మిస్ పర్ఫెక్ట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిస్ పర్ఫెక్ట్
Theatrical release poster
దర్శకత్వంవిశ్వక్‌ ఖండేరావ్‌
స్క్రీన్ ప్లేఫ్రాన్సిస్ థామస్, శృతి రామచంద్రన్
కథఫ్రాన్సిస్ థామస్, శృతి రామచంద్రన్
నిర్మాత
 • సుప్రియ
తారాగణం
ఛాయాగ్రహణంఆదిత్య జవ్వాడి
కూర్పురవితేజ గిరజాల
సంగీతంప్రశాంత్ ఆర్ విహారి
నిర్మాణ
సంస్థ
అన్నపూర్ణ స్డూడియో
విడుదల తేదీ
2 ఫిబ్రవరి 2024 (2024-02-02)
దేశంభారతదేశం
భాషతెలుగు

మిస్‌ పర్ఫెక్ట్‌ 2024లో విడుదలైన తెలుగు వెబ్ సిరీస్. అన్నపూర్ణ స్డూడియో బ్యానర్‌పై సుప్రియ నిర్మించిన ఈ సినిమాకు విశ్వక్‌ ఖండేరావ్‌ దర్శకత్వం వహించాడు. లావణ్య త్రిపాఠి, అభిజీత్, అభిజ్ఞ, హర్ష వర్ధన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 22న విడుదల చేసి[1], వెబ్ సిరీస్‌ను ఫిబ్రవరి 2న డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ ఓటీటీలో విడుదలైంది.

లావణ్య రావు (లావణ్య త్రిపాఠి) ఢిల్లీలో మేనేజ్‍మెంట్ కన్సల్టెంట్‍గా పని చేస్తూ ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా హైదరాబాద్‍కు వస్తుంది. లావణ్యకు క్లీనింగ్ అంటే ఇష్టం, ప్రతీది క్లీన్‍గా, పర్‌ఫెక్ట్‌గా ఉండాలనుకుంటుంది. హైదరాబాద్ రాగానే కరోనా వైరస్ కారణంగా లాక్‍డౌన్ పడుతుంది. హైదరాబాద్‍లో లావణ్య ఉండే అపార్ట్‌మెంట్లో వేరే ఫ్లాట్‍లో రోహిత్ (అభిజిత్) ఉంటాడు. దీంతో లావణ్య, రోహిత్ ఒక కంపెనీ అయినా ఈ విషయం ఇద్దరికీ తెలియదు. లావణ్య ఇంట్లో జ్యోతి (అభిజ్ఞ) పని మనిషిగా చేరుతుంది. కరోనా వల్ల తాను పనికి రాలేకపోతున్నాని, ఈ విషయం రోహిత్‍కు చెప్పాలని లావణ్యను జ్యోతి అడుగుతుంది. దీంతో రోహిత్ ఫ్లాట్‍కు లావణ్య వెళ్లగా ఆ విషయం చెప్పకుండా ఇల్లు గందరగోళంగా ఉంటే క్లీన్ చేస్తుంది. దీంతో లావణ్యను పని మనిషి అనుకుంటాడు రోహిత్. లావణ్య నిజం తెబుదామనే ప్రయత్నిస్తూనే చెప్పకుండా లక్ష్మి అనే పేరుతో రోజూ రోహిత్ ఇంటికి వెళుతుంటుంది. ఈ క్రమంలో లావణ్యతో రోహిత్ ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో లావణ్య పని మనిషి కాదని, తన పైఆఫీసర్ అని రోహిత్‍కు తెలుస్తుందా? వారి ప్రేమ సక్సెస్ అవుతుందా? అనేదే మిగతా కథ.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
 • బ్యానర్: అన్నపూర్ణ స్డూడియో
 • నిర్మాత: సుప్రియ యార్లగడ్డ
 • కథ, స్క్రీన్‍ప్లే : ఫ్రాన్సిస్ థామస్, శృతి రామచంద్రన్
 • దర్శకత్వం: విశ్వక్ కండేరావ్
 • సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
 • సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాది
 • ఎడిటర్: రవితేజ గిరిజల

మూలాలు

[మార్చు]
 1. A. B. P. Desam (23 January 2024). "లావణ్య 'మిస్ పర్ఫెక్ట్' ట్రైలర్ రిలీజ్ - క్లీనింగ్ వ్యసనంగా మారితే ఇలాగే ఉంటుందేమో!". Archived from the original on 25 January 2024. Retrieved 25 January 2024.
 2. Eenadu (3 February 2024). "రివ్యూ: మిస్‌ పర్‌ఫెక్ట్‌.. లావణ్య త్రిపాఠి నటించిన వెబ్‌సిరీస్‌ ఎలా ఉందంటే?". Archived from the original on 8 February 2024. Retrieved 8 February 2024.
 3. Eenadu (11 January 2024). "'మిస్‌ పర్‌ఫెక్ట్‌'గా లావణ్య త్రిపాఠి.. హీరో ఎవరంటే..?". Archived from the original on 25 January 2024. Retrieved 25 January 2024.
 4. 10TV Telugu (31 January 2024). "బిగ్‌బాస్ అభిజీత్.. చాలా గ్యాప్ తర్వాత ఇంటర్వ్యూ.. 'మిస్ పర్ఫెక్ట్' కోసం" (in Telugu). Archived from the original on 8 February 2024. Retrieved 8 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)