శ్రీరస్తు శుభమస్తు (2016)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీరస్తు శుభమస్తు
దర్శకత్వంపరశురామ్
రచనపరశురామ్ (కథ, స్క్రీన్ ప్లే)
నిర్మాతఅల్లు అరవింద్
తారాగణంఅల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి, ప్రకాష్ రాజ్, రావు రమేష్, తనికెళ్ళభరణి, సుబ్బరాజు, అలీ
ఛాయాగ్రహణంమణికందన్
కూర్పుమార్తాండ్ కె.వెంకటేష్
సంగీతంఎస్.ఎస్. తమన్
విడుదల తేదీ
ఆగస్టు 5, 2016 (2016-08-05)
దేశంభారతదేశం
భాషతెలుగు

శ్రీరస్తు శుభమస్తు 2016 లో పరశురామ్ దర్శకత్వంలో విడుదలైన ప్రేమ కథాచిత్రం. ఇందులో అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి ముఖ్యపాత్రలు పోషించారు.[1]

కోటీశ్వరుడు (ప్రకాష్ రాజ్) కొడుకు సిరి (అల్లు శిరీష్). అనన్యను (లావణ్య త్రిపాఠీ)ని తొలి చూపులోనే ఇష్టపడతాడు. అనన్యది మధ్యతరగతి కుటుంబం. ఆమె తండ్రి (రావు రమేష్) అప్పుచేసైనా కూతురిని గారాబంగా చూసుకుంటుంటాడు. సిరి వాళ్ళనాన్న ఆడపిల్లలు డబ్బున్న అబ్బాయిలను ప్రేమపేరుతో వశపరచుకుంటారని అభిప్రాయం వెలిబుచ్చుతాడు. ఆయనమాట సత్యంకాదని భావించిన సిరి అది నిరూపించాలని అనుకుంటాడు. తరువాత సిరి అనన్యకు తనను తాను ఒక అనామకునిగా పరిచయం చేసుకుంటాడు. మెల్లగా వారిద్దరూ ఒకేరూములో నివసిస్తూ ఉంటారు. అలా సిరి అనన్యకు చేదోడువాదోడుగా ఉంటారు. క్రమంగా అనన్య సిరిని ఇష్టపడడం ప్రారంభిస్తుంది. అనుకోని మలుపుగా అనన్య తండ్రి ఆమెకు ఓ గొప్పింటి సంబంధం కుదిర్చాడు. తండ్రి మాట త్రోసిపుచ్చలేక అనన్య పెళ్ళికి అంగీకారం తెలియజేస్తుంది. సిరి తన ప్రేమను దక్కించుకుని తండ్రి అభిప్రాయం సరికాదని ఋజువు చేయడమే కథ.

తారాగణం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Nadadhur, Srivathsan. "Srirastu Subhamastu: The 'family' hangover". thehindu.com. Retrieved 5 December 2017.