Jump to content

నందిత రాజ్

వికీపీడియా నుండి
నందిత రాజ్
జననం (1994-08-30) 1994 ఆగస్టు 30 (వయసు 30)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2012— ప్రస్తుతం

నందిత రాజ్ తెలుగు చలనచిత్ర నటీమణి. 2012లో తేజ దర్శకత్వంలో వచ్చిన నీకు నాకు డాష్ డాష్ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయింది.[1]

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

నందిత 1994, ఆగస్టు 30న రాజ్ కుమార్ (సైన్యాధికారి), వస్థిరాజ్ (న్యాయ సలహాదారిణి) దంపతులకు ముంబై లో జన్మించింది. నందిత ఆమ్మమ్మ వాళ్ళ ఊరు విశాఖపట్నం. తండ్రి బదిలీతో హైదరాబాద్ వచ్చిన నందిత, ఆర్.కె.పురంలోని సైనిక పాఠశాలలో ఉన్నత విద్యను పూర్తిచేసి, సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో బి.కాం. చదివింది.

సినీరంగ ప్రస్థానం

[మార్చు]

2012లో తేజ దర్శకత్వంలో వచ్చిన నీకు నాకు డాష్ డాష్ అనే తెలుగు సినిమా ద్వారా తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. ఆ తరువాత పోసాని సుధీర్ బాబు తో నటించిన ప్రేమకథా చిత్రమ్ అనే సినిమా నందితకు పేరుని తెచ్చిపెట్టింది.

నటించిన చిత్రాల జాబితా

[మార్చు]
సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2012 నీకు నాకు డాష్ డాష్ గాయత్రి తెలుగు
2013 ప్రేమకథా చిత్రమ్ నందిత తెలుగు నామినేట్ - ఫిలిఫేర్ ఉత్తమనటి – తెలుగు
2014 లండన్ బ్రిడ్జి[2] మెరిన్ మళయాలం
2014 లవర్స్ చిత్ర తెలుగు
2015 రాంలీల సస్య తెలుగు
2015 కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ రాధ తెలుగు
2015 శంకరాభరణం హ్యాపీ తెలుగు
2016 సావిత్రి సావిత్రి తెలుగు
2017 జై లవకుశ[3] తెలుగు
2017 కథలో రాజకుమారి తెలుగు
2019 విశ్వామిత్ర[4][5] తెలుగు

మూలాలు

[మార్చు]
  1. తెలుగు వెబ్ దునియా. "మంచి కథల కోసం ఎదురుచూస్తున్నా.. అలాంటి మాటల్ని నమ్మొద్దు: నందిత రాజ్". /telugu.webdunia.com. Archived from the original on 16 January 2017. Retrieved 22 May 2017.
  2. సాక్షి. "లవ్ ఇన్ లండన్ మూవీ పోస్టర్స్". Retrieved 22 May 2017.[permanent dead link]
  3. నమస్తే తెలంగాణ. "జై లవకుశలోకి ఎంట్రీ ఇచ్చిన మరో హీరోయిన్!". Retrieved 22 May 2017.[permanent dead link]
  4. సాక్షి, సినిమా (14 April 2019). "ఊహకు అందని విషయాలతో..." Archived from the original on 14 April 2019. Retrieved 10 February 2020.
  5. సాక్షి, సినిమా (16 February 2019). "సృష్టిలో ఏదైనా సాధ్యమే". Archived from the original on 16 February 2019. Retrieved 10 February 2020.