లావణ్య త్రిపాఠి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లావణ్య త్రిపాఠి
లావణ్య త్రిపాఠి
జననం (1991-12-15) 1991 డిసెంబరు 15 (వయసు 31)[1]
వృత్తినటి, రూపదర్శి
క్రియాశీల సంవత్సరాలు2008–ఇప్పటి వరకు

లావణ్య త్రిపాఠి ఒక మోడల్, సినీ నటి. తెలుగు, తమిళ, హిందీ భాషలలో పలు చిత్రాలలో నటించింది. 2012 లో వచ్చిన అందాల రాక్షసి సినిమా ద్వారా లావణ్య చిత్రరంగంలోకి ప్రవేశించింది.

బాల్యం[మార్చు]

లావణ్య త్రిపాఠి ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో జన్మించింది. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్లో పెరిగింది.[2] ఆమె తండ్రి హైకోర్టు న్యాయవాది, తల్లి ఉపాధ్యాయినిగా పదవీ విరమణ చేసింది. ఆమెకు ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు.[3] మార్షల్స్ స్కూల్ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత ఆమె ముంబైకి వెళ్ళి రిషి దయారాం నేషనల్ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో పట్టా పుచ్చుకుంది.[3][4]

ఆమెకు చిన్నప్పటి నుంచీ గ్లామర్ పరిశ్రమలో ప్రవేశించాలని ఉండేది. కానీ తండ్రి కోరిక మేరకు చదువు పూర్తి చేసి తరువాత మోడలింగ్ లో, టీవీ కార్యక్రమాల్లోకి ప్రవేశించింది.[2] 2006 లో ఆమె మిస్ ఉత్తరాఖండ్ కిరీటం గెలుచుకున్నది.

నిశ్చితార్థం[మార్చు]

లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ల నిశ్చితార్థం 2023 జూన్ 09న హైదరాబాద్‌లోని నాగబాబు ఇంట్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది.[5][6] వరుణ్‌తేజ్- లావణ్య త్రిపాఠిల వివాహం నవంబరు 01న  ఇటలీ సియెనాలోని బోర్గోశాన్ ఫెలిసీ రిసార్ట్‌లో జరిగింది.[7][8]

నటించిన చిత్రాలు[మార్చు]

తెలుగు[మార్చు]

మూస:శ్రీరస్తూశుభమస్తు (2016)

హిందీ[మార్చు]

తమిళము[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Happy Birthday Lavanya Tripathi: జనం మదిలో ఇప్పటికీ 'అందాల రాక్షసి'గానే.. లావణ్య త్రిపాఠి రేర్ పిక్స్!". Zee News Telugu. Retrieved 15 December 2022.
  2. 2.0 2.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2016-09-24.
  3. 3.0 3.1 "Exclusive Interview With Lavanya Tripathi". Aboututtarakhand.com. 2009-07-07. Archived from the original on 2018-09-22. Retrieved 2013-08-19.
  4. "Interviews". Tellychakkar.com. Archived from the original on 2011-05-29. Retrieved 2013-08-19.
  5. 10TV Telugu (10 June 2023). "లావణ్య - వరుణ్ తేజ్ లవ్ స్టోరీ తెలుసా..? ఎప్పట్నించి ప్రేమించుకుంటున్నారో చెప్పేశారు." Archived from the original on 10 June 2023. Retrieved 10 June 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Sakshi (9 June 2023). "అలా ప్రేమలో.. వరుణ్‌, లావణ్య త్రిపాఠి లవ్‌స్టోరీకి ఐదేళ్లు". Archived from the original on 10 June 2023. Retrieved 10 June 2023.
  7. Eenadu (2 November 2023). "మూడు ముళ్లతో ఒక్కటైన వరుణ్‌ తేజ్ - లావణ్య త్రిపాఠి.. ఫొటోలు". Archived from the original on 2 November 2023. Retrieved 2 November 2023.
  8. V6 Velugu (1 November 2023). "మూడు ముళ్లతో ఒక్కటైన వరుణ్‌ తేజ్-లావణ్య త్రిపాఠి". Archived from the original on 2 November 2023. Retrieved 2 November 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లంకెలు[మార్చు]