అభిజీత్ దుద్దల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అభిజీత్ దుద్దల
జననం (1988-10-11) 1988 అక్టోబరు 11 (వయసు 35)
హైదరాబాదు
వృత్తినటుడు
ఎత్తు5’10

అభిజీత్ దుద్దల (జననం 1988 అక్టోబరు 11) భారతీయ సినిమా నటుడు. ఆయన 2012 లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో విడుదలైన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రంలో "శ్రీను" పాత్రలో ప్రధాన పాత్ర పోషించి తెలుగు సినిమాలో ప్రవేశించాడు.[1]

ప్రారంభ జీవితం

[మార్చు]

ఆయన మన్‌మోహన్ దుద్దల, లక్ష్మీ ప్రసన్న దుద్దల లకు 1988 అక్టోబరు 11 లో జన్మిచాడు. వారి పూర్వీకులు హైదరాబాదుకు చార్మినారు నిర్మాణంలో పనిచేయుటకు వలస వచ్చారు. ఆయన ముత్తాత నిర్మాణపనివాడు. ఆయన కుటుంబం అప్పటి నుండి నిర్మాణ పనులు, కాంట్రాక్ట్ పనులు చేసేది.

తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాదు జిల్లాకు చెందిన కాడెం ప్రాజెక్టు ఆయన తాత దుద్దల నరసయ్య చే నిర్మించబడింది.

అభిజీత్ యొక్క కిండర్ గార్టెన్ విద్య చైతన్య విద్యాలయలో ప్రారంభమైనది. ఆయన ప్రాథమిక, ఉన్నత విద్యను చిత్తూరు జిల్లాకు చెందిన మదనపల్లెలో జిడ్డు కృష్ణమూర్తి చే స్థాపించబడిన ఋషి వాలీ స్కూల్ లో జరిగింది. ఆయన హైదరాబాదు లోని జవహర్ లాల్ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం నుండి ఆరోనాటికల్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసాడు.

కళాశాలలోని చివరి సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల యొక్క అసిస్టెంట్ డైరక్టర్ ఆయన యొక్క ప్రొఫైల్ ను సోషన్ నెట్‌వర్క్ లో చూసి ఆయనను "లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్" చిత్రానికి ఆడిషన్ కొరకు పిలిచాడు. ఆయన ఆ చిత్రంలో అమల అక్కినేని యొక్క కుమారునిగా ప్రధాన పాత్రలో నటించాడు.[2]

జీవితం

[మార్చు]

ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వం లోని తెలుగు చిత్రం "లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్" ద్వారా తెరంగేట్రం చేసాడు.[3] ఆ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై 22 కోట్ల రూపాయల వసూళ్ళను మొదటి వారంలో చేసి బాక్సాఫీస్ హిట్ గా ప్రకటించబడింది. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల యొక్క పూర్వపు చిత్రం అయిన హ్యాపీ డేస్ చిత్రంలో అనేక పోలికలు వచ్చాయి. ఆయన రెండవ చిత్రం అరెరె [4][5] ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించాడు. దీనికి నీలిమ తిరుమలశెట్టి సంఘమిత్ర ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించింది.ప్రస్తుతం బిగ్ బాస్ 4 లో కండెండర్ గా విజయం సాధించారు.[6][7]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష సహనటులు వివరాలు
2012 లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ శ్రీను తెలుగు శ్రియ సరణ్, అంజలా జావేరి, అమల అక్కినేని విడుదల 2012 సెప్టెంబరు 14
2014 అరెరె అఖిల్ తెలుగు తణికళ్ళ భరణి, నాజర్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు నిర్మాణంలో
2014 మిర్చి లాంటి కుర్రాడు సిద్ధు తెలుగు ప్రగ్య జైశ్వాల్, రావు రమేష్,, సప్తగిరి విడుదల 2014 డిసెంబరు 12
2015 రామ్-లీల క్రిష్ తెలుగు భాను చందర్, హవిష్, నందిత రాజ్, అలీ, సప్తగిరి విడుదల 2015 ఫిబ్రవరి 27
2017 పెళ్ళి గొల రిషి తెలుగు వర్షిని సుందరరాజన్ వెబ్ సిరీస్
2024
మిస్ పర్ఫెక్ట్

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]