులు తీసుకుంది. ఈ సినిమా అమెరికాలో 115 సెంటర్లలో ప్రదర్శింపబడింది.
పురస్కారాలు
[మార్చు]అవార్డు | విభాగం | పోటీదారు | ఫలితం | మూలాలు |
---|---|---|---|---|
ఐఫా ఉత్సవం 2015 | ఉత్తమ చిత్రం | బన్నీవాసు | ఓటమి | [5] |
ఉత్తమ హీరో | నాని | ఓటమి | ||
ఉత్తమ హీరోయిన్ | లావణ్య త్రిపాఠి | ఓటమి | ||
ఉత్తమ హాస్య నటుడు | వెన్నెల కిషోర్ | గెలుపు | ||
సైమా అవార్డులు 2015 | ఉత్తమ హాస్యనటుడు | వెన్నెల కిషోర్ | విజేత |
మూలాలు
[మార్చు]- ↑ Chowdary, Y. Sunita (17 November 2015). "Weave in the laughs". The Hindu. Archived from the original on 17 నవంబరు 2015. Retrieved 28 November 2015.
- ↑ ఆంధ్రప్రభ, సినిమా (22 April 2018). "అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టునయ్యా – నరేష్ – Andhra Prabha Telugu Daily". రమేష్ గోపిశెట్టి. Archived from the original on 19 జూలై 2020. Retrieved 19 July 2020.
- ↑ Jonnalagedda, Pranita (3 September 2015). "I forget to wear my shoes sometimes: Nani". The Times of India. Archived from the original on 25 నవంబరు 2015. Retrieved 25 November 2015.
- ↑ "Bhale Bhale Magadivoi". Saavn. 15 August 2015. Archived from the original on 28 నవంబరు 2015. Retrieved 11 డిసెంబరు 2015.
- ↑ H. Hooli, Shekhar (22 November 2015). "Rajamouli's 'Baahubali', Mahesh's 'Srimanthudu' top IIFA Utsavam 2015 nomination list". International Business Times India. Archived from the original on 29 నవంబరు 2015. Retrieved 29 November 2015.