విశ్వామిత్ర (2019 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విశ్వామిత్ర
విశ్వామిత్ర సినిమా పోస్టర్
దర్శకత్వంరాజకిరణ్
రచనఆకెళ్ళ వంశీ కృష్ణ (మాటలు)
నిర్మాతమాధవి అద్దంకి
ఎస్. రజినికాంత్
రాజకిరణ్
ఫణి తిరుమలసెట్టిసమర్పణ
తారాగణంప్రసన్న
నందిత రాజ్
అశుతోష్ రాణా
సత్యం రాజేష్
ఛాయాగ్రహణంఅనిల్ బండారి
కూర్పుఉపేంద్ర
సంగీతంఅనూప్ రూబెన్స్
నిర్మాణ
సంస్థలు
రాజ కిరణ్ సినిమాస్
మధురం మూవీ క్రియేషన్స్
విడుదల తేదీ
14 జూన్ 2019 (2019-06-14)
సినిమా నిడివి
133 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

విశ్వామిత్ర 2019, జూన్ 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. రాజకిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రసన్న, నందిత రాజ్, అశుతోష్ రాణా, సత్యం రాజేష్ ముఖ్యపాత్రల్లో నటించగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.

కథా సారాంశం

[మార్చు]

జీవితంలో ఎదురయ్యే వాళ్ళందరూ మంచివాళ్ళే, మనవాళ్లే అనుకునే మధ్యతరగతి అమ్మాయి మిత్ర (నందిత రాజ్) కు అనుకోకుండా ఒక ఆపద వస్తుంది. ఆ సమయంలో ఒక అజ్ఞాత వ్యక్తి ఆమెకు సహాయంగా నిలబడ్డాడు. ఆ ఆపద ఏమిటి, ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ.[1][2]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: రాజకిరణ్
  • నిర్మాత: మాధవి అద్దంకి, ఎస్. రజినికాంత్, రాజకిరణ్
  • సమర్పణ: ఫణి తిరుమలసెట్టి
  • మాటలు: ఆకెళ్ళ వంశీ కృష్ణ
  • సంగీతం: అనూప్ రూబెన్స్
  • ఛాయాగ్రహణం: అనిల్ బండారి
  • కూర్పు: ఉపేంద్ర
  • నిర్మాణ సంస్థ: రాజ కిరణ్ సినిమాస్, మధురం మూవీ క్రియేషన్స్

నిర్మాణం

[మార్చు]

యునైటెడ్ స్టేట్స్, స్విట్జర్లాండ్, న్యూజీలాండ్ దేశాలలో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీయబడిందని దర్శకుడు రాజకిరణ్ తెలిపాడు.[3][4][5][6] నందిత రాజ్ ప్రధాన పాత్రలో నటించింది.[7] రాజకిరణ్ దర్శకత్వంలో 2014లో వచ్చిన గీతాంజలి, 2015లో వచ్చిన త్రిపుర సినిమాల తరహాలోనే ఈ సినిమా కూడా భయానక చిత్రంగా రూపొందించబడింది.[3]

విడుదల

[మార్చు]

2019, ఫిబ్రవరిలో ఈ చిత్ర ట్రైలర్ విడుదలయింది.[8] ఈ చిత్రం మార్చి 21న విడుదల కావాల్సింది, కానీ మే నెలలో విడుదల చేయాలకున్నా సాంకేతిక కారణాల వల్ల మరింత ఆలస్యం అయింది.[4][9] ఈ చిత్రం జూన్ 14న విడుదలయింది.[10]

మూలాలు

[మార్చు]
  1. సాక్షి, సినిమా (14 April 2019). "ఊహకు అందని విషయాలతో..." Archived from the original on 14 April 2019. Retrieved 10 February 2020.
  2. బిబిసి న్యూస్, తెలుగు (16 June 2019). "విశ్వామిత్ర సినిమా రివ్యూ: కమెడియన్ సత్యం రాజేష్ హీరోగా మెప్పించాడా?". కె.సరిత. Archived from the original on 2020-02-10. Retrieved 10 February 2020.
  3. 3.0 3.1 "Raj Kiran's 'Viswamitra' launched: Director opts for preferred genre once again". The Times of India. Retrieved 9 February 2020.
  4. 4.0 4.1 "'Viswamitra': The Raj Kiran directorial gets a release date". The Times of India. Retrieved 9 February 2020.
  5. "Vishwamitra, a true-life story". The Hans India. 13 October 2018. Retrieved 9 February 2020.
  6. సాక్షి, సినిమా (16 February 2019). "సృష్టిలో ఏదైనా సాధ్యమే". Archived from the original on 16 February 2019. Retrieved 10 February 2020.
  7. "Raj Kiran is back with a new suspense thriller, Viswamitra". The Times of India. Retrieved 9 February 2020.
  8. "'Viswamitra': The trailer of the Nanditha Raj starrer will leave you intrigued". The Times of India. Retrieved 9 February 2020.
  9. "'Viswamitra': The Nandita Raj starrer is set for a May release". The Times of India. Retrieved 9 February 2020.
  10. "'Vishwamitra' gets U/A certification; gears up for release on June 14 - Times of India". The Times of India. Retrieved 9 February 2020.

ఇతర లంకెలు

[మార్చు]